రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, చండీగఢ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, జార్ఖండ్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, పుదుచ్చేరి, పంజాబ్, తెలంగాణ, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 100 శాతం రైల్వే విద్యుదీకరణ పూర్తైంది. రాజస్థాన్లో 99.8 శాతం, తమిళనాడులో 98.3 శాతం, అస్సాంలో 97.9 శాతం, కర్ణాటకలో 96.8 శాతం, గోవాలో 91.4 శాతం విద్యుదీకరణ పూర్తైంది. మొత్తంగా చూస్తే, భారతీయ రైల్వేల్లో విద్యుదీకరణ పెరగడం వల్ల ఇంధన ఖర్చులు తగ్గడం, పర్యావరణానికి మేలు జరగడం, రవాణా వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారడం వంటి ప్రయోజనాలు దేశానికి లభించనున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)

