జనవరి 2026లో బంగారం, వెండి ధరలు ఆల్‌టైమ్ హైకి చేరడంతో చాలామంది ఇన్వెస్టర్లు భారీ మొత్తంలో కొనుగోళ్లు చేశారు. అయితే ఆ తర్వాత ధరలు ఒక్కసారిగా తగ్గడంతో ఇప్పుడు వాళ్లకు నష్టాలు కనిపిస్తున్నాయి. సురక్షితమైన పెట్టుబడిగా భావించిన బంగారం, వెండి కూడా మార్కెట్ ఒడిదొడుకులకు లోనవుతాయని ఈ పరిణామం మరోసారి గుర్తుచేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం, వెండిని అమ్మేయాలా? ధరలు తగ్గాయి కాబట్టి మరికొంత కొనాలా? లేక ఉన్నవాటిని అలాగే ఉంచుకోవాలా? అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒక్కటే. చేతిలో ఉన్న డబ్బంతా ఒకే రోజు బంగారం లేదా వెండిపై పెట్టుబడి పెట్టకూడదు. 2026 జనవరి 29న 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు సుమారు రూ.17,885కు చేరింది. ఇప్పుడు ఆ ధర దాదాపు రూ.12,780 దగ్గర ఉంది. అంటే గ్రాముపై రూ.5,105 తగ్గింది. 10 గ్రాముల లెక్కన చూస్తే ఏకంగా రూ.51,050 తగ్గినట్టే. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే విధంగా పడిపోయింది. జనవరిలో గ్రాముకు రూ.16,395గా ఉన్న ధర ఇప్పుడు రూ.11,715కు చేరింది. అంటే గ్రాముపై రూ.4,680 తగ్గింది. 10 గ్రాములకు లెక్కిస్తే రూ.46,800 తేడా కనిపిస్తోంది. ఇక అదే రోజు కిలో వెండి ధర రూ.4,25,000కి చేరింది. ఇదే ఆల్ టైమ్ హై. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,75,000గా ఉంది. ఏకంగా రూ.2,50,000 పతనమైంది. అంటే ఆల్ టైమ్ హై దగ్గర బంగారం, వెండి కొన్నవారు ఎంత నష్టపోయారో అర్థం చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)

