ప్రభన్యూస్

Viral: ఇంత కక్కుర్తి దొంగలను మీరెక్కడా చూసుండరు.. ఏం చేశారో తెలిస్తే అవాక్కు అవుతారు! | ట్రెండింగ్


Last Updated:

విచిత్ర దొంగలు.. తాపీగా స్కాచ్ విస్కీ తాగుతూ చెరువు గట్టున చిల్ అయ్యారు. వీడియో వైరల్.

Viral: ఇంత కక్కుర్తి దొంగలను మీరెక్కడా చూసుండరు.. ఏం చేశారో తెలిస్తే అవాక్కు అవుతారు!
Viral: ఇంత కక్కుర్తి దొంగలను మీరెక్కడా చూసుండరు.. ఏం చేశారో తెలిస్తే అవాక్కు అవుతారు!

దొంగతనం అనగానే భయంతో వణికిపోతూ క్షణాల్లో పారిపోవడం మనకు తెలుసు. కానీ పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు బర్ధమాన్ జిల్లాలో ఓ వింత చోరీ వెలుగుచూసింది. ముగ్గురు దొంగలు తాళాలు పగులగొట్టి లక్షల రూపాయల నగదు దోచుకోవడంతో అసలు ఆగలేదు. చోరీ చేసిన ఖరీదైన స్కాచ్ విస్కీ, డ్రై ఫ్రూట్స్ తీసుకుని స్థానికంగా ఉన్న ఓ చెరువు గట్టున కూర్చుని దర్జాగా మందు పార్టీ చేసుకున్నారు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన ఈ వింత దొంగతనం చూసి స్థానిక వ్యాపారులు తీవ్ర విస్మయానికి గురవుతున్నారు.

తూర్పు బర్ధమాన్ జిల్లాలోని మెమారి రైల్వే స్టేషన్ రోడ్డులో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ వరుస చోరీలు జరిగాయి. పక్కా ప్రణాళికతో వచ్చిన ముగ్గురు దొంగలు వరసగా దుకాణాల షట్టర్లు, తాళాలు సునాయాసంగా పగులగొట్టారు. రెండు మద్యం దుకాణాలు, ఒక స్టేషనరీ షాపు, ఒక పండ్ల దుకాణాన్ని ప్రధానంగా లక్ష్యంగా చేసుకున్నారు. ఆయా దుకాణాల్లో చొరబడి ఏకంగా నాలుగు లక్షల రూపాయల నగదును దోచుకున్నారు. కాళీ పూజ నేపథ్యంలో వ్యాపారులు గల్లా పెట్టెల్లో దాచుకున్న నగదు, ఇతర విలువైన వస్తువులను అపహరించి అక్కడి నుంచి ఉడాయించారు.

ఇది కూడా చదవండి: South Central Railway: దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్.. ఈ రూట్‌లో దీపావళి స్పెషల్ ట్రైన్స్!

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో తమ వైన్ షాపు వెనుక తలుపులు విరగ్గొట్టి దొంగలు లోపలికి చొరబడ్డారని కిషోర్ సాధుఖాన్ అనే వ్యాపారి తెలిపారు. గల్లా పెట్టెలో ఉన్న లక్ష రూపాయల నగదుతో పాటు రెండు ఖరీదైన విదేశీ మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లారని ఆయన వాపోయారు. పక్కనే ఉన్న స్టేషనరీ దుకాణం షట్టర్ పగులగొట్టి ముప్పై వేల రూపాయలు దోచుకెళ్లారని యజమాని సమీర్ మోండల్ చెప్పారు. తమ దుకాణంలో కిస్మిస్, ఖర్జూరం జాడీలు ఎత్తుకెళ్లారని పండ్ల వ్యాపారి శంభు సావు ఆవేదన వ్యక్తం చేశారు.

రైల్వే స్టేషన్ సమీపంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో వరుస చోరీలు జరగడం స్థానిక వ్యాపారుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. రాత్రి వేళల్లో భద్రత కరువైందని, పోలీసుల నిఘా పూర్తిగా లోపించిందని దుకాణదారులు మండిపడుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మెమారి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దొంగలు చెరువు గట్టున మద్యం సేవిస్తున్న దృశ్యాలు, దుకాణాల వద్ద రికార్డైన సీసీటీవీ ఫుటేజీని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. నిందితులను అతి త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 October 2026, 1:58 pm Digital Edition : Prabhanews
Viral: ఇంత కక్కుర్తి దొంగలను మీరెక్కడా చూసుండరు.. ఏం చేశారో తెలిస్తే అవాక్కు అవుతారు! | ట్రెండింగ్

Last Updated:Oct 29, 2026 1:55 PM ISTవిచిత్ర దొంగలు.. తాపీగా స్కాచ్ విస్కీ తాగుతూ చెరువు గట్టున చిల్ అయ్యారు. వీడియో వైరల్.Viral: ఇంత కక్కుర్తి దొంగలను మీరెక్కడా చూసుండరు.. ఏం చేశారో తెలిస్తే అవాక్కు అవుతారు!దొంగతనం అనగానే భయంతో వణికిపోతూ క్షణాల్లో పారిపోవడం మనకు తెలుసు. కానీ పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు బర్ధమాన్ జిల్లాలో ఓ వింత చోరీ వెలుగుచూసింది. ముగ్గురు దొంగలు తాళాలు పగులగొట్టి లక్షల రూపాయల నగదు దోచుకోవడంతో అసలు ఆగలేదు. చోరీ చేసిన ఖరీదైన స్కాచ్ విస్కీ, డ్రై ఫ్రూట్స్ తీసుకుని స్థానికంగా ఉన్న ఓ చెరువు గట్టున కూర్చుని దర్జాగా మందు పార్టీ చేసుకున్నారు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన ఈ వింత దొంగతనం చూసి స్థానిక వ్యాపారులు తీవ్ర విస్మయానికి గురవుతున్నారు.తూర్పు బర్ధమాన్ జిల్లాలోని మెమారి రైల్వే స్టేషన్ రోడ్డులో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ వరుస చోరీలు జరిగాయి. పక్కా ప్రణాళికతో వచ్చిన ముగ్గురు దొంగలు వరసగా దుకాణాల షట్టర్లు, తాళాలు సునాయాసంగా పగులగొట్టారు. రెండు మద్యం దుకాణాలు, ఒక స్టేషనరీ షాపు, ఒక పండ్ల దుకాణాన్ని ప్రధానంగా లక్ష్యంగా చేసుకున్నారు. ఆయా దుకాణాల్లో చొరబడి ఏకంగా నాలుగు లక్షల రూపాయల నగదును దోచుకున్నారు. కాళీ పూజ నేపథ్యంలో వ్యాపారులు గల్లా పెట్టెల్లో దాచుకున్న నగదు, ఇతర విలువైన వస్తువులను అపహరించి అక్కడి నుంచి ఉడాయించారు.ఇది కూడా చదవండి: South Central Railway: దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్.. ఈ రూట్‌లో దీపావళి స్పెషల్ ట్రైన్స్!బాధితులు తెలిపిన వివరాల ప్రకారం అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో తమ వైన్ షాపు వెనుక తలుపులు విరగ్గొట్టి దొంగలు లోపలికి చొరబడ్డారని కిషోర్ సాధుఖాన్ అనే వ్యాపారి తెలిపారు. గల్లా పెట్టెలో ఉన్న లక్ష రూపాయల నగదుతో పాటు రెండు ఖరీదైన విదేశీ మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లారని ఆయన వాపోయారు. పక్కనే ఉన్న స్టేషనరీ దుకాణం షట్టర్ పగులగొట్టి ముప్పై వేల రూపాయలు దోచుకెళ్లారని యజమాని సమీర్ మోండల్ చెప్పారు. తమ దుకాణంలో కిస్మిస్, ఖర్జూరం జాడీలు ఎత్తుకెళ్లారని పండ్ల వ్యాపారి శంభు సావు ఆవేదన వ్యక్తం చేశారు.రైల్వే స్టేషన్ సమీపంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో వరుస చోరీలు జరగడం స్థానిక వ్యాపారుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. రాత్రి వేళల్లో భద్రత కరువైందని, పోలీసుల నిఘా పూర్తిగా లోపించిందని దుకాణదారులు మండిపడుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మెమారి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దొంగలు చెరువు గట్టున మద్యం సేవిస్తున్న దృశ్యాలు, దుకాణాల వద్ద రికార్డైన సీసీటీవీ ఫుటేజీని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. నిందితులను అతి త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.మరింత చదవండి

Source link