ప్రభన్యూస్

Motor Insurance: బైక్, కారు ఉన్నవారికి అలర్ట్.. డిసెంబర్ 15 నుంచి కొత్త ఇన్సూరెన్స్ రూల్స్..! | బిజినెస్


Last Updated:

Motor Insurance: మీ దగ్గర బైక్ లేదా కారు ఉందా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాలి. డిసెంబర్ 15 నుంచి మోటార్ ఇన్సూరెన్స్ రూల్స్ మారనున్నాయి. ఇ

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుత కాలంలో బైక్ లేదా కారు ఉన్న ప్రతి ఒక్కరికీ ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరి. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు మీ బైక్, కారు డ్యామేజ్ అయినా, ఇతరులకు గాయాలైనా బీమా ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఇప్పటివరకు మోటార్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఏయే రకాల ప్రొటక్షన్ ప్లాన్స్ ఉన్నాయి? వాటికి ఎంత ప్రీమియం చెల్లించాలి? అనే విషయాల్లో చాలామందికి క్లారిటీ ఉండేది కాదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (IRDAI) కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. డిసెంబర్ 15 నుంచి కార్లు, బైక్ ఇన్సూరెన్స్ నిబంధనల్లో కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. దీంతో వాహన యజమానులకు తమ అవసరాలకు తగిన ప్లాన్ ఎంచుకోవచ్చు.

కొత్త నిబంధనల ప్రకారం మోటార్ ఇన్సూరెన్స్‌ను నాలుగు విభాగాలుగా విభజించారు. ఇప్పటివరకు వివిధ రకాల కవరేజీల గురించి పూర్తిగా తెలియకుండానే పాలసీలు తీసుకునే వారికి ఈ విధానం ఉపయోగపడుతుంది. ప్రతి రకమైన బీమా రక్షణకు ఎంత ప్రీమియం చెల్లించాలో బీమా కంపెనీలు విడివిడిగా తెలియజేయాలి. దీంతో వినియోగదారులు తమకు ఏ కవరేజీ అవసరమో నిర్ణయించుకోవచ్చు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు నవంబర్ 2న IRDAI ఈ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.

1. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్: రోడ్డు ప్రమాదంలో మీ వాహనం వల్ల ఇతరులకు గాయాలు అయినా, ప్రాణనష్టం జరిగినా లేదా ఇతరుల ఆస్తులకు నష్టం కలిగినా ఈ బీమా రక్షణ కల్పిస్తుంది. చట్టపరంగా ప్రతి వాహనానికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి. అందువల్ల ఈ కవరేజీని వాహన యజమానులు తప్పనిసరిగా తీసుకోవాలి.

2. వాహనంలో ప్రయాణించే వారికి బీమా: కారులో ప్రయాణించే వారికి లేదా బైక్ వెనుక కూర్చునే వారికి ప్రమాదం జరిగినప్పుడు యజమానిపై ఉండే చట్టపరమైన బాధ్యతలకు ఈ కవరేజీ ఉపయోగపడుతుంది. అవసరాన్ని బట్టి వాహన యజమానులు ఈ బీమాను ఎంచుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో యజమాని వద్ద పనిచేసే ఉద్యోగులకు కూడా ఈ రక్షణ వర్తిస్తుంది.

3. పర్సనల్ యాక్సిడెంట్ కవర్: ప్రమాదం కారణంగా వాహన యజమాని డ్రైవర్‌కు గాయాలైనా, మరణం సంభవించినా ఈ బీమా ఆర్థిక రక్షణ కల్పిస్తుంది. యజమాని డ్రైవర్‌కు వర్తించే వ్యక్తిగత ప్రమాద బీమా తప్పనిసరి. అయితే వాహనంలో ప్రయాణించే ఇతర వ్యక్తులు, వెనుక కూర్చునే వారు, అదనపు డ్రైవర్లకు ప్రత్యేకంగా పర్సనల్ యాక్సిడెంట్ కవర్ తీసుకోవడం ఐచ్ఛికం.

4. ఓన్ డ్యామేజ్ కవర్: ప్రమాదం, ఇతర కారణాల వల్ల మీ సొంత కారు లేదా బైక్ దెబ్బతింటే ఈ బీమా ఉపయోగపడుతుంది. వాహనానికి జరిగిన నష్టాన్ని పాలసీ నిబంధనల ప్రకారం బీమా కంపెనీ భరిస్తుంది. ఈ కవరేజీని తీసుకోవాలా వద్దా అనేది వాహన యజమాని నిర్ణయించుకోవచ్చు.

ఈ కొత్త విధానంలో థర్డ్ పార్టీ బీమా తప్పనిసరిగా ఉన్నప్పటికీ, మిగిలిన కవరేజీలను తమ అవసరాలకు అనుగుణంగా ఎంచుకోవచ్చు. ఇందుకోసం బీమా కంపెనీలు వినియోగదారులకు ప్రత్యేక ఆప్షన్ ఫారం ఇవ్వాలి. అందులో నాలుగు రకాల కవరేజీల వివరాలు ఉంటాయి. ఆన్‌లైన్‌లో లేదా నేరుగా కార్యాలయానికి వెళ్లి ఇన్సూరెన్స్ తీసుకున్నా ఈ ఎంపికలను స్పష్టంగా తెలియజేయాలి. వినియోగదారులు తమకు అవసరమైన వాటిని ఎంచుకుని ఫారం సమర్పించాలి.

ఇవి కూడా చదవండి: EPFO: జీతం నుంచి PF కట్ చేస్తున్నారా? మీ డబ్బుల విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి!

ప్రస్తుతం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మాత్రమే ఉన్నవారు కూడా కొత్త నిబంధనల ప్రకారం అదనపు కవరేజీని పొందవచ్చు. ఉదాహరణకు, మీ కారులో ప్రయాణించే వారికి కూడా బీమా రక్షణ కావాలనుకుంటే అదనపు ప్రీమియం చెల్లించి రెండో విభాగంలోని కవరేజీని జోడించుకోవచ్చు. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న థర్డ్ పార్టీ పాలసీని రద్దు చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అదనపు రక్షణ బీమా కంపెనీ జారీ చేసే ఎండార్స్‌మెంట్‌లో పేర్కొన్న తేదీ, సమయం నుంచి మాత్రమే అమల్లోకి వస్తుంది. కొత్త నిబంధనల్లో మరో ముఖ్యమైన మార్పు ప్రీమియం వివరాలకు సంబంధించినది. ఇప్పటివరకు ఒకే పాలసీలో వివిధ రకాల కవరేజీలు ఉన్నప్పుడు వాటికి విడివిడిగా ఎంత చెల్లిస్తున్నామో చాలామందికి అర్థమయ్యేది కాదు. ఇకపై బీమా కంపెనీలు ప్రతి విభాగానికి సంబంధించిన ప్రీమియంను విడిగా చూపించాలి. అలాగే పాలసీ కొనుగోలు సమయంలో కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ (CIS)ను కూడా అందించాలి. దీనివల్ల ఏ బీమా కోసం ఎంత ఖర్చు చేస్తున్నారో వాహన యజమానులకు స్పష్టంగా తెలుస్తుంది.

డిసెంబర్ 15 నుంచే కొత్త రూల్స్..

IRDAI తీసుకొచ్చిన ఈ నాలుగు విభాగాల మోటార్ ఇన్సూరెన్స్ విధానం డిసెంబర్ 15 నుంచి అమల్లోకి వస్తుంది. ఆ తేదీ నుంచి జారీ చేసే అన్ని ప్రైవేట్ కార్లు, ద్విచక్ర వాహనాల పాలసీలు కొత్త నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. బీమా సుగమ్ ప్లాట్‌ఫామ్‌లో కూడా ఈ కొత్త విధానం అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని IRDAI బీమా కంపెనీలను ఆదేశించింది. ఈ మార్పులతో వాహన యజమానులు తమకు అవసరమైన బీమా రక్షణను అర్థం చేసుకుని ఎంచుకోవడంతో పాటు, ప్రతి కవరేజీకి ఎంత ఖర్చవుతుందో ముందుగానే తెలుసుకునే అవకాశం ఉంటుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 November 2026, 1:19 pm Digital Edition : Prabhanews
Motor Insurance: బైక్, కారు ఉన్నవారికి అలర్ట్.. డిసెంబర్ 15 నుంచి కొత్త ఇన్సూరెన్స్ రూల్స్..! | బిజినెస్

Last Updated:Nov 17, 2026 1:09 PM ISTMotor Insurance: మీ దగ్గర బైక్ లేదా కారు ఉందా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాలి. డిసెంబర్ 15 నుంచి మోటార్ ఇన్సూరెన్స్ రూల్స్ మారనున్నాయి. ఇ
ప్రతీకాత్మక చిత్రంప్రస్తుత కాలంలో బైక్ లేదా కారు ఉన్న ప్రతి ఒక్కరికీ ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరి. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు మీ బైక్, కారు డ్యామేజ్ అయినా, ఇతరులకు గాయాలైనా బీమా ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఇప్పటివరకు మోటార్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఏయే రకాల ప్రొటక్షన్ ప్లాన్స్ ఉన్నాయి? వాటికి ఎంత ప్రీమియం చెల్లించాలి? అనే విషయాల్లో చాలామందికి క్లారిటీ ఉండేది కాదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (IRDAI) కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. డిసెంబర్ 15 నుంచి కార్లు, బైక్ ఇన్సూరెన్స్ నిబంధనల్లో కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. దీంతో వాహన యజమానులకు తమ అవసరాలకు తగిన ప్లాన్ ఎంచుకోవచ్చు.కొత్త నిబంధనల ప్రకారం మోటార్ ఇన్సూరెన్స్‌ను నాలుగు విభాగాలుగా విభజించారు. ఇప్పటివరకు వివిధ రకాల కవరేజీల గురించి పూర్తిగా తెలియకుండానే పాలసీలు తీసుకునే వారికి ఈ విధానం ఉపయోగపడుతుంది. ప్రతి రకమైన బీమా రక్షణకు ఎంత ప్రీమియం చెల్లించాలో బీమా కంపెనీలు విడివిడిగా తెలియజేయాలి. దీంతో వినియోగదారులు తమకు ఏ కవరేజీ అవసరమో నిర్ణయించుకోవచ్చు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు నవంబర్ 2న IRDAI ఈ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.1. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్: రోడ్డు ప్రమాదంలో మీ వాహనం వల్ల ఇతరులకు గాయాలు అయినా, ప్రాణనష్టం జరిగినా లేదా ఇతరుల ఆస్తులకు నష్టం కలిగినా ఈ బీమా రక్షణ కల్పిస్తుంది. చట్టపరంగా ప్రతి వాహనానికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి. అందువల్ల ఈ కవరేజీని వాహన యజమానులు తప్పనిసరిగా తీసుకోవాలి.2. వాహనంలో ప్రయాణించే వారికి బీమా: కారులో ప్రయాణించే వారికి లేదా బైక్ వెనుక కూర్చునే వారికి ప్రమాదం జరిగినప్పుడు యజమానిపై ఉండే చట్టపరమైన బాధ్యతలకు ఈ కవరేజీ ఉపయోగపడుతుంది. అవసరాన్ని బట్టి వాహన యజమానులు ఈ బీమాను ఎంచుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో యజమాని వద్ద పనిచేసే ఉద్యోగులకు కూడా ఈ రక్షణ వర్తిస్తుంది.3. పర్సనల్ యాక్సిడెంట్ కవర్: ప్రమాదం కారణంగా వాహన యజమాని డ్రైవర్‌కు గాయాలైనా, మరణం సంభవించినా ఈ బీమా ఆర్థిక రక్షణ కల్పిస్తుంది. యజమాని డ్రైవర్‌కు వర్తించే వ్యక్తిగత ప్రమాద బీమా తప్పనిసరి. అయితే వాహనంలో ప్రయాణించే ఇతర వ్యక్తులు, వెనుక కూర్చునే వారు, అదనపు డ్రైవర్లకు ప్రత్యేకంగా పర్సనల్ యాక్సిడెంట్ కవర్ తీసుకోవడం ఐచ్ఛికం.4. ఓన్ డ్యామేజ్ కవర్: ప్రమాదం, ఇతర కారణాల వల్ల మీ సొంత కారు లేదా బైక్ దెబ్బతింటే ఈ బీమా ఉపయోగపడుతుంది. వాహనానికి జరిగిన నష్టాన్ని పాలసీ నిబంధనల ప్రకారం బీమా కంపెనీ భరిస్తుంది. ఈ కవరేజీని తీసుకోవాలా వద్దా అనేది వాహన యజమాని నిర్ణయించుకోవచ్చు.ఈ కొత్త విధానంలో థర్డ్ పార్టీ బీమా తప్పనిసరిగా ఉన్నప్పటికీ, మిగిలిన కవరేజీలను తమ అవసరాలకు అనుగుణంగా ఎంచుకోవచ్చు. ఇందుకోసం బీమా కంపెనీలు వినియోగదారులకు ప్రత్యేక ఆప్షన్ ఫారం ఇవ్వాలి. అందులో నాలుగు రకాల కవరేజీల వివరాలు ఉంటాయి. ఆన్‌లైన్‌లో లేదా నేరుగా కార్యాలయానికి వెళ్లి ఇన్సూరెన్స్ తీసుకున్నా ఈ ఎంపికలను స్పష్టంగా తెలియజేయాలి. వినియోగదారులు తమకు అవసరమైన వాటిని ఎంచుకుని ఫారం సమర్పించాలి.ఇవి కూడా చదవండి: EPFO: జీతం నుంచి PF కట్ చేస్తున్నారా? మీ డబ్బుల విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి!ప్రస్తుతం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మాత్రమే ఉన్నవారు కూడా కొత్త నిబంధనల ప్రకారం అదనపు కవరేజీని పొందవచ్చు. ఉదాహరణకు, మీ కారులో ప్రయాణించే వారికి కూడా బీమా రక్షణ కావాలనుకుంటే అదనపు ప్రీమియం చెల్లించి రెండో విభాగంలోని కవరేజీని జోడించుకోవచ్చు. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న థర్డ్ పార్టీ పాలసీని రద్దు చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అదనపు రక్షణ బీమా కంపెనీ జారీ చేసే ఎండార్స్‌మెంట్‌లో పేర్కొన్న తేదీ, సమయం నుంచి మాత్రమే అమల్లోకి వస్తుంది. కొత్త నిబంధనల్లో మరో ముఖ్యమైన మార్పు ప్రీమియం వివరాలకు సంబంధించినది. ఇప్పటివరకు ఒకే పాలసీలో వివిధ రకాల కవరేజీలు ఉన్నప్పుడు వాటికి విడివిడిగా ఎంత చెల్లిస్తున్నామో చాలామందికి అర్థమయ్యేది కాదు. ఇకపై బీమా కంపెనీలు ప్రతి విభాగానికి సంబంధించిన ప్రీమియంను విడిగా చూపించాలి. అలాగే పాలసీ కొనుగోలు సమయంలో కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ (CIS)ను కూడా అందించాలి. దీనివల్ల ఏ బీమా కోసం ఎంత ఖర్చు చేస్తున్నారో వాహన యజమానులకు స్పష్టంగా తెలుస్తుంది.డిసెంబర్ 15 నుంచే కొత్త రూల్స్..IRDAI తీసుకొచ్చిన ఈ నాలుగు విభాగాల మోటార్ ఇన్సూరెన్స్ విధానం డిసెంబర్ 15 నుంచి అమల్లోకి వస్తుంది. ఆ తేదీ నుంచి జారీ చేసే అన్ని ప్రైవేట్ కార్లు, ద్విచక్ర వాహనాల పాలసీలు కొత్త నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. బీమా సుగమ్ ప్లాట్‌ఫామ్‌లో కూడా ఈ కొత్త విధానం అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని IRDAI బీమా కంపెనీలను ఆదేశించింది. ఈ మార్పులతో వాహన యజమానులు తమకు అవసరమైన బీమా రక్షణను అర్థం చేసుకుని ఎంచుకోవడంతో పాటు, ప్రతి కవరేజీకి ఎంత ఖర్చవుతుందో ముందుగానే తెలుసుకునే అవకాశం ఉంటుంది.మరింత చదవండి

Source link