Nighttime Calf Cramps: రాత్రిపూట హాయిగా నిద్రపోతున్న సమయంలో ఉన్నట్లుండి కాలి పిక్కలు గట్టిగా పట్టేయడం, భరించలేని నొప్పితో ఉలిక్కిపడి నిద్రలేవడం చాలామందిని వేధించే సమస్య అని 16 ఏళ్లకు పైగా విశేష అనుభవం ఉన్న ప్రముఖ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణులు డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి వివరిస్తున్నారు. వైద్య పరిభాషలో దీనిని కండరాల సంకోచం (నాక్టర్నల్ లెగ్ క్రాంప్స్) అని పిలుస్తారని స్పష్టం చేస్తున్నారు. సాధారణంగా పగటిపూట ఎక్కువగా నడిచినప్పుడు లేదా అలసిపోయినప్పుడు ఇలా జరుగుతుందని చాలామంది తేలికగా తీసుకుంటారని తెలుపుతున్నారు. కానీ తరచూ రాత్రివేళల్లో పిక్కలు పట్టేయడం వెనుక శరీరంలో ఎలక్ట్రోలైట్స్ లోపం, నీటి శాతం తగ్గడం లేదా రక్తప్రసరణ సమస్యలు దాగి ఉండవచ్చని పేర్కొంటున్నారు. రాత్రిపూట కాలి పిక్కలు పట్టేయడానికి గల ప్రధాన కారణాలు, తక్షణ ఉపశమన మార్గాల పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

