Last Updated:
తెలంగాణలో సర్ ప్రక్రియ మొదలైంది. ఎన్నికల అధికారులు.. ఓటర్ల జాబితాలను పరిశీలిస్తున్నారు. జాబితా ప్రకారం.. ఆయా ఓటర్లు నిజంగా ఉన్నారా లేదా అనేది పరిశీలిస్తున్నారు. తద్వారా నిజమైన ఓటర్లను మాత్రమే లిస్టులో పేర్లు ఉంచుతున్నారు. తద్వారా వారు మాత్రమే ఇకపై ఎన్నికల్లో ఓటు వేసే ఛాన్స్ ఉంటుంది. వారికి మాత్రమే.. ప్రభుత్వ పథకాలు అందే ఛాన్స్ ఉంటుంది. ఓటరుగా గుర్తింపు లేని వారికి ప్రభుత్వం పథకాలు లభించవు. ఇది కొంతమందిలో ఆందోళన కలిగిస్తోంది.
హైదరాబాద్.. బోరబండలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఓటర్ల జాబితాకి సంబంధించిన ‘సర్’లో తన పేరు లేదని ఆందోళన చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
బోరబండ లోని భరత్‌నగర్.. లంబగుండులో ఈ ఘటన జరిగింది. 51 ఏళ్ల షేక్ ముజీబుర్ రెహ్మాన్.. ఇంటి ముందు ఉన్న షెడ్‌లో సూసైడ్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తనను జైలుకు పంపుతారేమో, పిల్లల్ని చూసుకోలేనేమో అని ఆందోళన చెంది ప్రాణాలు తీసుకున్నాడని స్థానికులు అంచనా వేస్తున్నారు.
ఇది నిజమేనా? సర్‌లో పేరు లేకపోతే, ఎవరైనా సూసైడ్ చేసుకుంటారా అనే సందేహాలు స్థానికంగా వ్యక్తం అవుతున్నాయి. అందువల్ల పోలీసులు ఇది నిజంగానే ఆత్మహత్యా కాదా అనేది తేల్చాల్సి ఉంటుంది.
తెలంగాణలో సర్ ప్రక్రియ మొదలైంది. ఎన్నికల అధికారులు.. ఓటర్ల జాబితాలను పరిశీలిస్తున్నారు. జాబితా ప్రకారం.. ఆయా ఓటర్లు నిజంగా ఉన్నారా లేదా అనేది పరిశీలిస్తున్నారు. తద్వారా నిజమైన ఓటర్లను మాత్రమే లిస్టులో పేర్లు ఉంచుతున్నారు. తద్వారా వారు మాత్రమే ఇకపై ఎన్నికల్లో ఓటు వేసే ఛాన్స్ ఉంటుంది. వారికి మాత్రమే.. ప్రభుత్వ పథకాలు అందే ఛాన్స్ ఉంటుంది. ఓటరుగా గుర్తింపు లేని వారికి ప్రభుత్వం పథకాలు లభించవు. ఇది కొంతమందిలో ఆందోళన కలిగిస్తోంది.
సర్ ప్రక్రియను తప్పుపట్టలేమని కేంద్రం చెబుతోంది. నిజమైన ఓటర్లను గుర్తించి, అక్రమాలను సరిచెయ్యడం అవసరం అంటోంది. నిజానికి ఇది ఎన్నికల సంఘం రెగ్యులర్‌గా చేసే పనే. దానికి ఇప్పుడు సర్ అనే పేరుతో చేస్తోంది. అయినప్పటికీ ఇది ఓటర్ కార్డ్ లేని వారికి ఆందోళన కలిగిస్తోంది. అందువల్ల ఈ ప్రక్రియను అలాంటి వారు వ్యతిరేకిస్తున్నారు. కానీ దీన్ని సరిచెయ్యడం ద్వారా దేశంలో ఎన్నికల ప్రక్రియను ప్రక్షాళన చేసినట్లు అవుతుందని కేంద్రం చెబుతోంది.
Hyderabad,Telangana
Jun 29, 2026 10:12 AM IST