Last Updated:
Cult Movie: విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన థ్రిల్లర్ ‘కల్ట్’ థియేటర్లలో విడుదలైన కేవలం 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేసింది. నేటి (నవంబర్ 19) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
Cult OTT Release: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తూ, స్వయంగా దర్శకత్వం వహించిన లేటెస్ట్ స్లాషర్ యాక్షన్ సర్వైవల్ థ్రిల్లర్ ‘కల్ట్’ ఎలాంటి ముందస్తు హడావుడి లేకుండా సడెన్‌గా డిజిటల్ తెరపైకి వచ్చేసింది. అక్టోబర్ 30న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. రిలీజైన కేవలం 20 రోజుల్లోనే ఓటీటీలోకి అడుగుపెట్టి సినీ ప్రియులకు సర్ప్రైజ్ ఇచ్చింది. నేటి (నవంబర్ 19) నుంచే ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అలరించడానికి మేకర్స్ ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి అందుబాటులోకి తీసుకొచ్చారు. థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకుని, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో నిలబడలేకపోయిన ‘కల్ట్’ ఇప్పుడు ఓటీటీ వేదికగా సత్తా చాటడానికి సిద్ధమైంది. ఇంట్లోనే కూర్చొని హారర్, సర్వైవల్ గేమ్స్, యాక్షన్ థ్రిల్లర్స్ చూడాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్‌గా నిలవనుంది.
గోవాలో ఓ హోంమంత్రి కుమారుడు ఎల్విన్ (తారక్ పొన్నప్ప) తన పుట్టినరోజు వేడుకల కోసం ‘కల్ట్’ అనే పబ్‌ను బుక్ చేసుకుంటాడు. ఈ వేడుకకు హైదరాబాద్ నుంచి ముగ్గురు యువకులతో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారు. మొదట్లో మ్యూజిక్, డ్యాన్స్‌లతో ఎంతో సరదాగా సాగిన పార్టీ.. ఒక్కసారిగా భయానక మృత్యు క్రీడగా మారుతుంది. పబ్‌లోని భారీ స్క్రీన్‌పై కనిపించే ఓ వింత బొమ్మ గేమ్స్ నిర్వహిస్తూ, ఓడిపోయిన వారిని కిరాతకంగా హతమారుస్తుంది. అసలు ఈ హత్యల వెనుక ఉన్నది ఎవరు? అక్కడ చిక్కుకున్న అమాయకులను కాపాడేందుకు డీఎస్పీ సంకల్ప్ నాయక్ (విశ్వక్ సేన్) ఎలాంటి సాహసాలు చేశాడు? అన్నదే ఈ సినిమా అసలు కథ.
సందీప్ కాకరాల, కరాటే రాజు నిర్మించిన ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన గాయత్రి భరద్వాజ్ హీరోయిన్గా నటించగా, తారక్ పొన్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో మెప్పించారు. ఈ సినిమాకు తరుణ్ భాస్కర్ పదునైన సంభాషణలు అందించగా, ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. మొత్తానికి థియేటర్లలో మిస్ అయిన విశ్వక్ సేన్ ‘కల్ట్’ యాక్షన్ హంగామాను ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంచక్కా చూసేయొచ్చు!

