హైదరాబాద్‌లో సాధారణంగా MRI స్కాన్ ఖర్చు స్కాన్ చేయాల్సిన శరీర భాగం, కాంట్రాస్ట్ అవసరమా లేదా, అలాగే ఆస్పత్రి లేదా డయాగ్నస్టిక్ సెంటర్‌ను బట్టి మారుతుంది. సాధారణంగా బ్రెయిన్, స్పైన్, మోకాలు వంటి MRI స్కాన్లకు సుమారు రూ.2,500 నుంచి రూ.4,500 వరకు ఖర్చవుతుంది. అబ్డామెన్, పెల్విస్ వంటి ప్రత్యేక స్కాన్లకు రూ.5,000 నుంచి రూ.6,000 వరకు, బ్రెయిన్‌తో పాటు మొత్తం స్పైన్ వంటి విస్తృత స్కాన్లకు రూ.5,500 నుంచి రూ.7,500 లేదా అంతకంటే ఎక్కువ ఖర్చవచ్చు. కాంట్రాస్ట్ MRI అయితే అదనపు ఛార్జీలు ఉండే అవకాశం ఉంది. మొత్తంగా హైదరాబాద్‌లో ఒక సాధారణ MRIకి సుమారు రూ.2,500-రూ.7,500 వరకు ఖర్చవుతుందని చెప్పొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)

