ప్రభన్యూస్

Seasonal Jobs in India: పండుగ వేళ ఉద్యోగాల జాతర.. 2 నుంచి 2.5 లక్షల మందికి అవకాశాలు! | బిజినెస్


NLB సర్వీసెస్ అంచనా ప్రకారం, 2026 జూలై నుంచి డిసెంబర్ మధ్య భారత్‌లో 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు సీజనల్, గిగ్ ఉద్యోగాలు ఏర్పడే అవకాశం ఉంది. గతంతో పోలిస్తే పండుగల సీజన్‌లో ఉద్యోగాల డిమాండ్ దాదాపు 15-20 శాతం పెరిగే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. పండుగల సమయంలో ఆన్‌లైన్ షాపింగ్, డెలివరీలు, రిటైల్ కొనుగోళ్లు భారీగా పెరగడం దీనికి ప్రధాన కారణంగా నిలుస్తోంది.

పండుగల సమయంలో ఈ-కామర్స్ కంపెనీలకు ఆర్డర్లు భారీగా పెరుగుతాయి. అదే సమయంలో క్విక్ కామర్స్ సంస్థల్లో నిమిషాల్లో డెలివరీ చేసే సేవలకు డిమాండ్ పెరుగుతుంది. రిటైల్ స్టోర్లు, గిడ్డంగులు, డెలివరీ నెట్‌వర్క్‌లు కూడా అదనపు సిబ్బందిని నియమించుకోవాల్సి వస్తుంది. దీంతో వేర్‌హౌస్ సిబ్బంది, డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు, కస్టమర్ సర్వీస్ ఉద్యోగులు, ఫీల్డ్ ఆపరేషన్స్ సిబ్బంది, హాస్పిటాలిటీ సిబ్బంది వంటి పోస్టులకు డిమాండ్ పెరగవచ్చు. పండుగల సమయంలో ప్రయాణాలు పెరగడంతో ట్రావెల్, హోటల్ రంగాల్లో కూడా తాత్కాలిక నియామకాలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. NLB సర్వీసెస్ SVP, APAC హెడ్ వరుణ్ సచ్‌దేవా మాట్లాడుతూ.. పండుగ సీజన్ భారతదేశంలోని ఉద్యోగ మార్కెట్‌కు ఒక కీలక పరీక్షగా మారుతోందని తెలిపారు. కంపెనీలు అవసరం ఏర్పడిన తర్వాత నియామకాలు చేపట్టడం కంటే ముందుగానే ప్రతిభను గుర్తించి సిద్ధంగా ఉంచుకోవడంపై దృష్టి పెడుతున్నాయని చెప్పారు. టెక్నాలజీ ఆధారిత, ఫ్లెక్సిబుల్‌గా పనిచేయగల సిబ్బందికి ప్రాధాన్యం పెరుగుతోందని పేర్కొన్నారు.

కొత్త తరహా ఉద్యోగాలకు డిమాండ్..

పండుగ సీజన్‌లో సంప్రదాయ ఉద్యోగాలతో పాటు కొత్త తరహా ఆపరేషనల్ పోస్టులకు కూడా డిమాండ్ పెరుగుతోంది. డార్క్ స్టోర్ సిబ్బంది, రిటర్న్స్ నిర్వహణ, మార్కెట్‌ప్లేస్ ఆపరేషన్స్, కస్టమర్ సపోర్ట్, మోసం గుర్తింపు, ట్రాన్సాక్షన్ సపోర్ట్, కేటలాగ్ మేనేజ్‌మెంట్, ఆర్డర్ మేనేజ్‌మెంట్ వంటి విభాగాల్లో నియామకాలు పెరగవచ్చని నివేదిక తెలిపింది. ఈ ఉద్యోగాలు కేవలం సాధారణ ఆపరేషనల్ పనులకు పరిమితం కావడం లేదు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, డేటా, ఆటోమేషన్, రియల్ టైమ్ నిర్ణయాలు వంటి అంశాలపై ఆధారపడే విధంగా ఉద్యోగాల స్వరూపం కూడా మారుతోంది. అందువల్ల ప్రాథమిక డిజిటల్ నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులకు పండుగ సీజన్‌లో మరిన్ని అవకాశాలు లభించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి: DDU-GKY: ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? గ్రామీణ యువతకు కేంద్రం కొత్త శిక్షణ బ్యాచ్‌లు.. వివరాలు ఇవే!

పండుగ ఉద్యోగాల డిమాండ్ కేవలం ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో నగరాలకే పరిమితం కావడం లేదు. టైర్-2, టైర్-3 నగరాలు మొత్తం పండుగ ఉద్యోగాల డిమాండ్‌లో దాదాపు 45 శాతం వాటాను కలిగి ఉండవచ్చని నివేదిక అంచనా వేసింది. ఈ నగరాల్లో పండుగ సీజన్‌కు సంబంధించిన ఉద్యోగాల సంఖ్య 25-30 శాతం వరకు పెరగవచ్చని అంచనా. ఈ-కామర్స్, క్విక్ కామర్స్, ఆర్గనైజ్డ్ రిటైల్, ప్రాంతీయ డెలివరీ, ఫుల్‌ఫిల్‌మెంట్ నెట్‌వర్క్‌లు విస్తరించడంతో జైపూర్, భువనేశ్వర్, కోయంబత్తూర్, చండీగఢ్, కొచ్చి వంటి నగరాల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయని నివేదిక పేర్కొంది. ఈసారి పండుగ సీజన్ ఉద్యోగాల్లో మరో ముఖ్యమైన మార్పు కనిపించవచ్చని నివేదిక తెలిపింది. కొత్తగా ఉద్యోగాల్లోకి అడుగుపెట్టేవారు, మొదటిసారి పనిచేయాలనుకునే యువత, మహిళలకు తాత్కాలిక ఉద్యోగాలు మంచి అవకాశాలను అందించవచ్చని పేర్కొంది.

ముఖ్యంగా కొత్తగా వర్క్‌ఫోర్స్‌లోకి ప్రవేశించే వారిలో మహిళల వాటా 30-35 శాతం వరకు ఉండవచ్చని నివేదిక అంచనా వేసింది. అంటే పండుగ సీజన్‌లో పెరుగుతున్న ఉద్యోగ డిమాండ్ సంప్రదాయంగా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండే నగరాలు, వర్గాలకే పరిమితం కాకుండా కొత్త ప్రాంతాలు, కొత్త ఉద్యోగార్థులకు కూడా అవకాశాలు తెరుస్తోంది. పండుగల సమయంలో ఉద్యోగుల అవసరం ఒక్కసారిగా పెరగడంతో చివరి నిమిషంలో నియామకాలు చేపట్టడం కంపెనీలకు సవాలుగా మారుతోంది. అందుకే పండుగ సీజన్ ప్రారంభానికి 12-14 వారాల ముందే ప్రతిభావంతులైన అభ్యర్థుల పూల్‌ను సిద్ధం చేసుకోవాలని సంస్థలు చూస్తున్నాయని నివేదిక తెలిపింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 19 September 2026, 3:50 pm Digital Edition : Prabhanews
Seasonal Jobs in India: పండుగ వేళ ఉద్యోగాల జాతర.. 2 నుంచి 2.5 లక్షల మందికి అవకాశాలు! | బిజినెస్

NLB సర్వీసెస్ అంచనా ప్రకారం, 2026 జూలై నుంచి డిసెంబర్ మధ్య భారత్‌లో 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు సీజనల్, గిగ్ ఉద్యోగాలు ఏర్పడే అవకాశం ఉంది. గతంతో పోలిస్తే పండుగల సీజన్‌లో ఉద్యోగాల డిమాండ్ దాదాపు 15-20 శాతం పెరిగే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. పండుగల సమయంలో ఆన్‌లైన్ షాపింగ్, డెలివరీలు, రిటైల్ కొనుగోళ్లు భారీగా పెరగడం దీనికి ప్రధాన కారణంగా నిలుస్తోంది.పండుగల సమయంలో ఈ-కామర్స్ కంపెనీలకు ఆర్డర్లు భారీగా పెరుగుతాయి. అదే సమయంలో క్విక్ కామర్స్ సంస్థల్లో నిమిషాల్లో డెలివరీ చేసే సేవలకు డిమాండ్ పెరుగుతుంది. రిటైల్ స్టోర్లు, గిడ్డంగులు, డెలివరీ నెట్‌వర్క్‌లు కూడా అదనపు సిబ్బందిని నియమించుకోవాల్సి వస్తుంది. దీంతో వేర్‌హౌస్ సిబ్బంది, డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు, కస్టమర్ సర్వీస్ ఉద్యోగులు, ఫీల్డ్ ఆపరేషన్స్ సిబ్బంది, హాస్పిటాలిటీ సిబ్బంది వంటి పోస్టులకు డిమాండ్ పెరగవచ్చు. పండుగల సమయంలో ప్రయాణాలు పెరగడంతో ట్రావెల్, హోటల్ రంగాల్లో కూడా తాత్కాలిక నియామకాలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. NLB సర్వీసెస్ SVP, APAC హెడ్ వరుణ్ సచ్‌దేవా మాట్లాడుతూ.. పండుగ సీజన్ భారతదేశంలోని ఉద్యోగ మార్కెట్‌కు ఒక కీలక పరీక్షగా మారుతోందని తెలిపారు. కంపెనీలు అవసరం ఏర్పడిన తర్వాత నియామకాలు చేపట్టడం కంటే ముందుగానే ప్రతిభను గుర్తించి సిద్ధంగా ఉంచుకోవడంపై దృష్టి పెడుతున్నాయని చెప్పారు. టెక్నాలజీ ఆధారిత, ఫ్లెక్సిబుల్‌గా పనిచేయగల సిబ్బందికి ప్రాధాన్యం పెరుగుతోందని పేర్కొన్నారు.కొత్త తరహా ఉద్యోగాలకు డిమాండ్..పండుగ సీజన్‌లో సంప్రదాయ ఉద్యోగాలతో పాటు కొత్త తరహా ఆపరేషనల్ పోస్టులకు కూడా డిమాండ్ పెరుగుతోంది. డార్క్ స్టోర్ సిబ్బంది, రిటర్న్స్ నిర్వహణ, మార్కెట్‌ప్లేస్ ఆపరేషన్స్, కస్టమర్ సపోర్ట్, మోసం గుర్తింపు, ట్రాన్సాక్షన్ సపోర్ట్, కేటలాగ్ మేనేజ్‌మెంట్, ఆర్డర్ మేనేజ్‌మెంట్ వంటి విభాగాల్లో నియామకాలు పెరగవచ్చని నివేదిక తెలిపింది. ఈ ఉద్యోగాలు కేవలం సాధారణ ఆపరేషనల్ పనులకు పరిమితం కావడం లేదు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, డేటా, ఆటోమేషన్, రియల్ టైమ్ నిర్ణయాలు వంటి అంశాలపై ఆధారపడే విధంగా ఉద్యోగాల స్వరూపం కూడా మారుతోంది. అందువల్ల ప్రాథమిక డిజిటల్ నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులకు పండుగ సీజన్‌లో మరిన్ని అవకాశాలు లభించే అవకాశం ఉంది.ఇవి కూడా చదవండి: DDU-GKY: ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? గ్రామీణ యువతకు కేంద్రం కొత్త శిక్షణ బ్యాచ్‌లు.. వివరాలు ఇవే!పండుగ ఉద్యోగాల డిమాండ్ కేవలం ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో నగరాలకే పరిమితం కావడం లేదు. టైర్-2, టైర్-3 నగరాలు మొత్తం పండుగ ఉద్యోగాల డిమాండ్‌లో దాదాపు 45 శాతం వాటాను కలిగి ఉండవచ్చని నివేదిక అంచనా వేసింది. ఈ నగరాల్లో పండుగ సీజన్‌కు సంబంధించిన ఉద్యోగాల సంఖ్య 25-30 శాతం వరకు పెరగవచ్చని అంచనా. ఈ-కామర్స్, క్విక్ కామర్స్, ఆర్గనైజ్డ్ రిటైల్, ప్రాంతీయ డెలివరీ, ఫుల్‌ఫిల్‌మెంట్ నెట్‌వర్క్‌లు విస్తరించడంతో జైపూర్, భువనేశ్వర్, కోయంబత్తూర్, చండీగఢ్, కొచ్చి వంటి నగరాల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయని నివేదిక పేర్కొంది. ఈసారి పండుగ సీజన్ ఉద్యోగాల్లో మరో ముఖ్యమైన మార్పు కనిపించవచ్చని నివేదిక తెలిపింది. కొత్తగా ఉద్యోగాల్లోకి అడుగుపెట్టేవారు, మొదటిసారి పనిచేయాలనుకునే యువత, మహిళలకు తాత్కాలిక ఉద్యోగాలు మంచి అవకాశాలను అందించవచ్చని పేర్కొంది.ముఖ్యంగా కొత్తగా వర్క్‌ఫోర్స్‌లోకి ప్రవేశించే వారిలో మహిళల వాటా 30-35 శాతం వరకు ఉండవచ్చని నివేదిక అంచనా వేసింది. అంటే పండుగ సీజన్‌లో పెరుగుతున్న ఉద్యోగ డిమాండ్ సంప్రదాయంగా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండే నగరాలు, వర్గాలకే పరిమితం కాకుండా కొత్త ప్రాంతాలు, కొత్త ఉద్యోగార్థులకు కూడా అవకాశాలు తెరుస్తోంది. పండుగల సమయంలో ఉద్యోగుల అవసరం ఒక్కసారిగా పెరగడంతో చివరి నిమిషంలో నియామకాలు చేపట్టడం కంపెనీలకు సవాలుగా మారుతోంది. అందుకే పండుగ సీజన్ ప్రారంభానికి 12-14 వారాల ముందే ప్రతిభావంతులైన అభ్యర్థుల పూల్‌ను సిద్ధం చేసుకోవాలని సంస్థలు చూస్తున్నాయని నివేదిక తెలిపింది.

Source link