Last Updated:
GK: కారు, బైక్, బస్సు, ట్రక్కు.. ఏ వాహనాన్ని చూసినా వెనుక భాగంలో ఎర్రటి లైట్లు కనిపిస్తాయి. ముందు తెల్లటి హెడ్లైట్లు ఉంటే వెనుక మాత్రం టెయిల్ లైట్లు, బ్రేక్ లైట్లు ఎరుపు రంగులోనే ఉంటాయి. అసలు వాహనాల వెనుక లైట్లకు ఎరుపు రంగునే ఎందుకు ఎంచుకున్నారు? ఇది కేవలం ట్రాఫిక్ నిబంధనల్లో భాగమేనా? లేక దీని వెనుక సైన్స్ కూడా ఉందా? నిజానికి వాహన లైట్ల రంగులను యథేచ్ఛగా నిర్ణయించలేదు. ఇతర డ్రైవర్లు వాహనం దిశ, స్థానం, బ్రేకింగ్ వంటి విషయాలను వెంటనే గుర్తించేలా ఈ రంగులకు ప్రత్యేక అర్థాలను కేటాయించారు. మరి వెనుక భాగంలో ఎరుపు రంగుకే ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చారు?
