అలాగే హెచ్.ఎస్. నాందేడ్ నుంచి తిరుచానూరుకు వెళ్లే స్పెషల్ రైలు నంబర్ 07603లో కూడా భారీ సంఖ్యలో బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఈ రైలులో నవంబర్ 10న 112 బెర్తులు, నవంబర్ 17న 463 బెర్తులు, నవంబర్ 24న 598 బెర్తులు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు రైళ్లలో కలిపి తిరుపతి, తిరుచానూరు వెళ్లే ప్రయాణికుల కోసం మొత్తం 1,644 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఈ లెక్కన తిరుమల, అరుణాచలం మార్గాల్లో కలిపి మొత్తం 1,877 బెర్తులు అందుబాటులో ఉన్నట్లు రైల్వే వివరాలు చెబుతున్నాయి. నవంబర్ నెలలో ప్రయాణం చేయాలనుకునే భక్తులకు టికెట్లు బుక్ చేసుకోవడానికి ఇది మంచి అవకాశం. (ప్రతీకాత్మక చిత్రం)

