ప్రభన్యూస్

20 రోజుల్లోనే చోరీ కేసు ఛేదన.. అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్.

రూ .1.75 లక్షల చోరీ సొత్తు, కారు, మొబైల్ ఫోన్లు స్వాధీనంసాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించిన నిజాంసాగర్ పోలీసులు

ప్రభ న్యూస్, కామారెడ్డి జిల్లా, నిజాంసాగర్, జూలై 24:

నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అచ్చంపేట్ శివారులో నిర్మాణంలో ఉన్న కాటేజీల్లో జరిగిన రూ.1.75 లక్షల విలువైన చోరీ కేసును పోలీసులు కేవలం 20 రోజుల్లోనే ఛేదించారు. సాంకేతిక ఆధారాలు, శాస్త్రీయ దర్యాప్తు ఆధారంగా ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేసి, చోరీకి గురైన సొత్తుతో పాటు నేరానికి వినియోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అచ్చంపేట్ శివారులో నిర్మాణంలో ఉన్న కాటేజీల్లో గతంలో పనిచేసిన గట్టు రాకేష్ (29), తమ్మినేని లక్ష్మణ్ రావు అలియాస్ శివ (25) ఉద్యోగాలు కోల్పోయిన తర్వాత సంస్థపై కక్ష పెంచుకున్నారు. ఈ నెల 4వ తేదీ అర్ధరాత్రి మారుతి రిట్జ్ కారులో అక్కడికి చేరుకుని, కాటేజీ తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. అనంతరం రెండు కట్టర్లు, రెండు వెల్డింగ్ మిషన్లు, ఒక క్లిప్పర్ బాక్స్ తదితర రూ.1.75 లక్షల విలువైన సామగ్రిని అపహరించారు.ఈ ఘటనపై కాటేజీ సూపర్వైజర్ అందె మహేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిజాంసాగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తూ నిందితుల కదలికలను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. అనంతరం ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.నిందితుల నుంచి రెండు కట్టర్లు, రెండు వెల్డింగ్ మిషన్లు, ఒక క్లిప్పర్ బాక్స్, చోరీకి వినియోగించిన మారుతి రిట్జ్ కారు, రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.చోరీ కేసును సమర్థవంతంగా ఛేదించిన బాన్స్వాడ రూరల్ సీఐ ఎ. తిరుపయ్య, నిజాంసాగర్ ఎస్‌ఐ జె. శివకుమార్, సాంకేతిక విభాగం సిబ్బంది, పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 25 July 2026, 12:26 pm Digital Edition : Prabhanews
<b> 20 రోజుల్లోనే చోరీ కేసు ఛేదన.. అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్.