పుట్టిన పిల్లలు ఉంటే ఇంట్లో ఆ సందడి వేరు. ముందే ప్లాన్ చేసుకున్న ఖర్చులతో నడిచే చిన్న కుటుంబంలోకి కొత్త బిడ్డ వస్తే పరిస్థితి ఒక్కసారిగా మారిపోతుంది. రాత్రిళ్లు నిద్ర లేకపోవడం, బేబీ డైపర్లు, వైప్స్, డాక్టర్‌ను కలవడం, మందులు తీసుకోవడం ఇలా కొత్తగా ఎన్నో పనులు, ఖర్చులు మొదలవుతాయి. బిడ్డపై ప్రేమ ఎంత పెద్దదో, బాధ్యతలు, ఖర్చులు కూడా అంతే పెద్దవిగా మారతాయి. బిడ్డ సంరక్షణ నుంచి ప్రసవం తర్వాత తల్లి ఆరోగ్య సంరక్షణ వరకు, కుటుంబంలో కొత్త సభ్యుడు చేరిన తర్వాత హెల్త్‌కేర్ ఉత్పత్తులు చాలా అవసరంగా మారుతున్నాయి. మందులు ఆరోగ్యానికి అయ్యే ఖర్చులో ముఖ్యమైన భాగమే. కానీ కొత్తగా బిడ్డ పుట్టిన కుటుంబాలకు, ఆపరేషన్ తర్వాత కోలుకుంటున్న వారికి, వృద్ధ తల్లిదండ్రులు లేదా ఇతర కుటుంబ సభ్యులను చూసుకునే వారికి ఖర్చులు మందులతోనే ఆగిపోవు. ఈ నేపథ్యంలో మందులతో పాటు అందుబాటులో ఉండే చవకైన హెల్త్‌కేర్ ఉత్పత్తులు కూడా అవసరమే. ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రధాన మంత్రి భారతీయ జనఔషధి పరియోజన (పీఎంబీజేపీ) పరిధిని క్రమంగా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా 20,000కు పైగా జనఔషధి కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారా సర్జికల్, హెల్త్‌కేర్ ఉత్పత్తులు కూడా అందుబాటు ధరల్లో కుటుంబాలకు దగ్గర్లోనే లభిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)

