ప్రభన్యూస్

Spain Train Crash: స్పెయిన్‌లో ఘోర ప్రమాదం.. రెండు హైస్పీడ్ రైళ్లు ఢీకొని 46 మంది దుర్మరణం! |


Last Updated:

స్పెయిన్‌లో రెండు హైస్పీడ్ రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 46 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు వెల్లడించారు.

Grok Gen
Grok Gen

స్పెయిన్‌లోని టోలెడో సమీపంలో బుధవారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. రెండు ప్రయాణికుల హైస్పీడ్ రైళ్లు బలంగా ఢీకొన్న దుర్ఘటనలో దాదాపు 46 మంది అక్కడికక్కడే మరణించినట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9 గంటల సమయంలో రెన్ఫే, ఇరియో సంస్థలకు చెందిన రెండు రైళ్లు మోరా, ఓర్గాజ్ పట్టణాల మధ్య ఒకదానికొకటి వేగంగా ఢీకొన్నాయి. ఈ భయానక ధాటికి ఇరియో రైలుకు చెందిన రెండు బోగీలు పట్టాలు తప్పి తుక్కుతుక్కయ్యాయి.

బోగీల శకలాలు ట్రాక్‌పై చెల్లాచెదురుగా పడిపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ప్రమాద తీవ్రత చూస్తుంటే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని స్థానిక మీడియా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. సమీపంలోని ఉర్దా మేయర్ మాన్యుయెల్ గాలన్ ఆదేశాలతో క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు స్థానిక స్పోర్ట్స్ హాల్‌ను తాత్కాలిక వైద్య శిబిరంగా మార్చారు.

ఈ ఘోర ప్రమాదం కారణంగా మాడ్రిడ్ నుంచి దక్షిణ అండలూసియా ప్రాంతాన్ని కలిపే హైస్పీడ్ రైలు మార్గాన్ని రైల్వే ఆపరేటర్ ఆదిఫ్ పూర్తిగా నిలిపివేసింది. ప్రమాదానికి గల సాంకేతిక కారణాలపై అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 28 October 2026, 4:15 pm Digital Edition : Prabhanews
Spain Train Crash: స్పెయిన్‌లో ఘోర ప్రమాదం.. రెండు హైస్పీడ్ రైళ్లు ఢీకొని 46 మంది దుర్మరణం! |

Last Updated:Oct 28, 2026 4:03 PM ISTస్పెయిన్‌లో రెండు హైస్పీడ్ రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 46 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు వెల్లడించారు.Grok Genస్పెయిన్‌లోని టోలెడో సమీపంలో బుధవారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. రెండు ప్రయాణికుల హైస్పీడ్ రైళ్లు బలంగా ఢీకొన్న దుర్ఘటనలో దాదాపు 46 మంది అక్కడికక్కడే మరణించినట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9 గంటల సమయంలో రెన్ఫే, ఇరియో సంస్థలకు చెందిన రెండు రైళ్లు మోరా, ఓర్గాజ్ పట్టణాల మధ్య ఒకదానికొకటి వేగంగా ఢీకొన్నాయి. ఈ భయానక ధాటికి ఇరియో రైలుకు చెందిన రెండు బోగీలు పట్టాలు తప్పి తుక్కుతుక్కయ్యాయి.బోగీల శకలాలు ట్రాక్‌పై చెల్లాచెదురుగా పడిపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ప్రమాద తీవ్రత చూస్తుంటే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని స్థానిక మీడియా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. సమీపంలోని ఉర్దా మేయర్ మాన్యుయెల్ గాలన్ ఆదేశాలతో క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు స్థానిక స్పోర్ట్స్ హాల్‌ను తాత్కాలిక వైద్య శిబిరంగా మార్చారు.
Choque entre un AVE de la línea Madrid-Andalucía y un tren de la compañía Iryo a la altura de Los Yébenes.
Por desgracia, hay víctimas mortales y se desconoce el número de heridos en esa nueva tragedia ferroviaria. https://t.co/RAkiRnsl17— Guaje Salvaje (@GuajeSalvaje) October 28, 2026ఈ ఘోర ప్రమాదం కారణంగా మాడ్రిడ్ నుంచి దక్షిణ అండలూసియా ప్రాంతాన్ని కలిపే హైస్పీడ్ రైలు మార్గాన్ని రైల్వే ఆపరేటర్ ఆదిఫ్ పూర్తిగా నిలిపివేసింది. ప్రమాదానికి గల సాంకేతిక కారణాలపై అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు.మరింత చదవండి

Source link