ఈ రామాయణ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నట్లు ముందుగానే చెప్పిన మేకర్స్.. రామాయణ పార్ట్-1 తో ఆడియన్స్ పల్స్ పట్టేశారు. ఇప్పటికే రామాయణ ఇతిహాస కథను పలు సీరియల్స్, సినిమాల రూపంలో చూశాం కానీ, నితీష్ తివారీ మాత్రం తన మార్క్ చూపించేలా ఎంతో అద్భుతంగా ఈ సినిమాను వెండితెరపై ఆవిష్కరించారు. రాముడి పుట్టుక మొదలుకొని, సీతాపరిణయం, వనవాసం, సీతాపహరణ లాంటి దృశ్యాలు కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. నేరుగా రాముడు, రావణాసురుని మధ్య జరిగే మహా సంగ్రామానికి వెళ్లకుండా, ఆయా పాత్రల స్వభావాన్ని, భావోద్వేగాలను లోతుగా చూపించే ప్రయత్నం చేశారు.

