Last Updated:
రష్మిక మందన్న లీడ్ రోల్ పోషించిన మైసా మూవీ ఈ నెల 27న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ‘‘ఏనాటి వరమో నువ్వు కన్నా.. నువ్వు పుట్టాకే తెలిసే బతుకంటే’’ అంటూ సాగే పాట రిలీజ్ చేశారు.
ఇటీవలే ‘రణబాలి’ సినిమాతో ఆడియన్స్ మనసు దోచేసిన రష్మిక మందన్న, ఇప్పుడు ‘మైసా’తో తనలోని యాక్షన్ యాంగిల్ బయటకు తీస్తోంది. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని అన్‌ఫార్ములా ఫిల్మ్స్ పతాకంపై రవీంద్ర పుల్లె రూపొందిస్తున్నారు. అజయ్ సాయిపురెడ్డి, అనిల్ సయ్యపురెడ్డి, వీరసాయి గోప నిర్మాతలు. సముద్రఖని, రావు రమేశ్, ఈశ్వరీరావు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఈ నెల 27న థియేటర్లలోకి రానుంది.
ఈ క్రమంలోనే తాజాగా ‘‘ఏనాటి వరమో నువ్వు కన్నా.. నువ్వు పుట్టాకే తెలిసే బతుకంటే’’ అంటూ సాగే పాట రిలీజ్ చేశారు. జేక్స్ బిజోయ్ స్వరాలు, రెహమాన్ సంగీతం అందించిన ఈ సాంగ్, విడుదల చేసిన కాసేపట్లోనే వైరల్ అయింది.
కృష్ణ తేజస్వి పాడిన ఈ పాటలో మైసా బాల్యాన్ని, తన తండ్రితో పెనవేసుకున్న అనుబంధాన్ని చూపిస్తూనే సినిమా డెప్త్ ఎలా ఉంటుందో రుచి రూపించారు. రా రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న ఓ పవర్ ఫుల్ గిరిజన గోండు యువతిగా కనిపించనుంది. ఇప్పటికే వదిలిన మైసా అప్ డేట్స్ సినిమాపై అంచనాలు పెంచగా, తాజాగా విడుదల చేసిన ఈ సాంగ్ తో హైప్ మరో లెవెల్ కి వెళ్ళిపోయింది.

