ఈ ఏడాది ప్రారంభంలో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకుని కొనుగోలుదారులను ఆశ్చర్యపరిచాయి. అయితే నవంబర్లో పరిస్థితి పూర్తిగా మారింది. నెల మొదటి ట్రేడింగ్ రోజున డిసెంబర్ 4 గడువు ఉన్న MCX గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు రూ.1,40,186గా ఉండగా, ఆ తర్వాత రూ.1,26,021 స్థాయికి పడిపోయింది. గతంలో నమోదైన గరిష్ట ధరతో పోలిస్తే ఈ పతనం చాలా ఎక్కువగా ఉంది. దీంతో బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)

