కలువ పువ్వులు తెలుపు, గులాబీ, ఎరుపు, పసుపు, నీలం వంటి వివిధ రంగుల్లో కనిపిస్తాయి. కొన్ని రకాలు పగటిపూట పూస్తే.. మరికొన్ని రాత్రివేళల్లో వికసిస్తాయి. పువ్వుల ఆకారం, రంగు, సువాసన కారణంగా తోటలు, నీటి కొలనులు, అలంకరణ ప్రదేశాల్లో వీటిని పెంచేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు.

