ఇక సెన్సార్ వివరాలను పరిశీలిస్తే.. ‘ది ప్యారడైజ్’ మొత్తం 2 గంటల 54 నిమిషాల 4 సెకన్ల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు మూడు గంటల రన్‌టైమ్ ఉండటంతో సినిమాలో కథకు, పాత్రలకు, యాక్షన్ ఎపిసోడ్లకు దర్శకుడు ఎక్కువ స్పేస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ కథలో ప్రపంచ నిర్మాణం, పాత్రల నేపథ్యం, యాక్షన్ సన్నివేశాలకు ప్రాధాన్యం ఉన్నట్లు సమాచారం.

