మరోవైపు, సెప్టెంబర్ త్రైమాసికంలో భారత్ బంగారం దిగుమతులు కూడా తగ్గాయి. ఈ ఏడాది ప్రారంభంలో ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాలను పెంచింది. దీంతో అధికారిక మార్గాల్లో కాకుండా అనధికారిక మార్గాల్లో బంగారం దేశంలోకి రావడం పెరిగిందని సచిన్ జైన్ తెలిపారు. ఈ కారణం కూడా అధికారిక బంగారం దిగుమతులు తగ్గడానికి కొంతవరకు కారణమైంది. మొత్తంగా చూస్తే, బంగారం ధరలు పెరగడం, గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయాలు తగ్గడం, పెట్టుబడుల కోసం కొనుగోళ్లు మందగించడం వంటివి దేశంలో పసిడి డిమాండ్‌పై ప్రభావం చూపుతున్నాయి. దీపావళి, పెళ్లిళ్ల సీజన్‌లో కొనుగోళ్లు కొంత పెరిగినా, 2026లో మొత్తం బంగారం డిమాండ్ ఆరేళ్ల కనిష్టానికి పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)

