ప్రభన్యూస్

పేపర్ లీకేజీల వివాదం: దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం – 26 రోజుల నిరాహార దీక్ష విరమించిన సోనం వాంగ్చుక్.

ప్రభ న్యూస్ ప్రతినిధి న్యూఢిల్లీ :

దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలకు దారితీసిన నీట్ (NEET) ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం, విద్యార్థుల ఉధృత నిరసనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. గత 26 రోజులుగా ఢిల్లీ వేదికగా నిరాహార దీక్ష చేపడుతున్న ప్రముఖ సామాజిక, పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ కేంద్ర మంత్రుల సమక్షంలో గురువారం రాత్రి తన దీక్షను విరమించారు.
ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక హామీ
విద్యార్థుల నిరసనల సందర్భంగా ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చిందని సోనం వాంగ్చుక్ వెల్లడించారు.
కేసుల ఉపసంహరణ: ‘చలో పార్లమెంట్’ సహా ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదు చేసిన అన్ని కేసులను ఎత్తివేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది.
నష్టపరిహారం: బాధితులకు తగిన నష్టపరిహారం చెల్లించే అంశాన్ని పరిశీలిస్తామని కేంద్రం లిఖితపూర్వకంగా (In writing) హామీ ఇచ్చింది.
కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ వాంగ్చుక్‌ను స్వయంగా కలసి ఈ హామీ పత్రాన్ని అందజేసి దీక్ష విరమింపజేశారు.
సుదీర్ఘ మౌనం వీడిన ప్రధాని మోదీ: ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, కఠిన చట్టం
సుమారు నెలన్నర రోజుల సుదీర్ఘ మౌనం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఈ వివాదంపై స్పందించారు. పేపర్ లీకేజీ ఘటనలు అత్యంత తీవ్రమైనవని, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అంశమని తెలిపారు.
ఫాస్ట్ ట్రాక్ కోర్టులు: పేపర్ లీకేజీ బాధ్యులపై వేగవంతమైన విచారణ జరిపి కఠిన శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
నూతన బిల్లు: లీకేజీలను అరికట్టేందుకు అత్యంత కఠినమైన చట్ట ముసద్దాను కేంద్ర కేబినెట్ ఆమోదానికి ఉంచుతున్నామని, వచ్చే వారం పార్లమెంట్ సమావేశాల్లో దీనిని బిల్లు రూపంలో ప్రవేశపెడతా.,….మని వెల్లడించారు.
ఈ క్రమంలో ఇప్పటికే విద్యాశాఖ కార్యదర్శిపై వేటు పడింది.
రాజీనామాకే మొగ్గు చూపుతున్న విపక్షాలు, సిజేపి
ప్రభుత్వం ఇచ్చే హామీలు, బిల్లులు సరిపోవని, ఈ విఫల వ్యవస్థకు రాజకీయ జవాబుదారీతనం (Political Accountability) ఉండాలని ప్రతిపక్షాలు మరియు ఛాత్ర యువా సంఘర్ష్ సమితి (CJP) డిమాండ్ చేస్తున్నాయి.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని వారు పట్టుబడుతున్నారు.
విద్యాశాఖ మంత్రి పదవిలో కొనసాగినంత కాలం పార్లమెంట్‌లో చేసే చర్చలకు విలువ ఉండదని ప్రతిపక్ష నాయకులు స్పష్టం చేశారు.
ప్రభుత్వ తీరుపై స్వపక్షం, ప్రముఖుల తీవ్ర విమర్శలు
ఒకవైపు చర్చలు, హామీలు ఇస్తూనే… మరోవైపు ఆందోళనకారులపై నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ (NSA) ప్రయోగిస్తామనే ప్రచారం రావడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
బిజెపి అగ్రనేత మురళీ మనోహర్ జోషి ఆవేదన:
భాజపా సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి విద్యార్థులపై పోలీసు బలగాల ప్రయోగాన్ని తప్పుపట్టారు. "విద్యార్థులు, ముఖ్యంగా యువతుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు బాధాకరం. పరీక్షల విధానంపై యువత ఆందోళనలు సమంజసమైనవి. దీనిని కేవలం లా అండ్ ఆర్డర్ సమస్యగా చూడకుండా, సానుభూతితో, శాశ్వత పరిష్కారంతో ఎదుర్కోవాలి. లేదంటే ‘వికసిత్ భారత్’ ఆశయాల నుంచి యువత దూరమవుతుంది" అని హెచ్చరించారు.
సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యలు:
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ… "పరీక్షల్లో ఓడిపోవడం తప్పుకాదు, కానీ మోసం చేయడం (Cheating) సరికాదు. ఎప్పుడూ షార్ట్‌కట్‌లను ఎంచుకోకూడదు" అని పేర్కొంటూ పేపర్ లీకేజీలను ఖండించారు .
యువతలో వ్యక్తమైన తీవ్ర ఆగ్రహం, స్వపక్ష నేతల నుంచి వచ్చిన విమర్శలు, సోనం వాంగ్చుక్ చేపట్టిన సుదీర్ఘ దీక్షల ప్రభావంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ స్థాయి చర్యలకు శ్రీకారం చుట్టింది . ఎన్ఎస్ఏ చట్టాలు ప్రయోగిస్తామనే ఆంక్షలను వీడి, విద్యార్థుల సమస్యలను ఆమోదయోగ్యమైన రీతిలో పరిష్కరిస్తేనే ఈ వివాదానికి తెరపడే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 July 2026, 2:04 pm Digital Edition : Prabhanews
<b>పేపర్ లీకేజీల వివాదం: దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం – 26 రోజుల నిరాహార దీక్ష విరమించిన సోనం వాంగ్చుక్.</b>

పేపర్ లీకేజీల వివాదం: దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం – 26 రోజుల నిరాహార దీక్ష విరమించిన సోనం వాంగ్చుక్.

ప్రభ న్యూస్ ప్రతినిధి న్యూఢిల్లీ :

దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలకు దారితీసిన నీట్ (NEET) ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం, విద్యార్థుల ఉధృత నిరసనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. గత 26 రోజులుగా ఢిల్లీ వేదికగా నిరాహార దీక్ష చేపడుతున్న ప్రముఖ సామాజిక, పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ కేంద్ర మంత్రుల సమక్షంలో గురువారం రాత్రి తన దీక్షను విరమించారు.
ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక హామీ
విద్యార్థుల నిరసనల సందర్భంగా ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చిందని సోనం వాంగ్చుక్ వెల్లడించారు.
కేసుల ఉపసంహరణ: 'చలో పార్లమెంట్' సహా ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదు చేసిన అన్ని కేసులను ఎత్తివేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది.
నష్టపరిహారం: బాధితులకు తగిన నష్టపరిహారం చెల్లించే అంశాన్ని పరిశీలిస్తామని కేంద్రం లిఖితపూర్వకంగా (In writing) హామీ ఇచ్చింది.
కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ వాంగ్చుక్‌ను స్వయంగా కలసి ఈ హామీ పత్రాన్ని అందజేసి దీక్ష విరమింపజేశారు.
సుదీర్ఘ మౌనం వీడిన ప్రధాని మోదీ: ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, కఠిన చట్టం
సుమారు నెలన్నర రోజుల సుదీర్ఘ మౌనం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఈ వివాదంపై స్పందించారు. పేపర్ లీకేజీ ఘటనలు అత్యంత తీవ్రమైనవని, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అంశమని తెలిపారు.
ఫాస్ట్ ట్రాక్ కోర్టులు: పేపర్ లీకేజీ బాధ్యులపై వేగవంతమైన విచారణ జరిపి కఠిన శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
నూతన బిల్లు: లీకేజీలను అరికట్టేందుకు అత్యంత కఠినమైన చట్ట ముసద్దాను కేంద్ర కేబినెట్ ఆమోదానికి ఉంచుతున్నామని, వచ్చే వారం పార్లమెంట్ సమావేశాల్లో దీనిని బిల్లు రూపంలో ప్రవేశపెడతా.,....మని వెల్లడించారు.
ఈ క్రమంలో ఇప్పటికే విద్యాశాఖ కార్యదర్శిపై వేటు పడింది.
రాజీనామాకే మొగ్గు చూపుతున్న విపక్షాలు, సిజేపి
ప్రభుత్వం ఇచ్చే హామీలు, బిల్లులు సరిపోవని, ఈ విఫల వ్యవస్థకు రాజకీయ జవాబుదారీతనం (Political Accountability) ఉండాలని ప్రతిపక్షాలు మరియు ఛాత్ర యువా సంఘర్ష్ సమితి (CJP) డిమాండ్ చేస్తున్నాయి.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని వారు పట్టుబడుతున్నారు.
విద్యాశాఖ మంత్రి పదవిలో కొనసాగినంత కాలం పార్లమెంట్‌లో చేసే చర్చలకు విలువ ఉండదని ప్రతిపక్ష నాయకులు స్పష్టం చేశారు.
ప్రభుత్వ తీరుపై స్వపక్షం, ప్రముఖుల తీవ్ర విమర్శలు
ఒకవైపు చర్చలు, హామీలు ఇస్తూనే... మరోవైపు ఆందోళనకారులపై నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ (NSA) ప్రయోగిస్తామనే ప్రచారం రావడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
బిజెపి అగ్రనేత మురళీ మనోహర్ జోషి ఆవేదన:
భాజపా సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి విద్యార్థులపై పోలీసు బలగాల ప్రయోగాన్ని తప్పుపట్టారు. "విద్యార్థులు, ముఖ్యంగా యువతుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు బాధాకరం. పరీక్షల విధానంపై యువత ఆందోళనలు సమంజసమైనవి. దీనిని కేవలం లా అండ్ ఆర్డర్ సమస్యగా చూడకుండా, సానుభూతితో, శాశ్వత పరిష్కారంతో ఎదుర్కోవాలి. లేదంటే 'వికసిత్ భారత్' ఆశయాల నుంచి యువత దూరమవుతుంది" అని హెచ్చరించారు.
సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యలు:
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ... "పరీక్షల్లో ఓడిపోవడం తప్పుకాదు, కానీ మోసం చేయడం (Cheating) సరికాదు. ఎప్పుడూ షార్ట్‌కట్‌లను ఎంచుకోకూడదు" అని పేర్కొంటూ పేపర్ లీకేజీలను ఖండించారు .