ప్రభన్యూస్

India Pakistan: భారత్‌తో కటీఫ్ చెప్పి నిండా మునిగిన పాకిస్థాన్.. ఎన్ని లక్షల కోట్లు నష్టపోయిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! |


Last Updated:

2019 పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్‌తో వాణిజ్య సంబంధాలు తెగిపోవడం వల్ల పాకిస్థాన్ 40 బిలియన్ డాలర్ల మేర తీవ్ర ఆర్థిక నష్టాన్ని చవిచూసిందని పాక్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ చైర్మన్ నూర్ మహమ్మద్ ఖసూరి వెల్లడించారు.

News18
News18

పుల్వామా ఉగ్రదాడి అనంతరం 2019 నుంచి భారత్‌తో వాణిజ్య సంబంధాలు నిలిచిపోవడం వల్ల పాకిస్థాన్ ఏకంగా 40 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.3.3 లక్షల కోట్లకు పైగా) భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూసిందని పాక్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ చైర్మన్ నూర్ మహమ్మద్ ఖసూరి ఆందోళన వ్యక్తం చేశారు. పొరుగు దేశమైన భారత్‌తో వ్యాపార లావాదేవీలు నిలిచిపోవడం వల్ల పాక్ వ్యాపారులు ప్రత్యామ్నాయంగా దూరప్రాంత దేశాల నుంచి ముడిసరుకులు దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని తెలిపారు. దీనివల్ల రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగి పరిశ్రమలపై తీవ్ర భారం పడుతోందని వివరించారు.

భారత్‌తో తిరిగి వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించాలని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన గట్టిగా విజ్ఞప్తి చేశారు. వాణిజ్యం పునరుద్ధరణ జరిగితే సరఫరా గొలుసు మెరుగవడంతో పాటు పర్యాటకం, పెట్టుబడులు, ప్రాంతీయ సహకారానికి సరికొత్త మార్గాలు తెరుచుకుంటాయని ఖసూరి స్పష్టం చేశారు.

ఫార్మా, టెక్స్‌టైల్ రంగాలపై పెను భారం..

న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. భారత్‌తో వ్యాపారం ఆగిపోవడం వల్ల పాకిస్థాన్‌కు చెందిన ఔషధ, జౌళి పరిశ్రమలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. ఫార్మా రంగానికి అవసరమైన ముడిసరుకు భారత్‌లో తక్కువ ధరకే లభిస్తుందని, దిగుమతులు పునరుద్ధరిస్తే ఏటా దాదాపు 3 బిలియన్ డాలర్లు ఆదా అవుతాయని ఖసూరి పేర్కొన్నారు. అలాగే దేశీయంగా పత్తి ఉత్పత్తి పడిపోవడంతో టెక్స్‌టైల్ మిల్లులు బ్రెజిల్, ఈజిప్ట్, చైనా, అమెరికా దేశాలపై ఆధారపడటం వల్ల మరో 5 బిలియన్ డాలర్ల అదనపు భారం పడుతోందన్నారు.

భారత్‌లో భారీగా ఉత్పత్తి అవుతున్న చక్కర, ఎరువులు, సిమెంట్, పెట్రోలియం ఉత్పత్తులు, ఉక్కు, కూరగాయలను పాక్ ఇతర సుదూర దేశాల నుంచి ఖరీదైన ధరలకు కొనుగోలు చేస్తోందని గుర్తుచేశారు. భారత్ నుంచి చమురు దిగుమతులు చేసుకుంటే రవాణా ఖర్చు గణనీయంగా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.

శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు భారత్ ఆదుకున్న తీరును ఖసూరి ప్రస్తావించారు. రాజకీయ విభేదాలను పక్కనబెట్టి చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, ఆర్థిక అవకాశాలను కాలరాయవద్దని హితవు పలికారు. చారిత్రక, సాంస్కృతిక బంధాలున్న రెండు దేశాల మధ్య వాణిజ్యం తిరిగి మొదలైతే ఇరువైపులా మేలు జరుగుతుందని స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 November 2026, 10:43 pm Digital Edition : Prabhanews
India Pakistan: భారత్‌తో కటీఫ్ చెప్పి నిండా మునిగిన పాకిస్థాన్.. ఎన్ని లక్షల కోట్లు నష్టపోయిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! |

Last Updated:Nov 02, 2026 10:36 PM IST2019 పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్‌తో వాణిజ్య సంబంధాలు తెగిపోవడం వల్ల పాకిస్థాన్ 40 బిలియన్ డాలర్ల మేర తీవ్ర ఆర్థిక నష్టాన్ని చవిచూసిందని పాక్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ చైర్మన్ నూర్ మహమ్మద్ ఖసూరి వెల్లడించారు.News18పుల్వామా ఉగ్రదాడి అనంతరం 2019 నుంచి భారత్‌తో వాణిజ్య సంబంధాలు నిలిచిపోవడం వల్ల పాకిస్థాన్ ఏకంగా 40 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.3.3 లక్షల కోట్లకు పైగా) భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూసిందని పాక్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ చైర్మన్ నూర్ మహమ్మద్ ఖసూరి ఆందోళన వ్యక్తం చేశారు. పొరుగు దేశమైన భారత్‌తో వ్యాపార లావాదేవీలు నిలిచిపోవడం వల్ల పాక్ వ్యాపారులు ప్రత్యామ్నాయంగా దూరప్రాంత దేశాల నుంచి ముడిసరుకులు దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని తెలిపారు. దీనివల్ల రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగి పరిశ్రమలపై తీవ్ర భారం పడుతోందని వివరించారు.భారత్‌తో తిరిగి వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించాలని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన గట్టిగా విజ్ఞప్తి చేశారు. వాణిజ్యం పునరుద్ధరణ జరిగితే సరఫరా గొలుసు మెరుగవడంతో పాటు పర్యాటకం, పెట్టుబడులు, ప్రాంతీయ సహకారానికి సరికొత్త మార్గాలు తెరుచుకుంటాయని ఖసూరి స్పష్టం చేశారు.ఫార్మా, టెక్స్‌టైల్ రంగాలపై పెను భారం..న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. భారత్‌తో వ్యాపారం ఆగిపోవడం వల్ల పాకిస్థాన్‌కు చెందిన ఔషధ, జౌళి పరిశ్రమలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. ఫార్మా రంగానికి అవసరమైన ముడిసరుకు భారత్‌లో తక్కువ ధరకే లభిస్తుందని, దిగుమతులు పునరుద్ధరిస్తే ఏటా దాదాపు 3 బిలియన్ డాలర్లు ఆదా అవుతాయని ఖసూరి పేర్కొన్నారు. అలాగే దేశీయంగా పత్తి ఉత్పత్తి పడిపోవడంతో టెక్స్‌టైల్ మిల్లులు బ్రెజిల్, ఈజిప్ట్, చైనా, అమెరికా దేశాలపై ఆధారపడటం వల్ల మరో 5 బిలియన్ డాలర్ల అదనపు భారం పడుతోందన్నారు.భారత్‌లో భారీగా ఉత్పత్తి అవుతున్న చక్కర, ఎరువులు, సిమెంట్, పెట్రోలియం ఉత్పత్తులు, ఉక్కు, కూరగాయలను పాక్ ఇతర సుదూర దేశాల నుంచి ఖరీదైన ధరలకు కొనుగోలు చేస్తోందని గుర్తుచేశారు. భారత్ నుంచి చమురు దిగుమతులు చేసుకుంటే రవాణా ఖర్చు గణనీయంగా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు భారత్ ఆదుకున్న తీరును ఖసూరి ప్రస్తావించారు. రాజకీయ విభేదాలను పక్కనబెట్టి చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, ఆర్థిక అవకాశాలను కాలరాయవద్దని హితవు పలికారు. చారిత్రక, సాంస్కృతిక బంధాలున్న రెండు దేశాల మధ్య వాణిజ్యం తిరిగి మొదలైతే ఇరువైపులా మేలు జరుగుతుందని స్పష్టం చేశారు.మరింత చదవండి

Source link