Last Updated:
తైవాన్‌కు అమెరికా కొత్తగా ఆయుధాలు విక్రయించడంపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఒప్పందాన్ని వెంటనే నిలిపివేయకపోతే, త్వరలో జరగాల్సిన ట్రంప్, జిన్‌పింగ్ సదస్సును రద్దు చేస్తామని అమెరికాను డ్రాగన్ సర్కార్ గట్టిగా హెచ్చరించింది.
తైవాన్ ప్రాదేశిక వివాదంపై చైనా, అమెరికా మధ్య మరోసారి తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. స్వయం ప్రతిపత్తి గల తైవాన్‌కు అమెరికా భారీ ఎత్తున అత్యాధునిక ఆయుధాలను విక్రయించేందుకు సిద్ధపడటమే ఈ తాజా వివాదానికి ప్రధాన కారణం. ఈ ఆయుధ విక్రయాల ఒప్పందంపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తైవాన్ తమ భూభాగంలో అంతర్భాగమని, దానికి ఆయుధాలు సరఫరా చేయడం తమ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని చైనా మండిపడింది.

