ప్రభన్యూస్

బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటున్నారా? ఈ కొత్త లెక్కలు తెలిస్తే ఆశ్చర్యపోతారు! | బిజినెస్


Last Updated:

దేశంలో గోల్డ్ లోన్లు, కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. అయితే మరోవైపు ఈ రుణాల చెల్లింపుల్లోనూ సమస్యలు పెరుగుతున్నాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో లోన్ బకాయిలు, రిటైల్ క్రెడిట్ మార్కెట్‌లో వచ్చిన మార్పులపై క్రిఫ్ తాజా నివేదిక ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటున్నారా? ఈ కొత్త లెక్కలు తెలిస్తే ఆశ్చర్యపోతారు! (ప్రతీకాత్మక చిత్రం)
బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటున్నారా? ఈ కొత్త లెక్కలు తెలిస్తే ఆశ్చర్యపోతారు! (ప్రతీకాత్మక చిత్రం)

గోల్డ్ లోన్లు, కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లు తీసుకునే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. అయితే ఈ రెండు రకాల రిటైల్ లోన్లలో బకాయిలు కూడా పెరుగుతున్నాయి. దీంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలకు రుణాల రికవరీ విషయంలో ఒత్తిడి పెరుగుతోంది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ రెండు విభాగాల్లో ఆస్తుల నాణ్యతపై ఒత్తిడి పెరిగిందని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సంస్థ క్రిఫ్ (CRIF) వెల్లడించింది. క్రిఫ్ విడుదల చేసిన తాజా డేటా ప్రకారం.. సెప్టెంబర్ నాటికి కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్ల మొత్తం విలువ ఏడాది క్రితంతో పోలిస్తే 44.5 శాతం పెరిగి రూ.1.3 లక్షల కోట్లకు చేరింది. ఇక గోల్డ్ లోన్లలో వృద్ధి మరింత ఎక్కువగా నమోదైంది. ఈ విభాగం 60.6 శాతం పెరిగి రూ.23.3 లక్షల కోట్లకు చేరుకుంది.

మరోవైపు లోన్ల బకాయిలు కూడా పెరుగుతున్నాయి. గోల్డ్ లోన్లలో 31 రోజుల నుంచి 180 రోజుల మధ్య బకాయి పడిన రుణాల వాటా జూన్‌లో 1.3 శాతంగా ఉండగా, సెప్టెంబర్ 30 నాటికి 1.6 శాతానికి పెరిగింది. అంటే గోల్డ్ లోన్లు తీసుకున్న వారిలో కొంతమంది ఈఎంఐలు లేదా రుణ చెల్లింపులు సకాలంలో చేయలేకపోతున్నారు. కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ విభాగంలో 31 నుంచి 180 రోజుల మధ్య బకాయి పడిన రుణాల వాటా మూడు నెలల క్రితం 1.6 శాతంగా ఉండేది. సెప్టెంబర్ నాటికి అది 1.8 శాతానికి చేరింది.

వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల వ్యవసాయ రంగంపై ప్రభావం పడింది. మూడు రాష్ట్రాలు కరువు పరిస్థితులను ప్రకటించాల్సి వచ్చింది. దీంతో రైతుల ఆదాయంపై ఒత్తిడి పెరిగి ట్రాక్టర్ లోన్ల చెల్లింపులపై కూడా ప్రభావం పడినట్లు నివేదిక తెలిపింది. 2027 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (క్యూ2ఎఫ్‌వై27)లో ట్రాక్టర్ లోన్లలో ఆస్తుల నాణ్యతపై ఒత్తిడి 4.6 శాతం నుంచి 5.3 శాతానికి పెరిగింది.

మొత్తం రిటైల్ లోన్లలో 18.8 శాతం వృద్ధి

మరోవైపు, దేశంలో మొత్తం రిటైల్ క్రెడిట్ మార్కెట్ మాత్రం మంచి వృద్ధిని నమోదు చేసింది. ఏడాది ప్రాతిపదికన 18.8 శాతం పెరిగి మొత్తం రిటైల్ రుణాల విలువ రూ.185 లక్షల కోట్లకు చేరుకుంది. రిటైల్ ఫైనాన్స్‌లో హోమ్ లోన్లు (మార్గేజ్ లోన్లు) ఇప్పటికీ కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఇతర రకాల రుణాలు వేగంగా పెరుగుతుండటంతో మొత్తం రిటైల్ క్రెడిట్‌లో ఒక్కో రుణ విభాగం వాటాలో మార్పులు వస్తున్నాయి. గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్‌లో పర్సనల్ లోన్లు, క్రెడిట్ కార్డులు, కొలేటరల్ లేని బిజినెస్ లోన్లు, వ్యవసాయ రుణాలు, హోమ్ లోన్ల వృద్ధి వేగం తగ్గింది.

మార్గేజ్ లోన్ల విభాగంలో వృద్ధి 10.4 శాతానికే పరిమితం కావడంతో మొత్తం రిటైల్ క్రెడిట్‌లో వాటా తగ్గింది. గత ఏడాదితో పోలిస్తే ఈ వాటా 1.9 శాతం పాయింట్లు తగ్గి 25.1 శాతానికి చేరింది. అదే సమయంలో గోల్డ్ లోన్ల వాటా గణనీయంగా పెరిగింది. మొత్తం రిటైల్ క్రెడిట్‌లో గోల్డ్ లోన్ల వాటా 3.3 శాతం పాయింట్లు పెరిగి 12.6 శాతానికి చేరింది. కొలేటరల్‌తో తీసుకునే బిజినెస్ లోన్ల వాటా కూడా 1.9 శాతం పాయింట్లు పెరిగి 10.6 శాతానికి చేరినట్లు క్రిఫ్ నివేదిక వెల్లడించింది. మొత్తంగా చూస్తే, దేశంలో రిటైల్ రుణాల మార్కెట్ వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, కొన్ని రకాల లోన్లలో బకాయిలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా గోల్డ్ లోన్లు, కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లు, ట్రాక్టర్ లోన్లలో రుణ చెల్లింపుల పరిస్థితిని బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు మరింత జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 November 2026, 10:39 am Digital Edition : Prabhanews
బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటున్నారా? ఈ కొత్త లెక్కలు తెలిస్తే ఆశ్చర్యపోతారు! | బిజినెస్

Last Updated:Nov 18, 2026 9:48 AM ISTదేశంలో గోల్డ్ లోన్లు, కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. అయితే మరోవైపు ఈ రుణాల చెల్లింపుల్లోనూ సమస్యలు పెరుగుతున్నాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో లోన్ బకాయిలు, రిటైల్ క్రెడిట్ మార్కెట్‌లో వచ్చిన మార్పులపై క్రిఫ్ తాజా నివేదిక ఆసక్తికర విషయాలను వెల్లడించింది.బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటున్నారా? ఈ కొత్త లెక్కలు తెలిస్తే ఆశ్చర్యపోతారు! (ప్రతీకాత్మక చిత్రం)గోల్డ్ లోన్లు, కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లు తీసుకునే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. అయితే ఈ రెండు రకాల రిటైల్ లోన్లలో బకాయిలు కూడా పెరుగుతున్నాయి. దీంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలకు రుణాల రికవరీ విషయంలో ఒత్తిడి పెరుగుతోంది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ రెండు విభాగాల్లో ఆస్తుల నాణ్యతపై ఒత్తిడి పెరిగిందని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సంస్థ క్రిఫ్ (CRIF) వెల్లడించింది. క్రిఫ్ విడుదల చేసిన తాజా డేటా ప్రకారం.. సెప్టెంబర్ నాటికి కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్ల మొత్తం విలువ ఏడాది క్రితంతో పోలిస్తే 44.5 శాతం పెరిగి రూ.1.3 లక్షల కోట్లకు చేరింది. ఇక గోల్డ్ లోన్లలో వృద్ధి మరింత ఎక్కువగా నమోదైంది. ఈ విభాగం 60.6 శాతం పెరిగి రూ.23.3 లక్షల కోట్లకు చేరుకుంది.మరోవైపు లోన్ల బకాయిలు కూడా పెరుగుతున్నాయి. గోల్డ్ లోన్లలో 31 రోజుల నుంచి 180 రోజుల మధ్య బకాయి పడిన రుణాల వాటా జూన్‌లో 1.3 శాతంగా ఉండగా, సెప్టెంబర్ 30 నాటికి 1.6 శాతానికి పెరిగింది. అంటే గోల్డ్ లోన్లు తీసుకున్న వారిలో కొంతమంది ఈఎంఐలు లేదా రుణ చెల్లింపులు సకాలంలో చేయలేకపోతున్నారు. కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ విభాగంలో 31 నుంచి 180 రోజుల మధ్య బకాయి పడిన రుణాల వాటా మూడు నెలల క్రితం 1.6 శాతంగా ఉండేది. సెప్టెంబర్ నాటికి అది 1.8 శాతానికి చేరింది.వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల వ్యవసాయ రంగంపై ప్రభావం పడింది. మూడు రాష్ట్రాలు కరువు పరిస్థితులను ప్రకటించాల్సి వచ్చింది. దీంతో రైతుల ఆదాయంపై ఒత్తిడి పెరిగి ట్రాక్టర్ లోన్ల చెల్లింపులపై కూడా ప్రభావం పడినట్లు నివేదిక తెలిపింది. 2027 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (క్యూ2ఎఫ్‌వై27)లో ట్రాక్టర్ లోన్లలో ఆస్తుల నాణ్యతపై ఒత్తిడి 4.6 శాతం నుంచి 5.3 శాతానికి పెరిగింది.మొత్తం రిటైల్ లోన్లలో 18.8 శాతం వృద్ధిమరోవైపు, దేశంలో మొత్తం రిటైల్ క్రెడిట్ మార్కెట్ మాత్రం మంచి వృద్ధిని నమోదు చేసింది. ఏడాది ప్రాతిపదికన 18.8 శాతం పెరిగి మొత్తం రిటైల్ రుణాల విలువ రూ.185 లక్షల కోట్లకు చేరుకుంది. రిటైల్ ఫైనాన్స్‌లో హోమ్ లోన్లు (మార్గేజ్ లోన్లు) ఇప్పటికీ కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఇతర రకాల రుణాలు వేగంగా పెరుగుతుండటంతో మొత్తం రిటైల్ క్రెడిట్‌లో ఒక్కో రుణ విభాగం వాటాలో మార్పులు వస్తున్నాయి. గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్‌లో పర్సనల్ లోన్లు, క్రెడిట్ కార్డులు, కొలేటరల్ లేని బిజినెస్ లోన్లు, వ్యవసాయ రుణాలు, హోమ్ లోన్ల వృద్ధి వేగం తగ్గింది.మార్గేజ్ లోన్ల విభాగంలో వృద్ధి 10.4 శాతానికే పరిమితం కావడంతో మొత్తం రిటైల్ క్రెడిట్‌లో వాటా తగ్గింది. గత ఏడాదితో పోలిస్తే ఈ వాటా 1.9 శాతం పాయింట్లు తగ్గి 25.1 శాతానికి చేరింది. అదే సమయంలో గోల్డ్ లోన్ల వాటా గణనీయంగా పెరిగింది. మొత్తం రిటైల్ క్రెడిట్‌లో గోల్డ్ లోన్ల వాటా 3.3 శాతం పాయింట్లు పెరిగి 12.6 శాతానికి చేరింది. కొలేటరల్‌తో తీసుకునే బిజినెస్ లోన్ల వాటా కూడా 1.9 శాతం పాయింట్లు పెరిగి 10.6 శాతానికి చేరినట్లు క్రిఫ్ నివేదిక వెల్లడించింది. మొత్తంగా చూస్తే, దేశంలో రిటైల్ రుణాల మార్కెట్ వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, కొన్ని రకాల లోన్లలో బకాయిలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా గోల్డ్ లోన్లు, కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లు, ట్రాక్టర్ లోన్లలో రుణ చెల్లింపుల పరిస్థితిని బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు మరింత జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.మరింత చదవండి

Source link