అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపనున్నాయి. గోల్డ్మన్ అంచనాల ప్రకారం.. 2026 డిసెంబర్, 2027 మార్చిలో ఫెడ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల చొప్పున పెంచవచ్చు. ఆ తర్వాత వడ్డీ రేట్ల తగ్గింపు ప్రారంభమైతే పాశ్చాత్య దేశాల నుంచి బంగారంపై పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. ఇదే జరిగితే 2028 చివరి నాటికి ఔన్స్ బంగారం ధర 5,600 డాలర్ల స్థాయికి చేరవచ్చని అంచనా వేస్తోంది. ఇండియన్ కరెన్సీ ప్రకారం బంగారం ధర రూ.1.67లక్షలకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. అయితే ఈ ధరలు ఖచ్చితంగా నమోదవుతాయని చెప్పలేం. అమెరికా వడ్డీ రేట్లు, డాలర్ విలువ, భౌగోళిక రాజకీయ పరిణామాలు, గోల్డ్ ETFలలో పెట్టుబడుల ప్రవాహాలు బంగారం ధరలను ప్రభావితం చేయవచ్చు. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు దీర్ఘకాలంలో మద్దతు ఇచ్చినా, స్వల్పకాలంలో ధరలు తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. అందువల్ల బంగారం, వెండిలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు కేవలం ఈ అంచనాల ఆధారంగా నిర్ణయం తీసుకోకూడదు. తమ ఆర్థిక పరిస్థితి, పెట్టుబడి లక్ష్యాలు, రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని బట్టి ప్రణాళిక రూపొందించుకోవాలి. అవసరమైతే అర్హత కలిగిన ఆర్థిక సలహాదారుని సంప్రదించడం మంచిది.(ప్రతీకాత్మక చిత్రం)

