ప్రభన్యూస్

US Midterm Elections 2026: అమెరికా కాంగ్రెస్‌లో డెమొక్రాట్ల క్లీన్‌స్వీప్.. ట్రంప్‌కు ఎదురుదెబ్బతో భారత్‌కు వ్యూహాత్మక ఊరట! |


Last Updated:

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్లు సెనేట్, ప్రతినిధుల సభను కైవసం చేసుకోవడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారం పరిమితమైంది. ఈ ఫలితాలు వాణిజ్య సుంకాలు, రక్షణ బంధంలో భారత్‌కు అనుకూలంగా మారనున్నాయి.

News18
News18

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్ పార్టీ సాధించిన ఘనవిజయం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఊహించని రాజకీయ షాక్ ఇచ్చింది. కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ, సెనేట్ రెండింటినీ డెమొక్రాట్లు కైవసం చేసుకోవడంతో ట్రంప్ తన పదవీకాలం చివరి రెండేళ్లలో పరిమిత అధికారాలు కలిగిన బలహీన అధ్యక్షుడిగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ పెను రాజకీయ మార్పు భారత విదేశాంగ, వాణిజ్య విధానానికి సరికొత్త వ్యూహాత్మక ఊరటను ఇస్తుందని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇప్పటివరకు అకస్మాత్తుగా నిర్ణయాలు తీసుకుంటూ, భారీ సుంకాలను అస్త్రంగా మార్చి తీవ్ర ఒత్తిడి పెంచిన ట్రంప్ శైలికి అమెరికా కాంగ్రెస్ నిఘా కళ్లెం వేయనుంది. ఫలితంగా భారత్-అమెరికా ద్వైపాక్షిక చర్చల్లో న్యూఢిల్లీ వైఖరి మరింత బలపడే అవకాశం లభించింది. రెండు పార్టీల నియంత్రణ ఏర్పడటంతో ఏకపక్ష నిర్ణయాలకు తెరపడి విధానపరమైన స్పష్టత వస్తుందని అంచనా వేస్తున్నారు.

వాణిజ్య సుంకాల ఉపశమనం.. ద్వైపాక్షిక ఒప్పందాల వేగం

న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. ట్రంప్ ప్రభుత్వ హయాంలో భారతీయ ఎగుమతిదారులు నిరంతరం సుంకాల భయంతో ఊగిసలాడాల్సి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్‌లో మెజారిటీ కోల్పోయిన నేపథ్యంలో విదేశీ వాణిజ్యంపై ఏకపక్ష పన్నులు విధించే అధ్యక్షుడి విశేషాధికారాలను డెమొక్రాట్లు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారు. దేశీయ రాజకీయాల్లో ప్రతిష్టంభన ఎదురవుతున్న తరుణంలో, విదేశాంగ రంగంలో విజయాలు సాధించాలని ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది.

దీనితో భారత్‌తో ఎప్పటినుంచో నలుగుతున్న మధ్యంతర వాణిజ్య ఒప్పందం త్వరగా కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారతీయ జనరిక్ మందులు, ఆభరణాలు, వజ్రాలు, విమాన విడిభాగాలపై విధిస్తున్న పరస్పర సుంకాలను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించే ప్రతిపాదనలపై సంతకాలు త్వరపడవచ్చు. చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్‌ను తయారీ కేంద్రంగా మార్చే ‘ఫ్రెండ్-షోరింగ్’ విధానానికి ఇరు పార్టీల పూర్తి మద్దతు ఉండటం విశేషం.

చెక్కుచెదరని రక్షణ బంధం.. స్థిరపడనున్న చమురు ధరలు

వాషింగ్టన్ అంతర్గత రాజకీయాల్లో ఎన్ని మార్పులు వచ్చినా భారత్-అమెరికా రక్షణ భాగస్వామ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదు. అధునాతన సైనిక సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, సంయుక్త ఆయుధ తయారీ, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడును అడ్డుకునే అంశాల్లో రిపబ్లికన్లు, డెమొక్రాట్లు ఇద్దరూ భారత్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు.

మధ్యంతర ఎన్నికల ఓటమి వెనుక పశ్చిమాసియా యుద్ధ పరిణామాలు కూడా ఉన్నందున, ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించాలని డెమొక్రాట్లు ట్రంప్ సర్కారుపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. పశ్చిమాసియాలో శాంతి నెలకొంటే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు స్థిరపడతాయి. అత్యధికంగా ఇంధనాన్ని దిగుమతి చేసుకునే భారత ఆర్థిక రంగానికి ఇది కొండంత ఊరటనిస్తుంది.

భారత ఐటీ నిపుణులకు రక్షణ కవచం

సాంకేతిక రంగంలో పనిచేసే భారతీయ నిపుణులపై హెచ్-1బీ వీసా పరిమితులను కఠినతరం చేయాలన్న ట్రంప్ ప్రణాళికలను డెమొక్రాట్ల కాంగ్రెస్ సమర్థవంతంగా అడ్డుకునే వీలుంది. అమెరికన్ టెక్ కంపెనీల పోటీతత్వానికి విదేశీ ప్రతిభ అవసరమని భావించే చట్టసభ సభ్యులు నిబంధనల సరళీకరణకు మద్దతు ఇవ్వవచ్చు. అయితే అమెరికా బడ్జెట్ కేటాయింపులపై కాంగ్రెస్, అధ్యక్షుడి మధ్య జరిగే రాజకీయ ఘర్షణలు ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితికి కారణమై రూపాయి మారకపు విలువపై ఒత్తిడి తెచ్చే ప్రమాదం లేకపోలేదు.

అమెరికా కాంగ్రెస్‌లో అధికార సమతుల్యత మారడం భారత సంప్రదింపుల బృందాలకు విశేష బలాన్నిచ్చింది. అధ్యక్షుడి దూకుడుకు కాంగ్రెస్ అడ్డుకట్ట వేయడంతో, ఆసియా ప్రాంతంలో అత్యంత కీలకమైన భాగస్వామిగా ఉన్న భారత్ తన వాణిజ్య, ఆర్థిక ప్రయోజనాలను సమాన స్థాయిలో దక్కించుకునే వెసులుబాటు లభించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 04 November 2026, 7:54 pm Digital Edition : Prabhanews
US Midterm Elections 2026: అమెరికా కాంగ్రెస్‌లో డెమొక్రాట్ల క్లీన్‌స్వీప్.. ట్రంప్‌కు ఎదురుదెబ్బతో భారత్‌కు వ్యూహాత్మక ఊరట! |

Last Updated:Nov 04, 2026 7:49 PM ISTఅమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్లు సెనేట్, ప్రతినిధుల సభను కైవసం చేసుకోవడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారం పరిమితమైంది. ఈ ఫలితాలు వాణిజ్య సుంకాలు, రక్షణ బంధంలో భారత్‌కు అనుకూలంగా మారనున్నాయి.News18అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్ పార్టీ సాధించిన ఘనవిజయం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఊహించని రాజకీయ షాక్ ఇచ్చింది. కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ, సెనేట్ రెండింటినీ డెమొక్రాట్లు కైవసం చేసుకోవడంతో ట్రంప్ తన పదవీకాలం చివరి రెండేళ్లలో పరిమిత అధికారాలు కలిగిన బలహీన అధ్యక్షుడిగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ పెను రాజకీయ మార్పు భారత విదేశాంగ, వాణిజ్య విధానానికి సరికొత్త వ్యూహాత్మక ఊరటను ఇస్తుందని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఇప్పటివరకు అకస్మాత్తుగా నిర్ణయాలు తీసుకుంటూ, భారీ సుంకాలను అస్త్రంగా మార్చి తీవ్ర ఒత్తిడి పెంచిన ట్రంప్ శైలికి అమెరికా కాంగ్రెస్ నిఘా కళ్లెం వేయనుంది. ఫలితంగా భారత్-అమెరికా ద్వైపాక్షిక చర్చల్లో న్యూఢిల్లీ వైఖరి మరింత బలపడే అవకాశం లభించింది. రెండు పార్టీల నియంత్రణ ఏర్పడటంతో ఏకపక్ష నిర్ణయాలకు తెరపడి విధానపరమైన స్పష్టత వస్తుందని అంచనా వేస్తున్నారు.వాణిజ్య సుంకాల ఉపశమనం.. ద్వైపాక్షిక ఒప్పందాల వేగంన్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. ట్రంప్ ప్రభుత్వ హయాంలో భారతీయ ఎగుమతిదారులు నిరంతరం సుంకాల భయంతో ఊగిసలాడాల్సి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్‌లో మెజారిటీ కోల్పోయిన నేపథ్యంలో విదేశీ వాణిజ్యంపై ఏకపక్ష పన్నులు విధించే అధ్యక్షుడి విశేషాధికారాలను డెమొక్రాట్లు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారు. దేశీయ రాజకీయాల్లో ప్రతిష్టంభన ఎదురవుతున్న తరుణంలో, విదేశాంగ రంగంలో విజయాలు సాధించాలని ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది.దీనితో భారత్‌తో ఎప్పటినుంచో నలుగుతున్న మధ్యంతర వాణిజ్య ఒప్పందం త్వరగా కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారతీయ జనరిక్ మందులు, ఆభరణాలు, వజ్రాలు, విమాన విడిభాగాలపై విధిస్తున్న పరస్పర సుంకాలను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించే ప్రతిపాదనలపై సంతకాలు త్వరపడవచ్చు. చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్‌ను తయారీ కేంద్రంగా మార్చే ‘ఫ్రెండ్-షోరింగ్’ విధానానికి ఇరు పార్టీల పూర్తి మద్దతు ఉండటం విశేషం.చెక్కుచెదరని రక్షణ బంధం.. స్థిరపడనున్న చమురు ధరలువాషింగ్టన్ అంతర్గత రాజకీయాల్లో ఎన్ని మార్పులు వచ్చినా భారత్-అమెరికా రక్షణ భాగస్వామ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదు. అధునాతన సైనిక సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, సంయుక్త ఆయుధ తయారీ, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడును అడ్డుకునే అంశాల్లో రిపబ్లికన్లు, డెమొక్రాట్లు ఇద్దరూ భారత్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు.మధ్యంతర ఎన్నికల ఓటమి వెనుక పశ్చిమాసియా యుద్ధ పరిణామాలు కూడా ఉన్నందున, ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించాలని డెమొక్రాట్లు ట్రంప్ సర్కారుపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. పశ్చిమాసియాలో శాంతి నెలకొంటే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు స్థిరపడతాయి. అత్యధికంగా ఇంధనాన్ని దిగుమతి చేసుకునే భారత ఆర్థిక రంగానికి ఇది కొండంత ఊరటనిస్తుంది.భారత ఐటీ నిపుణులకు రక్షణ కవచంసాంకేతిక రంగంలో పనిచేసే భారతీయ నిపుణులపై హెచ్-1బీ వీసా పరిమితులను కఠినతరం చేయాలన్న ట్రంప్ ప్రణాళికలను డెమొక్రాట్ల కాంగ్రెస్ సమర్థవంతంగా అడ్డుకునే వీలుంది. అమెరికన్ టెక్ కంపెనీల పోటీతత్వానికి విదేశీ ప్రతిభ అవసరమని భావించే చట్టసభ సభ్యులు నిబంధనల సరళీకరణకు మద్దతు ఇవ్వవచ్చు. అయితే అమెరికా బడ్జెట్ కేటాయింపులపై కాంగ్రెస్, అధ్యక్షుడి మధ్య జరిగే రాజకీయ ఘర్షణలు ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితికి కారణమై రూపాయి మారకపు విలువపై ఒత్తిడి తెచ్చే ప్రమాదం లేకపోలేదు.అమెరికా కాంగ్రెస్‌లో అధికార సమతుల్యత మారడం భారత సంప్రదింపుల బృందాలకు విశేష బలాన్నిచ్చింది. అధ్యక్షుడి దూకుడుకు కాంగ్రెస్ అడ్డుకట్ట వేయడంతో, ఆసియా ప్రాంతంలో అత్యంత కీలకమైన భాగస్వామిగా ఉన్న భారత్ తన వాణిజ్య, ఆర్థిక ప్రయోజనాలను సమాన స్థాయిలో దక్కించుకునే వెసులుబాటు లభించింది.మరింత చదవండి

Source link