Last Updated:
తెలంగాణలో సినిమా టికెట్ల ధరలను సవరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సినిమా థియేటర్లను వాటి వసతులు, సౌకర్యాల ఆధారంగా వివిధ కేటగిరీలుగా విభజిస్తూ రాష్ట్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.
తెలంగాణలో సినిమా టికెట్ల ధరలను సవరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సినిమా థియేటర్లను వాటి వసతులు, సౌకర్యాల ఆధారంగా వివిధ కేటగిరీలుగా విభజిస్తూ రాష్ట్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. అలాగే భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ ధరల పెంపుపై కూడా నిబంధనలు తీసుకొచ్చింది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై థియేటర్ యాజమాన్యాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

