పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు, ప్రైవేట్ లేదా సొంత అవసరాల కోసం ఏర్పాటు చేసే ఛార్జింగ్ స్టేషన్లు, కమర్షియల్ ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయాల ఏర్పాటుకు ఈ పథకం ద్వారా ఫైనాన్స్ అందుతుంది. ఈ పథకం ప్రారంభం సందర్భంగా బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లాల్ సింగ్ మాట్లాడుతూ.. “భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాలంటే ఛార్జింగ్ సదుపాయాలు అందరికీ అందుబాటులో ఉండాలి. అవి నమ్మకంగా పనిచేయాలి. వ్యాపారపరంగా కూడా నిలదొక్కుకునేలా ఉండాలి. పెద్ద సంఖ్యలో ఇలాంటి సదుపాయాలు అందుబాటులోకి రావాలి. ఈవీల వినియోగం పెరుగుతున్న కొద్దీ, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టే వ్యాపారాలు కీలక పాత్ర పోషిస్తాయి. నగరాలు, హైవేలు, ముఖ్యమైన వాణిజ్య ప్రాంతాల్లో ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి ఇవి సహాయపడతాయి. ఈ రంగంలో మారుతున్న ఆర్థిక అవసరాలను గుర్తించి, మంచి అవకాశాలున్న ఈవీ ఛార్జింగ్, బ్యాటరీ స్వాపింగ్ ప్రాజెక్టులకు తగిన రుణ సదుపాయాలు అందించేందుకు బాబ్ గ్రీన్ ప్లగ్ పథకాన్ని తీసుకొచ్చాం. సస్టైనబుల్ ఫైనాన్స్‌కు, భారత్ క్లీన్ మొబిలిటీ దిశగా సాగుతున్న ప్రయాణానికి బ్యాంక్ ఆఫ్ బరోడా కట్టుబడి ఉందని ఈ పథకం మరోసారి తెలియజేస్తోంది” అని చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం)

