ప్రభన్యూస్

Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి కోర్టు షాక్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ! కేజ్రీవాల్‌కు లింక్ ఏంటి? |


Last Updated:

ఓ వీడియో.. ఓ రీట్వీట్.. ఏకంగా ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న పరువునష్టం కేసు! ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి ఢిల్లీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ వివాదంలో అప్పటి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరు కూడా ఎందుకు వచ్చింది? గతంలో కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇచ్చింది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

News18
News18

యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి ఢిల్లీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం నమోదైన పరువునష్టం కేసులో ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ అయింది. భారతీయ జనతా పార్టీ (BJP) ఐటీ సెల్ తనకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించిందంటూ ఓ వ్యక్తి చేసిన ఆరోపణలకు సంబంధించిన వీడియోను ధ్రువ్ రాఠీ ప్రచురించడమే ఈ వివాదానికి కారణం. ఈ కేసులో గతంలో పలుమార్లు బెయిలబుల్ వారెంట్లు జారీ చేసినప్పటికీ, తాజాగా కోర్టు కఠిన నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఈ కేసులో ఏం జరిగింది? అరవింద్ కేజ్రీవాల్‌కు దీనితో ఉన్న సంబంధం ఏమిటి?

2018 వీడియోతో మొదలైన వివాదం

ఈ కేసు 2018 మే నెలలో ధ్రువ్ రాఠీ తన యూట్యూబ్ ఛానల్‌లో ప్రచురించిన ఓ వీడియోతో మొదలైంది. బీజేపీ ఐటీ సెల్ తనకు డబ్బులు ఇచ్చి లంచం ఇవ్వడానికి ప్రయత్నించిందని వికాస్ సంకృత్యాయన్ అలియాస్ వికాస్ పాండే చేసిన ఆరోపణలను ప్రస్తావిస్తూ రాఠీ వీడియో రూపొందించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వీడియోను ఆయన తన సామాజిక మాధ్యమ ఖాతాలోనూ పంచుకున్నారు. అప్పట్లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆ వీడియోను రీట్వీట్ చేశారు. దీంతో తన పరువుకు భంగం కలిగిందని ఆరోపిస్తూ వికాస్ పాండే, ధ్రువ్ రాఠీతో పాటు కేజ్రీవాల్‌పైనా పరువునష్టం కేసు దాఖలు చేశారు.

గతంలో పలుమార్లు బెయిలబుల్ వారెంట్లు

ఈ కేసును విచారిస్తున్న జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ అనమ్ రైస్ ఖాన్ సోమవారం ధ్రువ్ రాఠీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. గతంలో అక్టోబర్ 17న, ఆ తర్వాత అక్టోబర్ 31న కూడా కోర్టు బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. నోటీసులు అందించేందుకు వెళ్లిన ప్రాసెస్ సర్వర్‌కు రాఠీ నివాసం తాళం వేసి ఉండటంతో సమన్లు అందించలేకపోయినట్లు కోర్టుకు సమాచారం అందింది. దీంతో గురుగ్రామ్‌లోని ఆయన చిరునామాకు కొత్తగా సమన్లు పంపాలని న్యాయస్థానం ఆదేశించింది.

ఆస్ట్రియాలో నివాసం ఉంటున్నారన్న న్యాయవాది

విచారణ సందర్భంగా రాఠీ సాధారణంగా ఆస్ట్రియాలో నివసిస్తారని, ఢిల్లీలో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనల్లో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 2019 జూలైలోనే రాఠీకి తొలిసారిగా సమన్లు జారీ చేసినట్లు కోర్టు గుర్తించింది.

మరోవైపు, సమన్లు ఏళ్ల తరబడి అందకపోవడంతో త్వరగా విచారణ చేపట్టాలని ఫిర్యాదుదారుడి తరఫు న్యాయవాది సమక్ష్ శర్మ కోరారు. అక్టోబర్ 12న ముందస్తు విచారణతో పాటు దస్తీ సమన్లు (నేరుగా చేతికి అందించే నోటీసులు) జారీ చేయాలన్న అభ్యర్థనకు కోర్టు అనుమతించింది. ఈ కేసు తదుపరి విచారణ డిసెంబర్ 3న జరగనుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 23 November 2026, 4:20 pm Digital Edition : Prabhanews
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి కోర్టు షాక్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ! కేజ్రీవాల్‌కు లింక్ ఏంటి? |

Last Updated:Nov 23, 2026 3:22 PM ISTఓ వీడియో.. ఓ రీట్వీట్.. ఏకంగా ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న పరువునష్టం కేసు! ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి ఢిల్లీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ వివాదంలో అప్పటి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరు కూడా ఎందుకు వచ్చింది? గతంలో కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇచ్చింది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
News18యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి ఢిల్లీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం నమోదైన పరువునష్టం కేసులో ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ అయింది. భారతీయ జనతా పార్టీ (BJP) ఐటీ సెల్ తనకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించిందంటూ ఓ వ్యక్తి చేసిన ఆరోపణలకు సంబంధించిన వీడియోను ధ్రువ్ రాఠీ ప్రచురించడమే ఈ వివాదానికి కారణం. ఈ కేసులో గతంలో పలుమార్లు బెయిలబుల్ వారెంట్లు జారీ చేసినప్పటికీ, తాజాగా కోర్టు కఠిన నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఈ కేసులో ఏం జరిగింది? అరవింద్ కేజ్రీవాల్‌కు దీనితో ఉన్న సంబంధం ఏమిటి?2018 వీడియోతో మొదలైన వివాదంఈ కేసు 2018 మే నెలలో ధ్రువ్ రాఠీ తన యూట్యూబ్ ఛానల్‌లో ప్రచురించిన ఓ వీడియోతో మొదలైంది. బీజేపీ ఐటీ సెల్ తనకు డబ్బులు ఇచ్చి లంచం ఇవ్వడానికి ప్రయత్నించిందని వికాస్ సంకృత్యాయన్ అలియాస్ వికాస్ పాండే చేసిన ఆరోపణలను ప్రస్తావిస్తూ రాఠీ వీడియో రూపొందించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వీడియోను ఆయన తన సామాజిక మాధ్యమ ఖాతాలోనూ పంచుకున్నారు. అప్పట్లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆ వీడియోను రీట్వీట్ చేశారు. దీంతో తన పరువుకు భంగం కలిగిందని ఆరోపిస్తూ వికాస్ పాండే, ధ్రువ్ రాఠీతో పాటు కేజ్రీవాల్‌పైనా పరువునష్టం కేసు దాఖలు చేశారు.గతంలో పలుమార్లు బెయిలబుల్ వారెంట్లుఈ కేసును విచారిస్తున్న జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ అనమ్ రైస్ ఖాన్ సోమవారం ధ్రువ్ రాఠీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. గతంలో అక్టోబర్ 17న, ఆ తర్వాత అక్టోబర్ 31న కూడా కోర్టు బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. నోటీసులు అందించేందుకు వెళ్లిన ప్రాసెస్ సర్వర్‌కు రాఠీ నివాసం తాళం వేసి ఉండటంతో సమన్లు అందించలేకపోయినట్లు కోర్టుకు సమాచారం అందింది. దీంతో గురుగ్రామ్‌లోని ఆయన చిరునామాకు కొత్తగా సమన్లు పంపాలని న్యాయస్థానం ఆదేశించింది.ఆస్ట్రియాలో నివాసం ఉంటున్నారన్న న్యాయవాదివిచారణ సందర్భంగా రాఠీ సాధారణంగా ఆస్ట్రియాలో నివసిస్తారని, ఢిల్లీలో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనల్లో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 2019 జూలైలోనే రాఠీకి తొలిసారిగా సమన్లు జారీ చేసినట్లు కోర్టు గుర్తించింది.మరోవైపు, సమన్లు ఏళ్ల తరబడి అందకపోవడంతో త్వరగా విచారణ చేపట్టాలని ఫిర్యాదుదారుడి తరఫు న్యాయవాది సమక్ష్ శర్మ కోరారు. అక్టోబర్ 12న ముందస్తు విచారణతో పాటు దస్తీ సమన్లు (నేరుగా చేతికి అందించే నోటీసులు) జారీ చేయాలన్న అభ్యర్థనకు కోర్టు అనుమతించింది. ఈ కేసు తదుపరి విచారణ డిసెంబర్ 3న జరగనుంది.మరింత చదవండి

Source link