ప్రభన్యూస్

Sheikh Hasina: షేక్ హసీనాను అప్పగించాలంటే ఈ రెండు పనులు చేయాల్సిందే.. బంగ్లాదేశ్‌కు భారత్ షరతులు! |


Last Updated:

న్యూఢిల్లీలో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను స్వదేశానికి పంపేందుకు భారత్ రెండు కీలక షరతులు పెట్టింది. మిలిటరీ విమానం పంపడంతో పాటు మరణశిక్షపై అప్పీల్, కొత్త విచారణకు హామీ ఇవ్వాలని స్పష్టం చేసింది.

News18
News18

2024 ఆగస్టు నుంచి న్యూఢిల్లీలో ప్రవాస జీవితం గడుపుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాను తిరిగి స్వదేశానికి పంపే విషయంలో భారత్ కీలక అడుగు వేసింది. హసీనా అప్పగింతకు బంగ్లాదేశ్ ప్రభుత్వం ముందు భారత్ రెండు ప్రధాన షరతులు పెట్టినట్లు బీబీసీ బంగ్లా కథనం వెల్లడించింది. 2024 జులై నాటి విద్యార్థుల ఆందోళనల అణిచివేత కేసులో అక్కడి కోర్టు హసీనాకు మరణశిక్ష విధించింది. ఈ నేపథ్యంలో డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లాలని ఆమె భావిస్తున్నారు. ఇందుకోసం కొత్త పాస్‌పోర్టు ఇవ్వాలని ఇటీవల ఆమె చేసిన అభ్యర్థనను ఢాకా తిరస్కరించింది.

దోషిగా తేలినందున పాస్‌పోర్టు కాకుండా అప్పగింత ప్రక్రియ ద్వారానే ఆమెను రప్పిస్తామని బంగ్లాదేశ్ స్పష్టం చేసింది. ఈ పరిణామాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను చక్కదిద్దుకునేందుకు భారత్ రంగంలోకి దిగింది.

భారత్ పెట్టిన రెండు ప్రధాన షరతులు ఏమిటి?

తొలి షరతు ప్రకారం, 2024 ఆగస్టు 5న హసీనా ఏ విధంగానైతే బంగ్లాదేశ్ సైనిక విమానంలో భారత్‌కు వచ్చారో, ఇప్పుడు కూడా బంగ్లాదేశ్ సైన్యమే బాధ్యత తీసుకుని ప్రత్యేక మిలిటరీ విమానంలో ఆమెను తీసుకెళ్లాలని న్యూఢిల్లీ కోరింది. రెండో షరతుగా, మరణశిక్షపై అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించడంతో పాటు నిష్పక్షపాతంగా కొత్త విచారణ (రీట్రయల్) ఎదుర్కొనేలా బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని భారత్ డిమాండ్ చేసింది.

భారత్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది?

న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. మరణశిక్ష పడిన మాజీ నేతకు ఆశ్రయం కల్పించడం వల్ల భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు దెబ్బతినడంతో పాటు అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్నాయి. హసీనాను మరో మూడో దేశానికి పంపేందుకు భారత్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అందుకే సున్నితమైన ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని న్యూఢిల్లీ భావిస్తోంది.

ప్రాణహాని ఉన్నా వెనక్కి తగ్గను: హసీనా

తాను బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తే విమానాశ్రయంలోనే అరెస్టు చేయవచ్చని, జైలుకు పంపవచ్చని లేదా తనపై హత్యాయత్నం కూడా జరగవచ్చని హసీనా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 1981, 2007లో సైనిక పాలన ఉన్నప్పుడే తాను ధైర్యంగా స్వదేశానికి తిరిగి వెళ్లానని, తన వ్యక్తిగత భద్రత గురించి ఎప్పుడో ఆందోళన చెందడం మానేశానని ఆమె స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 14 November 2026, 8:56 pm Digital Edition : Prabhanews
Sheikh Hasina: షేక్ హసీనాను అప్పగించాలంటే ఈ రెండు పనులు చేయాల్సిందే.. బంగ్లాదేశ్‌కు భారత్ షరతులు! |

Last Updated:Nov 14, 2026 8:08 PM ISTన్యూఢిల్లీలో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను స్వదేశానికి పంపేందుకు భారత్ రెండు కీలక షరతులు పెట్టింది. మిలిటరీ విమానం పంపడంతో పాటు మరణశిక్షపై అప్పీల్, కొత్త విచారణకు హామీ ఇవ్వాలని స్పష్టం చేసింది.News182024 ఆగస్టు నుంచి న్యూఢిల్లీలో ప్రవాస జీవితం గడుపుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాను తిరిగి స్వదేశానికి పంపే విషయంలో భారత్ కీలక అడుగు వేసింది. హసీనా అప్పగింతకు బంగ్లాదేశ్ ప్రభుత్వం ముందు భారత్ రెండు ప్రధాన షరతులు పెట్టినట్లు బీబీసీ బంగ్లా కథనం వెల్లడించింది. 2024 జులై నాటి విద్యార్థుల ఆందోళనల అణిచివేత కేసులో అక్కడి కోర్టు హసీనాకు మరణశిక్ష విధించింది. ఈ నేపథ్యంలో డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లాలని ఆమె భావిస్తున్నారు. ఇందుకోసం కొత్త పాస్‌పోర్టు ఇవ్వాలని ఇటీవల ఆమె చేసిన అభ్యర్థనను ఢాకా తిరస్కరించింది.దోషిగా తేలినందున పాస్‌పోర్టు కాకుండా అప్పగింత ప్రక్రియ ద్వారానే ఆమెను రప్పిస్తామని బంగ్లాదేశ్ స్పష్టం చేసింది. ఈ పరిణామాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను చక్కదిద్దుకునేందుకు భారత్ రంగంలోకి దిగింది.భారత్ పెట్టిన రెండు ప్రధాన షరతులు ఏమిటి?తొలి షరతు ప్రకారం, 2024 ఆగస్టు 5న హసీనా ఏ విధంగానైతే బంగ్లాదేశ్ సైనిక విమానంలో భారత్‌కు వచ్చారో, ఇప్పుడు కూడా బంగ్లాదేశ్ సైన్యమే బాధ్యత తీసుకుని ప్రత్యేక మిలిటరీ విమానంలో ఆమెను తీసుకెళ్లాలని న్యూఢిల్లీ కోరింది. రెండో షరతుగా, మరణశిక్షపై అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించడంతో పాటు నిష్పక్షపాతంగా కొత్త విచారణ (రీట్రయల్) ఎదుర్కొనేలా బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని భారత్ డిమాండ్ చేసింది.భారత్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది?న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. మరణశిక్ష పడిన మాజీ నేతకు ఆశ్రయం కల్పించడం వల్ల భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు దెబ్బతినడంతో పాటు అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్నాయి. హసీనాను మరో మూడో దేశానికి పంపేందుకు భారత్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అందుకే సున్నితమైన ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని న్యూఢిల్లీ భావిస్తోంది.ప్రాణహాని ఉన్నా వెనక్కి తగ్గను: హసీనాతాను బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తే విమానాశ్రయంలోనే అరెస్టు చేయవచ్చని, జైలుకు పంపవచ్చని లేదా తనపై హత్యాయత్నం కూడా జరగవచ్చని హసీనా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 1981, 2007లో సైనిక పాలన ఉన్నప్పుడే తాను ధైర్యంగా స్వదేశానికి తిరిగి వెళ్లానని, తన వ్యక్తిగత భద్రత గురించి ఎప్పుడో ఆందోళన చెందడం మానేశానని ఆమె స్పష్టం చేశారు.మరింత చదవండి

Source link