గాంధారిలో యువతి దారుణ హత్య.. ఘటనాస్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ
గాంధారి , ప్రభ న్యూస్ :
కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో యువతి హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. అంగడి బజార్ సమీపంలోని సెల్ టవర్ వద్ద ఆర్.సి. కౌర్ అనే యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనాస్థలానికి చేరుకున్నారు.హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఆర్.సి. కౌర్.. తన పెళ్లి పత్రికలు పంచేందుకు అమ్మమ్మ ఊరైన గాంధారికి వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆమె హత్యకు గురికావడం స్థానికంగా ఆందోళన కలిగించింది.సమాచారం అందుకున్న ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ ఘటనాస్థలాన్ని పరిశీలించి, హత్యకు సంబంధించిన వివరాలను పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు పురోగతిని సమీక్షించారు. యువతి హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉండగా, పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

