ప్రభన్యూస్

నెల్లూరు నుంచి కుప్పం వరకు సీఎం చంద్రబాబు పర్యటన.. సంక్షేమం, పెట్టుబడులు, స్టీల్ ప్లాంట్‌పై ఫోకస్..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 1 నుంచి 5వ తేదీ వరకు వరుసగా ఐదు రోజుల పాటు నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు.

News18
News18

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 1 నుంచి 5వ తేదీ వరకు వరుసగా ఐదు రోజుల పాటు నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో సంక్షేమ పథకాల అమలు, పారిశ్రామికాభివృద్ధి, భారీ పెట్టుబడులు, ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రజలకు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రతి జిల్లాలో ప్రత్యక్షంగా ప్రజలతో మమేకమవుతూ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. విశేషమేమిటంటే.. ఈ పర్యటన సందర్భంగా ఆయా జిల్లాల్లోనే ముఖ్యమంత్రి బస చేయనున్నారు.

జూలై 1న నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో నిర్వహించే ‘పేదల సేవలో’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు సామాజిక భద్రత పింఛన్లను స్వయంగా పంపిణీ చేయనున్నారు. అనంతరం తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీ సిటీలో రూ.750 కోట్ల భారీ పెట్టుబడితో హీరో మోటోకార్ప్ ఏర్పాటు చేయనున్న గ్లోబల్ పార్ట్స్ సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి మరిన్ని పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షితమవడంతో పాటు వేలాది మంది యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అదే రోజు రాత్రి ముఖ్యమంత్రి శ్రీ సిటీలోనే బస చేయనున్నారు.

జూలై 2న తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ ఆజీవికా మిషన్ (VB G RAM G) కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంపొందించడం, జీవనోపాధిని బలోపేతం చేయడం లక్ష్యంగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అనంతరం సాయంత్రం తిరుపతి నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో నిర్వహించే జీఎస్‌డీపీ కెపాసిటీ బిల్డింగ్ వర్క్‌షాప్‌లో పాల్గొంటారు. ఈ సమావేశానికి నీతి ఆయోగ్ సభ్యులతో పాటు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ప్రతినిధులు, ఆర్థిక నిపుణులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, వృద్ధి వ్యూహాలు, భవిష్యత్ అభివృద్ధి కార్యాచరణపై ఈ సమావేశంలో సమగ్ర చర్చలు జరగనున్నాయి. ఆ రోజు రాత్రి తిరుపతిలోనే ముఖ్యమంత్రి బస చేస్తారు.

జూలై 3న కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లెలో ప్రతిష్ఠాత్మక రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులను ముఖ్యమంత్రి అధికారికంగా ప్రారంభించనున్నారు. రాయలసీమ ప్రాంత పారిశ్రామికాభివృద్ధికి ఈ ప్రాజెక్టు కీలక మైలురాయిగా నిలవనుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా స్థానికంగా భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు ఏర్పడటంతో పాటు అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి కూడా ఊతం లభించనుంది.

అనంతరం ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లా కుప్పంకు చేరుకుని జూలై 3 నుంచి 5వ తేదీ వరకు వరుసగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ మూడు రోజులలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, పూర్తయిన ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు నిర్వహించడంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, మౌలిక వసతుల కల్పన, తాగునీరు, రహదారులు, విద్య, వైద్యం వంటి అంశాలపై ప్రత్యేకంగా సమీక్ష చేపట్టనున్నట్లు సమాచారం.

జూలై 5న కుప్పంలో పర్యటన ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి అమరావతికి తిరుగు ప్రయాణం కానున్నారు. మొత్తం ఐదు రోజుల ఈ జిల్లా పర్యటనలో సంక్షేమం, పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి, పెట్టుబడులు, మౌలిక వసతుల విస్తరణకు సంబంధించిన కీలక కార్యక్రమాలు చేపట్టడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి మరింత వేగం తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 June 2026, 11:01 am Digital Edition : Prabhanews
నెల్లూరు నుంచి కుప్పం వరకు సీఎం చంద్రబాబు పర్యటన.. సంక్షేమం, పెట్టుబడులు, స్టీల్ ప్లాంట్‌పై ఫోకస్..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jun 29, 2026 9:45 AM ISTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 1 నుంచి 5వ తేదీ వరకు వరుసగా ఐదు రోజుల పాటు నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. News18ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 1 నుంచి 5వ తేదీ వరకు వరుసగా ఐదు రోజుల పాటు నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో సంక్షేమ పథకాల అమలు, పారిశ్రామికాభివృద్ధి, భారీ పెట్టుబడులు, ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రజలకు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రతి జిల్లాలో ప్రత్యక్షంగా ప్రజలతో మమేకమవుతూ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. విశేషమేమిటంటే.. ఈ పర్యటన సందర్భంగా ఆయా జిల్లాల్లోనే ముఖ్యమంత్రి బస చేయనున్నారు.జూలై 1న నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో నిర్వహించే 'పేదల సేవలో' కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు సామాజిక భద్రత పింఛన్లను స్వయంగా పంపిణీ చేయనున్నారు. అనంతరం తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీ సిటీలో రూ.750 కోట్ల భారీ పెట్టుబడితో హీరో మోటోకార్ప్ ఏర్పాటు చేయనున్న గ్లోబల్ పార్ట్స్ సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి మరిన్ని పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షితమవడంతో పాటు వేలాది మంది యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అదే రోజు రాత్రి ముఖ్యమంత్రి శ్రీ సిటీలోనే బస చేయనున్నారు.జూలై 2న తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ ఆజీవికా మిషన్ (VB G RAM G) కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంపొందించడం, జీవనోపాధిని బలోపేతం చేయడం లక్ష్యంగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అనంతరం సాయంత్రం తిరుపతి నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో నిర్వహించే జీఎస్‌డీపీ కెపాసిటీ బిల్డింగ్ వర్క్‌షాప్‌లో పాల్గొంటారు. ఈ సమావేశానికి నీతి ఆయోగ్ సభ్యులతో పాటు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ప్రతినిధులు, ఆర్థిక నిపుణులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, వృద్ధి వ్యూహాలు, భవిష్యత్ అభివృద్ధి కార్యాచరణపై ఈ సమావేశంలో సమగ్ర చర్చలు జరగనున్నాయి. ఆ రోజు రాత్రి తిరుపతిలోనే ముఖ్యమంత్రి బస చేస్తారు.జూలై 3న కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లెలో ప్రతిష్ఠాత్మక రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులను ముఖ్యమంత్రి అధికారికంగా ప్రారంభించనున్నారు. రాయలసీమ ప్రాంత పారిశ్రామికాభివృద్ధికి ఈ ప్రాజెక్టు కీలక మైలురాయిగా నిలవనుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా స్థానికంగా భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు ఏర్పడటంతో పాటు అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి కూడా ఊతం లభించనుంది.అనంతరం ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లా కుప్పంకు చేరుకుని జూలై 3 నుంచి 5వ తేదీ వరకు వరుసగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ మూడు రోజులలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, పూర్తయిన ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు నిర్వహించడంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, మౌలిక వసతుల కల్పన, తాగునీరు, రహదారులు, విద్య, వైద్యం వంటి అంశాలపై ప్రత్యేకంగా సమీక్ష చేపట్టనున్నట్లు సమాచారం.జూలై 5న కుప్పంలో పర్యటన ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి అమరావతికి తిరుగు ప్రయాణం కానున్నారు. మొత్తం ఐదు రోజుల ఈ జిల్లా పర్యటనలో సంక్షేమం, పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి, పెట్టుబడులు, మౌలిక వసతుల విస్తరణకు సంబంధించిన కీలక కార్యక్రమాలు చేపట్టడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి మరింత వేగం తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link