ప్రభన్యూస్

PM Modi: అంతర్జాతీయ స్థాయిలో మోదీ మార్క్.. మూడు స్థానాలు ఎగబాకి అరుదైన రికార్డు! |


Last Updated:

PM Modi: అంతర్జాతీయ రాజకీయ, వ్యూహాత్మక వేదికపై భారతదేశ ప్రాబల్యం, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వ పటిమ మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి.

pic credit: x
pic credit: x

ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ మేధో సంస్థ ‘లోవీ ఇన్‌స్టిట్యూట్’ (Lowy Institute) విడుదల చేసిన ‘ఆసియా పవర్ ఇండెక్స్-2026’ (Asia Power Index 2026) నివేదికలో ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ప్రభావవంతమైన ప్రాంతీయ నేతల జాబితాలో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఆయన మూడు స్థానాలు పైకి ఎగబాకి, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తర్వాత ఆసియాలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా నిలిచారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని 27 దేశాల శక్తి సామర్థ్యాలను 131 సూచికల ఆధారంగా మదింపు చేసి ఈ నివేదికను రూపొందించారు. ఇందులో భారత్ 40.5 పాయింట్ల స్కోరుతో ఆసియా ఖండంలోనే మూడో అత్యంత శక్తివంతమైన దేశంగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. 100 పాయింట్లకు గాను అమెరికా 78.9 స్కోరుతో మొదటి స్థానంలో, చైనా 73.6 స్కోరుతో రెండో స్థానంలో ‘సూపర్ పవర్’ దేశాలుగా నిలిచాయి. భారత్ తర్వాత జపాన్ (38.6 పాయింట్లు), రష్యా, ఆస్ట్రేలియా దేశాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్న తరుణంలో ప్రధాని మోదీ అందిస్తున్న స్థిరమైన నాయకత్వం, విదేశాంగ విధానంలో కొనసాగింపు (continuity) ఆయన ర్యాంకింగ్ మెరుగుపడటానికి ప్రధాన కారణాలని లోవీ ఇన్‌స్టిట్యూట్ విశ్లేషకులు పేర్కొన్నారు. ముఖ్యంగా చైనాతో పోలిస్తే భారత్‌కు ఉన్న శక్తి వ్యత్యాసం 33.1 పాయింట్లకు తగ్గింది. 2018లో ఈ సూచీ ప్రారంభమైనప్పటి నుండి ఇరు దేశాల మధ్య ఇంత తక్కువ అంతరం నమోదు కావడం ఇదే తొలిసారి.

రక్షణ, దౌత్య రంగాల్లో దూకుడు

2026 నివేదిక ప్రకారం, భారత్ పలు కీలక విభాగాల్లో గణనీయమైన ప్రగతి సాధించింది:

దౌత్య ప్రభావం: 70.3 పాయింట్లతో దౌత్య రంగంలో భారత్ తన పట్టును మరింత బలోపేతం చేసుకుంది.

రక్షణ సంబంధాలు: ఆగ్నేయాసియా దేశాలతో రక్షణ సహకారం పెరగడం, ముఖ్యంగా బ్రహ్మోస్ క్షిపణుల విక్రయాల వంటి చర్యల వల్ల భారత్ రక్షణ నెట్‌వర్క్ స్కోరు 18.6 పాయింట్లకు చేరి రెండు స్థానాలు ఎగబాకి 9వ స్థానానికి చేరుకుంది.

సాంస్కృతిక ప్రభావం: సాంస్కృతిక వ్యాప్తి, సమాచార ప్రవాహం మరియు ప్రజల మధ్య సంబంధాలు మెరుగుపడటంతో భారత్ సాంస్కృతిక ప్రభావ స్కోరు 43.8 పాయింట్లకు పెరిగింది.

భవిష్యత్ వనరులు: ఆర్థిక వృద్ధి అంచనాలు ఆశాజనకంగా ఉండటంతో భవిష్యత్ వనరుల విభాగంలో భారత్ 56.2 పాయింట్లు సాధించింది.

రాజకీయ వర్గాల్లో చర్చ

లోవీ ఇన్‌స్టిట్యూట్ గణాంకాలు వెలువడిన వెంటనే దేశ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. 12 ఏళ్ల క్రితం అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో ఎంతో వెనుకబడి ఉన్న భారత్, నేడు ప్రధాని మోదీ బలమైన నాయకత్వంలో ప్రపంచంలోని టాప్-3, టాప్-5 దేశాల సరసన నిలిచిందని కొనియాడారు. భారత ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉందంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలకు ఈ అంతర్జాతీయ నివేదిక గట్టి సమాధానమని భాజపా నేతలు పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు భారత్ ఎదుగుదలను గుర్తిస్తున్నాయని, విపక్ష నేతలు ఈ నివేదికను తప్పక చదవాలని వారు సూచించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 November 2026, 5:24 am Digital Edition : Prabhanews
PM Modi: అంతర్జాతీయ స్థాయిలో మోదీ మార్క్.. మూడు స్థానాలు ఎగబాకి అరుదైన రికార్డు! |

Last Updated:Nov 24, 2026 5:24 AM ISTPM Modi: అంతర్జాతీయ రాజకీయ, వ్యూహాత్మక వేదికపై భారతదేశ ప్రాబల్యం, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వ పటిమ మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి.pic credit: xఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ మేధో సంస్థ 'లోవీ ఇన్‌స్టిట్యూట్' (Lowy Institute) విడుదల చేసిన 'ఆసియా పవర్ ఇండెక్స్-2026' (Asia Power Index 2026) నివేదికలో ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ప్రభావవంతమైన ప్రాంతీయ నేతల జాబితాలో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఆయన మూడు స్థానాలు పైకి ఎగబాకి, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తర్వాత ఆసియాలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా నిలిచారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని 27 దేశాల శక్తి సామర్థ్యాలను 131 సూచికల ఆధారంగా మదింపు చేసి ఈ నివేదికను రూపొందించారు. ఇందులో భారత్ 40.5 పాయింట్ల స్కోరుతో ఆసియా ఖండంలోనే మూడో అత్యంత శక్తివంతమైన దేశంగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. 100 పాయింట్లకు గాను అమెరికా 78.9 స్కోరుతో మొదటి స్థానంలో, చైనా 73.6 స్కోరుతో రెండో స్థానంలో 'సూపర్ పవర్' దేశాలుగా నిలిచాయి. భారత్ తర్వాత జపాన్ (38.6 పాయింట్లు), రష్యా, ఆస్ట్రేలియా దేశాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్న తరుణంలో ప్రధాని మోదీ అందిస్తున్న స్థిరమైన నాయకత్వం, విదేశాంగ విధానంలో కొనసాగింపు (continuity) ఆయన ర్యాంకింగ్ మెరుగుపడటానికి ప్రధాన కారణాలని లోవీ ఇన్‌స్టిట్యూట్ విశ్లేషకులు పేర్కొన్నారు. ముఖ్యంగా చైనాతో పోలిస్తే భారత్‌కు ఉన్న శక్తి వ్యత్యాసం 33.1 పాయింట్లకు తగ్గింది. 2018లో ఈ సూచీ ప్రారంభమైనప్పటి నుండి ఇరు దేశాల మధ్య ఇంత తక్కువ అంతరం నమోదు కావడం ఇదే తొలిసారి.రక్షణ, దౌత్య రంగాల్లో దూకుడు2026 నివేదిక ప్రకారం, భారత్ పలు కీలక విభాగాల్లో గణనీయమైన ప్రగతి సాధించింది:దౌత్య ప్రభావం: 70.3 పాయింట్లతో దౌత్య రంగంలో భారత్ తన పట్టును మరింత బలోపేతం చేసుకుంది.రక్షణ సంబంధాలు: ఆగ్నేయాసియా దేశాలతో రక్షణ సహకారం పెరగడం, ముఖ్యంగా బ్రహ్మోస్ క్షిపణుల విక్రయాల వంటి చర్యల వల్ల భారత్ రక్షణ నెట్‌వర్క్ స్కోరు 18.6 పాయింట్లకు చేరి రెండు స్థానాలు ఎగబాకి 9వ స్థానానికి చేరుకుంది.సాంస్కృతిక ప్రభావం: సాంస్కృతిక వ్యాప్తి, సమాచార ప్రవాహం మరియు ప్రజల మధ్య సంబంధాలు మెరుగుపడటంతో భారత్ సాంస్కృతిక ప్రభావ స్కోరు 43.8 పాయింట్లకు పెరిగింది.భవిష్యత్ వనరులు: ఆర్థిక వృద్ధి అంచనాలు ఆశాజనకంగా ఉండటంతో భవిష్యత్ వనరుల విభాగంలో భారత్ 56.2 పాయింట్లు సాధించింది.రాజకీయ వర్గాల్లో చర్చలోవీ ఇన్‌స్టిట్యూట్ గణాంకాలు వెలువడిన వెంటనే దేశ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. 12 ఏళ్ల క్రితం అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో ఎంతో వెనుకబడి ఉన్న భారత్, నేడు ప్రధాని మోదీ బలమైన నాయకత్వంలో ప్రపంచంలోని టాప్-3, టాప్-5 దేశాల సరసన నిలిచిందని కొనియాడారు. భారత ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉందంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలకు ఈ అంతర్జాతీయ నివేదిక గట్టి సమాధానమని భాజపా నేతలు పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు భారత్ ఎదుగుదలను గుర్తిస్తున్నాయని, విపక్ష నేతలు ఈ నివేదికను తప్పక చదవాలని వారు సూచించారు.మరింత చదవండి

Source link