Last Updated:
యువ నటీనటులు సాత్విక్ వర్మ, అనీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘తొలి ప్రేమ కథ’. లిఖిత్, ఆదిత్య సమర్పణలో లతా కె నిర్మిస్తున్న ఈ సినిమాకు సాయి లక్ష్మణ్ అల్లు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు.
యువ నటీనటులు సాత్విక్ వర్మ, అనీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘తొలి ప్రేమ కథ’. లిఖిత్, ఆదిత్య సమర్పణలో లతా కె నిర్మిస్తున్న ఈ సినిమాకు సాయి లక్ష్మణ్ అల్లు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ లాంచ్ కార్యక్రమానికి హీరో ఆకాష్ పూరి, దర్శకుడు శైలేష్ కొలను ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. టీజర్‌ను చూసిన అనంతరం వారు సినిమా బృందంపై ప్రశంసలు కురిపించారు.
టీజర్ లాంచ్ కార్యక్రమంలో దర్శకుడు శైలేష్ కొలను మాట్లాడుతూ.. ‘తొలి ప్రేమ కథ’ సరైన సమయంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా అని అన్నారు. ప్రస్తుతం ఇలాంటి చిత్రాల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారని, ఈ సినిమా మూడ్ ఆఫ్ ది సీజన్‌గా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
టీజర్ చాలా హాయిగా, సహజంగా ఉందని ప్రశంసించారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన సాత్విక్ వర్మ ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారని, ఈ సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడ్డారని తెలిపారు. టీజర్‌లో సినిమాటోగ్రఫీ, సంగీతం అద్భుతంగా ఉన్నాయని, ఆర్.ఆర్. ధ్రువన్ అందించిన మెలోడీ తనకు బాగా నచ్చిందని చెప్పారు. చివర్లో వచ్చే డైలాగ్స్, నటీనటుల సహజమైన నటన ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. ఈ సినిమా థియేటర్‌లో చూడాల్సిన చిత్రమని, ప్రేక్షకులంతా థియేటర్లలోనే వీక్షించాలని కోరారు.
హీరో ఆకాష్ పూరి మాట్లాడుతూ.. ‘తొలి ప్రేమ కథ’ టీజర్ విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. సాత్విక్ వర్మ, అనీ తనకు చిన్నప్పటి నుంచి పరిచయమని, వారితో కలిసి పనిచేశానని తెలిపారు. ఇద్దరూ మంచి నటులని, టీజర్ చాలా అందంగా ఉందని అన్నారు. ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు.
హీరో సాత్విక్ వర్మ మాట్లాడుతూ.. తమ సినిమాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. శైలేష్ కొలను, ఆకాష్ పూరి తమకు ఎంతో సపోర్ట్ చేశారని చెప్పారు. ఆకాష్ పూరి తన ఈవెంట్‌కు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ‘తొలి ప్రేమ కథ’ మంచి మ్యూజికల్ లవ్ స్టోరీ అని, ధ్రువన్ అందించిన సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు.
దర్శకుడు, నిర్మాత సాయి లక్ష్మణ్ అల్లు మాట్లాడుతూ.. కథ అనుకున్నప్పుడే సాత్విక్ వర్మ, అనీని ప్రధాన పాత్రల కోసం ఊహించుకున్నానని తెలిపారు. సినిమాలో విజువల్స్, సంగీతం ప్రత్యేకంగా ఉంటాయని, అద్భుతమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిపామని చెప్పారు. సినిమా చాలా అందంగా వచ్చిందని, ప్రేక్షకులు థియేటర్లలో చూసి ఆదరించాలని కోరారు.
సంగీత దర్శకుడు ఆర్.ఆర్. ధ్రువన్ మాట్లాడుతూ.. ఈ సినిమా తనకు ఎంతో ప్రత్యేకమని, పోస్టర్‌పై ‘ఆర్.ఆర్. ధ్రువన్ మ్యూజికల్’ అని పేర్కొనడం ఆనందంగా ఉందన్నారు. సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు. ఈ సినిమాకు సంగీతం ఆర్.ఆర్. ధ్రువన్, సినిమాటోగ్రఫీ రామ్ కంధ, ఎడిటింగ్ హరి శంకర్ నిర్వహిస్తున్నారు. మొత్తానికి టీజర్‌తో మంచి ఆసక్తిని పెంచిన ‘తొలి ప్రేమ కథ’ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

