ప్రభన్యూస్

WhatsApp: వాట్సాప్ వాడుతున్నారా? కేంద్రం సంచలన హెచ్చరిక.. ఈ తప్పులు చేస్తే మీ ఖాతా హ్యాకర్ల చేతుల్లోకే! |


Last Updated:

వాట్సాప్ వెబ్ ఉపయోగిస్తున్నారా? అయితే ఒక్కసారి ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. మీకు తెలియకుండానే మీ వాట్సాప్ ఖాతాలోకి ఇతరులు ప్రవేశించి సందేశాలు చదవడం, మీ పేరుతో మెసేజ్‌లు పంపడం వంటి పనులు చేసే ప్రమాదం ఉందని కేంద్రం హెచ్చరించింది.

News18
News18

వాట్సాప్ ఉపయోగించే వారికి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) కీలక హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్ (WhatsApp Web) వినియోగించే వారు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. లాగిన్ అయి ఉన్న వాట్సాప్ వెబ్ సెషన్లను కొందరు దుర్వినియోగం చేసి ఇతరుల ఖాతాల్లోకి అనధికారికంగా ప్రవేశించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. తద్వారా వ్యక్తిగత సందేశాలు, కాంటాక్టులు, గ్రూప్ చాట్లను ఇతరులు చూసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో వినియోగదారులు పాటించాల్సిన పలు జాగ్రత్తలను వెల్లడించింది.

వాట్సాప్ వెబ్‌తో అసలు ప్రమాదం ఏంటి?

నవంబర్ 18, 2026న హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) ఈ మేరకు అడ్వైజరీ విడుదల చేసింది. నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ (NCTAU) గుర్తించిన అంశాల ఆధారంగా ఈ హెచ్చరిక జారీ చేసినట్లు తెలిపింది. ముఖ్యంగా ఇప్పటికే లాగిన్ అయి ఉన్న వాట్సాప్ వెబ్ సెషన్లను దుర్వినియోగం చేసి ఖాతాలను ఇతరులు తమ ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఉందని పేర్కొంది.

ఇలాంటి ఘటనలు జరిగితే బాధితుల వ్యక్తిగత సందేశాలను చదవడం, వారి పేరుతో ఇతరులకు మెసేజ్‌లు పంపడం, కాంటాక్టులు, గ్రూప్ సంభాషణలను పరిశీలించడం సాధ్యమవుతుంది. అంతేకాకుండా బాధితుల గుర్తింపును ఉపయోగించి ఆర్థిక మోసాలు, ఫిషింగ్, సోషల్ ఇంజినీరింగ్ వంటి సైబర్ నేరాలకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

ఈ ఏడు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి

వాట్సాప్ వెబ్ ఉపయోగించేటప్పుడు ముఖ్యంగా ఆఫీసు, ఇతరులతో పంచుకునే కంప్యూటర్ల విషయంలో జాగ్రత్త అవసరమని I4C సూచించింది. ప్రభుత్వ, సంస్థాగత, ఆర్థిక, రహస్య సమాచారాన్ని వాట్సాప్ వెబ్ ద్వారా పంపకూడదని తెలిపింది. అవసరం లేనప్పుడు కంప్యూటర్లలో ఖాతాను లాగిన్ చేసి ఉంచకూడదు. పని పూర్తయిన వెంటనే తప్పనిసరిగా మాన్యువల్‌గా లాగౌట్ చేయాలి. కేవలం బ్రౌజర్ ట్యాబ్ లేదా విండో మూసివేస్తే లాగౌట్ అయినట్లు కాదని స్పష్టం చేసింది.

తప్పనిసరిగా వేరే కంప్యూటర్‌లో వాట్సాప్ వెబ్ ఉపయోగించాల్సి వస్తే నమ్మకమైన పరికరాన్ని ఎంచుకుని ఇన్‌కాగ్నిటో లేదా ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్‌ను ఉపయోగించాలని సూచించింది. బ్రౌజర్ మూసే ముందు లాగౌట్ చేయడం మర్చిపోవద్దని తెలిపింది. సైబర్ కేఫ్‌లు, హోటల్ బిజినెస్ సెంటర్లు, పబ్లిక్ కియోస్క్‌లు, ఇతరుల కంప్యూటర్లలో లాగిన్ అవ్వకూడదని హెచ్చరించింది.

అనుమానాస్పద సందేశాలు వస్తే అప్రమత్తం

మీకు తెలియకుండానే మీ ఖాతా నుంచి సందేశాలు వెళ్తున్నా, కాంటాక్టుల నుంచి వింత సమాధానాలు వస్తున్నా వెంటనే అప్రమత్తం కావాలి. కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్, బ్రౌజర్, సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి. తెలియని ఫైళ్లు, అనుమానాస్పద డౌన్‌లోడ్‌లు, క్రాక్డ్ సాఫ్ట్‌వేర్‌కు దూరంగా ఉండాలి.

అధికారిక, అత్యంత సున్నితమైన సమాచారంతో పనిచేసే సంస్థలు వాట్సాప్ వెబ్ వినియోగాన్ని పూర్తిగా నివారించాలని అడ్వైజరీ సూచించింది. ఆఫీసుల్లో తప్పనిసరిగా ఉపయోగించాల్సి వస్తే ప్రైవేట్ బ్రౌజింగ్‌ను అదనపు జాగ్రత్తగా మాత్రమే పరిగణించాలని పేర్కొంది. ప్రతి సెషన్ తర్వాత లాగౌట్ చేసి డిజిటల్ గుర్తింపును కాపాడుకోవాలని స్పష్టం చేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 23 November 2026, 6:25 pm Digital Edition : Prabhanews
WhatsApp: వాట్సాప్ వాడుతున్నారా? కేంద్రం సంచలన హెచ్చరిక.. ఈ తప్పులు చేస్తే మీ ఖాతా హ్యాకర్ల చేతుల్లోకే! |

Last Updated:Nov 23, 2026 5:57 PM IST వాట్సాప్ వెబ్ ఉపయోగిస్తున్నారా? అయితే ఒక్కసారి ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. మీకు తెలియకుండానే మీ వాట్సాప్ ఖాతాలోకి ఇతరులు ప్రవేశించి సందేశాలు చదవడం, మీ పేరుతో మెసేజ్‌లు పంపడం వంటి పనులు చేసే ప్రమాదం ఉందని కేంద్రం హెచ్చరించింది.News18వాట్సాప్ ఉపయోగించే వారికి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) కీలక హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్ (WhatsApp Web) వినియోగించే వారు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. లాగిన్ అయి ఉన్న వాట్సాప్ వెబ్ సెషన్లను కొందరు దుర్వినియోగం చేసి ఇతరుల ఖాతాల్లోకి అనధికారికంగా ప్రవేశించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. తద్వారా వ్యక్తిగత సందేశాలు, కాంటాక్టులు, గ్రూప్ చాట్లను ఇతరులు చూసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో వినియోగదారులు పాటించాల్సిన పలు జాగ్రత్తలను వెల్లడించింది.వాట్సాప్ వెబ్‌తో అసలు ప్రమాదం ఏంటి?నవంబర్ 18, 2026న హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) ఈ మేరకు అడ్వైజరీ విడుదల చేసింది. నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ (NCTAU) గుర్తించిన అంశాల ఆధారంగా ఈ హెచ్చరిక జారీ చేసినట్లు తెలిపింది. ముఖ్యంగా ఇప్పటికే లాగిన్ అయి ఉన్న వాట్సాప్ వెబ్ సెషన్లను దుర్వినియోగం చేసి ఖాతాలను ఇతరులు తమ ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఉందని పేర్కొంది.ఇలాంటి ఘటనలు జరిగితే బాధితుల వ్యక్తిగత సందేశాలను చదవడం, వారి పేరుతో ఇతరులకు మెసేజ్‌లు పంపడం, కాంటాక్టులు, గ్రూప్ సంభాషణలను పరిశీలించడం సాధ్యమవుతుంది. అంతేకాకుండా బాధితుల గుర్తింపును ఉపయోగించి ఆర్థిక మోసాలు, ఫిషింగ్, సోషల్ ఇంజినీరింగ్ వంటి సైబర్ నేరాలకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.ఈ ఏడు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండివాట్సాప్ వెబ్ ఉపయోగించేటప్పుడు ముఖ్యంగా ఆఫీసు, ఇతరులతో పంచుకునే కంప్యూటర్ల విషయంలో జాగ్రత్త అవసరమని I4C సూచించింది. ప్రభుత్వ, సంస్థాగత, ఆర్థిక, రహస్య సమాచారాన్ని వాట్సాప్ వెబ్ ద్వారా పంపకూడదని తెలిపింది. అవసరం లేనప్పుడు కంప్యూటర్లలో ఖాతాను లాగిన్ చేసి ఉంచకూడదు. పని పూర్తయిన వెంటనే తప్పనిసరిగా మాన్యువల్‌గా లాగౌట్ చేయాలి. కేవలం బ్రౌజర్ ట్యాబ్ లేదా విండో మూసివేస్తే లాగౌట్ అయినట్లు కాదని స్పష్టం చేసింది.తప్పనిసరిగా వేరే కంప్యూటర్‌లో వాట్సాప్ వెబ్ ఉపయోగించాల్సి వస్తే నమ్మకమైన పరికరాన్ని ఎంచుకుని ఇన్‌కాగ్నిటో లేదా ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్‌ను ఉపయోగించాలని సూచించింది. బ్రౌజర్ మూసే ముందు లాగౌట్ చేయడం మర్చిపోవద్దని తెలిపింది. సైబర్ కేఫ్‌లు, హోటల్ బిజినెస్ సెంటర్లు, పబ్లిక్ కియోస్క్‌లు, ఇతరుల కంప్యూటర్లలో లాగిన్ అవ్వకూడదని హెచ్చరించింది.అనుమానాస్పద సందేశాలు వస్తే అప్రమత్తంమీకు తెలియకుండానే మీ ఖాతా నుంచి సందేశాలు వెళ్తున్నా, కాంటాక్టుల నుంచి వింత సమాధానాలు వస్తున్నా వెంటనే అప్రమత్తం కావాలి. కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్, బ్రౌజర్, సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి. తెలియని ఫైళ్లు, అనుమానాస్పద డౌన్‌లోడ్‌లు, క్రాక్డ్ సాఫ్ట్‌వేర్‌కు దూరంగా ఉండాలి.అధికారిక, అత్యంత సున్నితమైన సమాచారంతో పనిచేసే సంస్థలు వాట్సాప్ వెబ్ వినియోగాన్ని పూర్తిగా నివారించాలని అడ్వైజరీ సూచించింది. ఆఫీసుల్లో తప్పనిసరిగా ఉపయోగించాల్సి వస్తే ప్రైవేట్ బ్రౌజింగ్‌ను అదనపు జాగ్రత్తగా మాత్రమే పరిగణించాలని పేర్కొంది. ప్రతి సెషన్ తర్వాత లాగౌట్ చేసి డిజిటల్ గుర్తింపును కాపాడుకోవాలని స్పష్టం చేసింది.మరింత చదవండి

Source link