Monsoon Kids Health: వర్షాకాలంలో పిల్లలకు ఈ ఆహారాలు పెట్టొద్దు.. ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది! | లైఫ్ స్టైల్
వర్షాకాలంలో బయట దొరికే స్ట్రీట్ ఫుడ్‌ను పిల్లలకు ఇవ్వకుండా ఉండటం మంచిది. చాట్, పానీపూరి, సమోసా, పకోడీ, బజ్జీలు వంటి ఆహారాలు బయట ఎక్కువసేపు ఉండటం వల్ల వాటిలో సూక్ష్మజీవులు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే వాటిని తయారు చేసే నీరు, నూనె కూడా పరిశుభ్రంగా లేకపోవచ్చు. ఇలాంటి ఆహారం తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్, విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పి వంటి సమస్యలు రావచ్చు. పిల్లలు బయట తినాలని కోరితే ఇంట్లోనే శుభ్రంగా తయారు చేసి…
