ప్రభన్యూస్

Amul Price Hike: అమూల్ ప్రొడక్ట్స్ వాడేవారికి బిగ్ షాక్… కొత్త ధరలు ఇవే | Amul Hikes Ghee Prices by Rs 50 Per Litre, Butter by Rs 15: Check New Rate | బిజినెస్


Last Updated:

Amul Price Hike | అమూల్ కస్టమర్లకు బ్యాడ్ న్యూస్. ప్రముఖ డెయిరీ బ్రాండ్ అమూల్ నెయ్యి, బటర్ ధరలను పెంచింది. నవంబర్ 2 నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. మరి ఇప్పుడు లీటర్ నెయ్యి ధర ఎంత? బటర్ ధర ఎంత పెరిగింది? తెలుసుకుందాం.

Amul Price Hike: అమూల్ ప్రొడక్ట్స్ వాడేవారికి బిగ్ షాక్... కొత్త ధరలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
Amul Price Hike: అమూల్ ప్రొడక్ట్స్ వాడేవారికి బిగ్ షాక్… కొత్త ధరలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న వేళ ప్రముఖ డెయిరీ బ్రాండ్ అమూల్ వినియోగదారులకు మరో షాక్ ఇచ్చింది. నెయ్యి, బటర్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పాల ఉత్పత్తి ఖర్చులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నవంబర్ 2 నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. అమూల్ బ్రాండ్‌పై పాల ఉత్పత్తులను విక్రయించే గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ (GCMMF) ఈ ధరల పెంపును ప్రకటించింది. నెయ్యి ధర లీటర్‌కు రూ.50 పెంచగా, 500 గ్రాముల టేబుల్ బటర్ ప్యాక్‌పై రూ.15 పెంచింది. నవంబర్ 2 నుంచి అమూల్ టేబుల్ బటర్, అమూల్ నెయ్యి, అమూల్ ఆవు నెయ్యి కొత్త ధరలు అమల్లోకి వచ్చినట్లు GCMMF ఓ ప్రకటనలో వెల్లడించింది. 36 లక్షల మంది రైతుల సొంత సహకార సంస్థగా ఉన్న అమూల్.. పాల ఉత్పత్తికి అవసరమయ్యే ఖర్చులు పెరగడంతో బటర్, నెయ్యి ధరలను సవరించినట్లు తెలిపింది.

అమూల్ టేబుల్ బటర్ 500 గ్రాముల ప్యాక్ ధర గతంలో రూ.310గా ఉండేది. ఇప్పుడు దాన్ని రూ.325కు పెంచారు. అంటే ఒక్క ప్యాక్‌పై రూ.15 పెరిగింది. అమూల్ నెయ్యి ఒక లీటర్ పౌచ్ ధర గతంలో రూ.630 ఉండగా, ఇప్పుడు రూ.680కి చేరింది. అంటే లీటర్‌పై రూ.50 పెరిగింది. అమూల్ ఆవు నెయ్యి ఒక లీటర్ పౌచ్ ధర కూడా పెరిగింది. గతంలో రూ.695గా ఉన్న ధరను ఇప్పుడు రూ.735కు చేర్చారు. దీనిపై రూ.40 పెరిగింది. దేశంలో ప్రముఖ డెయిరీ సంస్థల్లో GCMMF కూడా ఒకటి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ టర్నోవర్ 11.4 శాతం పెరిగి రూ.73,450 కోట్లకు చేరింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఈ టర్నోవర్ రూ.65,911 కోట్లుగా ఉంది.

ఇది కూడా చదవండి: Rooftop Solar: ఇంటిపై సోలార్ ప్యానెల్స్ పెట్టిస్తున్నారా? ఈ 8 తప్పులు చేస్తే రూ.78,000 సబ్సిడీ రాదు

మరోవైపు, గత ఆర్థిక సంవత్సరంలో అమూల్ బ్రాండ్ మొత్తం టర్నోవర్ రూ.1 లక్ష కోట్ల మార్కును దాటింది. అయితే, GCMMF ఆదాయంలో 18 జిల్లా స్థాయి సహకార సంఘాల టర్నోవర్‌ను కలపలేదు. మొత్తంగా చూస్తే, పాల ఉత్పత్తి ఖర్చులు పెరగడం వల్ల అమూల్ నెయ్యి, బటర్ ధరలను పెంచింది. దీంతో ఈ ఉత్పత్తులను తరచూ కొనుగోలు చేసే కుటుంబాల నెలవారీ సరుకుల బడ్జెట్‌పై కొంత అదనపు భారం పడనుంది. ముఖ్యంగా నెయ్యి, బటర్ కొనేవారు షాపింగ్ చేసేటప్పుడు కొత్త ధరలను గుర్తుంచుకోవాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 05 November 2026, 9:41 am Digital Edition : Prabhanews
Amul Price Hike: అమూల్ ప్రొడక్ట్స్ వాడేవారికి బిగ్ షాక్… కొత్త ధరలు ఇవే | Amul Hikes Ghee Prices by Rs 50 Per Litre, Butter by Rs 15: Check New Rate | బిజినెస్

Last Updated:Nov 05, 2026 9:40 AM ISTAmul Price Hike | అమూల్ కస్టమర్లకు బ్యాడ్ న్యూస్. ప్రముఖ డెయిరీ బ్రాండ్ అమూల్ నెయ్యి, బటర్ ధరలను పెంచింది. నవంబర్ 2 నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. మరి ఇప్పుడు లీటర్ నెయ్యి ధర ఎంత? బటర్ ధర ఎంత పెరిగింది? తెలుసుకుందాం.Amul Price Hike: అమూల్ ప్రొడక్ట్స్ వాడేవారికి బిగ్ షాక్... కొత్త ధరలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న వేళ ప్రముఖ డెయిరీ బ్రాండ్ అమూల్ వినియోగదారులకు మరో షాక్ ఇచ్చింది. నెయ్యి, బటర్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పాల ఉత్పత్తి ఖర్చులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నవంబర్ 2 నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. అమూల్ బ్రాండ్‌పై పాల ఉత్పత్తులను విక్రయించే గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ (GCMMF) ఈ ధరల పెంపును ప్రకటించింది. నెయ్యి ధర లీటర్‌కు రూ.50 పెంచగా, 500 గ్రాముల టేబుల్ బటర్ ప్యాక్‌పై రూ.15 పెంచింది. నవంబర్ 2 నుంచి అమూల్ టేబుల్ బటర్, అమూల్ నెయ్యి, అమూల్ ఆవు నెయ్యి కొత్త ధరలు అమల్లోకి వచ్చినట్లు GCMMF ఓ ప్రకటనలో వెల్లడించింది. 36 లక్షల మంది రైతుల సొంత సహకార సంస్థగా ఉన్న అమూల్.. పాల ఉత్పత్తికి అవసరమయ్యే ఖర్చులు పెరగడంతో బటర్, నెయ్యి ధరలను సవరించినట్లు తెలిపింది.అమూల్ టేబుల్ బటర్ 500 గ్రాముల ప్యాక్ ధర గతంలో రూ.310గా ఉండేది. ఇప్పుడు దాన్ని రూ.325కు పెంచారు. అంటే ఒక్క ప్యాక్‌పై రూ.15 పెరిగింది. అమూల్ నెయ్యి ఒక లీటర్ పౌచ్ ధర గతంలో రూ.630 ఉండగా, ఇప్పుడు రూ.680కి చేరింది. అంటే లీటర్‌పై రూ.50 పెరిగింది. అమూల్ ఆవు నెయ్యి ఒక లీటర్ పౌచ్ ధర కూడా పెరిగింది. గతంలో రూ.695గా ఉన్న ధరను ఇప్పుడు రూ.735కు చేర్చారు. దీనిపై రూ.40 పెరిగింది. దేశంలో ప్రముఖ డెయిరీ సంస్థల్లో GCMMF కూడా ఒకటి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ టర్నోవర్ 11.4 శాతం పెరిగి రూ.73,450 కోట్లకు చేరింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఈ టర్నోవర్ రూ.65,911 కోట్లుగా ఉంది.ఇది కూడా చదవండి: Rooftop Solar: ఇంటిపై సోలార్ ప్యానెల్స్ పెట్టిస్తున్నారా? ఈ 8 తప్పులు చేస్తే రూ.78,000 సబ్సిడీ రాదుమరోవైపు, గత ఆర్థిక సంవత్సరంలో అమూల్ బ్రాండ్ మొత్తం టర్నోవర్ రూ.1 లక్ష కోట్ల మార్కును దాటింది. అయితే, GCMMF ఆదాయంలో 18 జిల్లా స్థాయి సహకార సంఘాల టర్నోవర్‌ను కలపలేదు. మొత్తంగా చూస్తే, పాల ఉత్పత్తి ఖర్చులు పెరగడం వల్ల అమూల్ నెయ్యి, బటర్ ధరలను పెంచింది. దీంతో ఈ ఉత్పత్తులను తరచూ కొనుగోలు చేసే కుటుంబాల నెలవారీ సరుకుల బడ్జెట్‌పై కొంత అదనపు భారం పడనుంది. ముఖ్యంగా నెయ్యి, బటర్ కొనేవారు షాపింగ్ చేసేటప్పుడు కొత్త ధరలను గుర్తుంచుకోవాలి.మరింత చదవండి

Source link