ప్రభన్యూస్

Kajjikayalu Recipe: ఎప్పుడూ చేసే కజ్జికాయలు కాకుండా ఇలా ట్రై చేయండి.. స్వీట్ షాప్ రుచికి ఏ మాత్రం తగ్గవు! | లైఫ్ స్టైల్


Last Updated:

ఎప్పుడూ ఒకే రకమైన రుచి కాకుండా ఈసారి కొంచెం కొత్తగా ప్రయత్నించాలనుకుంటే రవ్వ, జీడిపప్పు, ఎండుకొబ్బరితో చేసే ఈ కజ్జికాయలను ట్రై చేయండి. ఇవి తినడానికి ఎంతో రుచిగా ఉండటమే కాకుండా పండుగల సమయంలో అతిథులకు కూడా పెట్టవచ్చు.

News18
News18

పండుగలు, పూజలు, ప్రత్యేక సందర్భాలు వచ్చినప్పుడు మన ఇళ్లలో రకరకాల స్వీట్లు తయారు చేస్తుంటారు. ముఖ్యంగా కజ్జికాయలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. బయట కరకరలాడుతూ, లోపల తియ్యటి పూర్ణంతో నిండిన కజ్జికాయలను చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఇష్టపడతారు. సాధారణంగా కజ్జికాయలను కొబ్బరి, పంచదార లేదా బెల్లంతో తయారు చేస్తుంటారు. అయితే ఎప్పుడూ ఒకే రకమైన రుచి కాకుండా ఈసారి కొంచెం కొత్తగా ప్రయత్నించాలనుకుంటే రవ్వ, జీడిపప్పు, ఎండుకొబ్బరితో చేసే ఈ కజ్జికాయలను ట్రై చేయండి. ఇవి తినడానికి ఎంతో రుచిగా ఉండటమే కాకుండా పండుగల సమయంలో అతిథులకు కూడా పెట్టవచ్చు. మరి వీటిని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు: ఈ కజ్జికాయల తయారీకి ముందుగా అర కప్పు నెయ్యి, అర కప్పు జీడిపప్పు, ఒకటిన్నర కప్పుల బొంబాయి రవ్వ, అర కప్పు ఎండుకొబ్బరి తురుము, ఒక కప్పు పంచదార, పావు టీ స్పూన్ యాలకుల పొడి తీసుకోవాలి. బయటి పొర తయారీకి పావు కిలో మైదాపిండి, ఒకటిన్నర టేబుల్ స్పూన్ల శనగపిండి, కొద్దిగా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి, పిండి కలపడానికి సరిపడా నీళ్లు, కజ్జికాయలను వేయించడానికి తగినంత నూనె సిద్ధం చేసుకోవాలి.

తయారీ విధానం: ముందుగా కజ్జికాయల లోపల పెట్టే తియ్యటి పూర్ణాన్ని తయారు చేసుకోవాలి. ఇందుకోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో ఒక కప్పు పంచదార వేసుకోవాలి. పంచదార మునిగేంత వరకు నీళ్లు పోసి మరిగించాలి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో గిన్నెలో అర కప్పు నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి కరిగిన తర్వాత అందులో జీడిపప్పు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించిన జీడిపప్పును ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.

అదే నెయ్యిలో బొంబాయి రవ్వ వేసి చిన్న మంటపై నెమ్మదిగా వేయించాలి. రవ్వ మాడిపోకుండా ఎప్పటికప్పుడు కలుపుతూ ఉండాలి. రవ్వ నుంచి మంచి వాసన రావడం మొదలైన తర్వాత అందులో ఎండుకొబ్బరి తురుము వేసి మరోసారి బాగా కలపాలి. కొబ్బరి కూడా కొద్దిగా వేగిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న పంచదార పాకాన్ని అందులో పోయాలి. ఈ మిశ్రమాన్ని చిన్న మంటపై ఉంచి ఉండలు కట్టకుండా బాగా కలపాలి. రవ్వ పాకాన్ని పీల్చుకుని దగ్గరగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని సుమారు 30 నిమిషాల పాటు పక్కన పెట్టి చల్లారనివ్వాలి.

ఈలోపు కజ్జికాయల బయటి పొర కోసం పిండి సిద్ధం చేసుకోవాలి. ఒక పెద్ద మిక్సింగ్ బౌల్‌లో మైదాపిండి, శనగపిండి, కొద్దిగా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా కలపాలి. తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండేలా ముద్ద కలుపుకోవాలి. పిండిని కొద్దిసేపు పక్కన పెట్టి, ఆ తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక్కో ఉండను తీసుకుని చపాతీ పీటపై కొద్దిగా పొడి పిండి చల్లుతూ పూరీ ఆకారంలో పలుచగా ఒత్తుకోవాలి.

ఇప్పుడు కజ్జికాయల మౌల్డ్ తీసుకుని అందులో ఈ పూరీని ఉంచాలి. మధ్యలో ముందుగా తయారు చేసుకున్న రవ్వ, కొబ్బరి పూర్ణాన్ని తగినంత పెట్టాలి. పూరీ అంచులకు కొద్దిగా నీళ్లు రాసి మౌల్డ్‌ను గట్టిగా మూసి నొక్కాలి. ఇలా చేయడం వల్ల కజ్జికాయలు చక్కని ఆకారంలో వస్తాయి. అంచుల దగ్గర బయటకు వచ్చిన అదనపు పిండిని తీసేయాలి. మౌల్డ్ నుంచి కజ్జికాయను జాగ్రత్తగా బయటకు తీసి ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండి, పూర్ణంతో అన్ని కజ్జికాయలను తయారు చేసుకోవాలి.

చివరగా స్టవ్ మీద కడాయి పెట్టి కజ్జికాయలు మునిగేంత నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి కొద్దికొద్దిగా కజ్జికాయలను వేయాలి. ఒకేసారి ఎక్కువ వేయకుండా కడాయికి సరిపడా మాత్రమే వేయించాలి. రెండు వైపులా సమానంగా తిరగేస్తూ బంగారు రంగు వచ్చే వరకు నెమ్మదిగా వేయించుకోవాలి. పూర్తిగా వేగిన తర్వాత వాటిని తీసి టిష్యూ పేపర్‌పై ఉంచాలి. అంతే.. బయట కరకరలాడుతూ, లోపల రవ్వ, కొబ్బరి, జీడిపప్పు రుచితో నిండిన నోరూరించే కజ్జికాయలు సిద్ధం. పండుగల సమయంలో లేదా ఇంటికి అతిథులు వచ్చినప్పుడు వీటిని తయారు చేసి అందరికీ అందించవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 05 November 2026, 9:51 am Digital Edition : Prabhanews
Kajjikayalu Recipe: ఎప్పుడూ చేసే కజ్జికాయలు కాకుండా ఇలా ట్రై చేయండి.. స్వీట్ షాప్ రుచికి ఏ మాత్రం తగ్గవు! | లైఫ్ స్టైల్

Last Updated:Nov 05, 2026 9:47 AM ISTఎప్పుడూ ఒకే రకమైన రుచి కాకుండా ఈసారి కొంచెం కొత్తగా ప్రయత్నించాలనుకుంటే రవ్వ, జీడిపప్పు, ఎండుకొబ్బరితో చేసే ఈ కజ్జికాయలను ట్రై చేయండి. ఇవి తినడానికి ఎంతో రుచిగా ఉండటమే కాకుండా పండుగల సమయంలో అతిథులకు కూడా పెట్టవచ్చు.News18పండుగలు, పూజలు, ప్రత్యేక సందర్భాలు వచ్చినప్పుడు మన ఇళ్లలో రకరకాల స్వీట్లు తయారు చేస్తుంటారు. ముఖ్యంగా కజ్జికాయలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. బయట కరకరలాడుతూ, లోపల తియ్యటి పూర్ణంతో నిండిన కజ్జికాయలను చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఇష్టపడతారు. సాధారణంగా కజ్జికాయలను కొబ్బరి, పంచదార లేదా బెల్లంతో తయారు చేస్తుంటారు. అయితే ఎప్పుడూ ఒకే రకమైన రుచి కాకుండా ఈసారి కొంచెం కొత్తగా ప్రయత్నించాలనుకుంటే రవ్వ, జీడిపప్పు, ఎండుకొబ్బరితో చేసే ఈ కజ్జికాయలను ట్రై చేయండి. ఇవి తినడానికి ఎంతో రుచిగా ఉండటమే కాకుండా పండుగల సమయంలో అతిథులకు కూడా పెట్టవచ్చు. మరి వీటిని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.కావాల్సిన పదార్థాలు: ఈ కజ్జికాయల తయారీకి ముందుగా అర కప్పు నెయ్యి, అర కప్పు జీడిపప్పు, ఒకటిన్నర కప్పుల బొంబాయి రవ్వ, అర కప్పు ఎండుకొబ్బరి తురుము, ఒక కప్పు పంచదార, పావు టీ స్పూన్ యాలకుల పొడి తీసుకోవాలి. బయటి పొర తయారీకి పావు కిలో మైదాపిండి, ఒకటిన్నర టేబుల్ స్పూన్ల శనగపిండి, కొద్దిగా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి, పిండి కలపడానికి సరిపడా నీళ్లు, కజ్జికాయలను వేయించడానికి తగినంత నూనె సిద్ధం చేసుకోవాలి.తయారీ విధానం: ముందుగా కజ్జికాయల లోపల పెట్టే తియ్యటి పూర్ణాన్ని తయారు చేసుకోవాలి. ఇందుకోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో ఒక కప్పు పంచదార వేసుకోవాలి. పంచదార మునిగేంత వరకు నీళ్లు పోసి మరిగించాలి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో గిన్నెలో అర కప్పు నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి కరిగిన తర్వాత అందులో జీడిపప్పు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించిన జీడిపప్పును ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.అదే నెయ్యిలో బొంబాయి రవ్వ వేసి చిన్న మంటపై నెమ్మదిగా వేయించాలి. రవ్వ మాడిపోకుండా ఎప్పటికప్పుడు కలుపుతూ ఉండాలి. రవ్వ నుంచి మంచి వాసన రావడం మొదలైన తర్వాత అందులో ఎండుకొబ్బరి తురుము వేసి మరోసారి బాగా కలపాలి. కొబ్బరి కూడా కొద్దిగా వేగిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న పంచదార పాకాన్ని అందులో పోయాలి. ఈ మిశ్రమాన్ని చిన్న మంటపై ఉంచి ఉండలు కట్టకుండా బాగా కలపాలి. రవ్వ పాకాన్ని పీల్చుకుని దగ్గరగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని సుమారు 30 నిమిషాల పాటు పక్కన పెట్టి చల్లారనివ్వాలి.ఈలోపు కజ్జికాయల బయటి పొర కోసం పిండి సిద్ధం చేసుకోవాలి. ఒక పెద్ద మిక్సింగ్ బౌల్‌లో మైదాపిండి, శనగపిండి, కొద్దిగా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా కలపాలి. తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండేలా ముద్ద కలుపుకోవాలి. పిండిని కొద్దిసేపు పక్కన పెట్టి, ఆ తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక్కో ఉండను తీసుకుని చపాతీ పీటపై కొద్దిగా పొడి పిండి చల్లుతూ పూరీ ఆకారంలో పలుచగా ఒత్తుకోవాలి.ఇప్పుడు కజ్జికాయల మౌల్డ్ తీసుకుని అందులో ఈ పూరీని ఉంచాలి. మధ్యలో ముందుగా తయారు చేసుకున్న రవ్వ, కొబ్బరి పూర్ణాన్ని తగినంత పెట్టాలి. పూరీ అంచులకు కొద్దిగా నీళ్లు రాసి మౌల్డ్‌ను గట్టిగా మూసి నొక్కాలి. ఇలా చేయడం వల్ల కజ్జికాయలు చక్కని ఆకారంలో వస్తాయి. అంచుల దగ్గర బయటకు వచ్చిన అదనపు పిండిని తీసేయాలి. మౌల్డ్ నుంచి కజ్జికాయను జాగ్రత్తగా బయటకు తీసి ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండి, పూర్ణంతో అన్ని కజ్జికాయలను తయారు చేసుకోవాలి.చివరగా స్టవ్ మీద కడాయి పెట్టి కజ్జికాయలు మునిగేంత నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి కొద్దికొద్దిగా కజ్జికాయలను వేయాలి. ఒకేసారి ఎక్కువ వేయకుండా కడాయికి సరిపడా మాత్రమే వేయించాలి. రెండు వైపులా సమానంగా తిరగేస్తూ బంగారు రంగు వచ్చే వరకు నెమ్మదిగా వేయించుకోవాలి. పూర్తిగా వేగిన తర్వాత వాటిని తీసి టిష్యూ పేపర్‌పై ఉంచాలి. అంతే.. బయట కరకరలాడుతూ, లోపల రవ్వ, కొబ్బరి, జీడిపప్పు రుచితో నిండిన నోరూరించే కజ్జికాయలు సిద్ధం. పండుగల సమయంలో లేదా ఇంటికి అతిథులు వచ్చినప్పుడు వీటిని తయారు చేసి అందరికీ అందించవచ్చు.మరింత చదవండి

Source link