ఈ మధ్య కాలంలో విపరీతంగా బరువు పెరిగిపోవడం చాలామందికి పెను సవాలుగా మారింది. బరువు తగ్గించుకోవడానికి ఎంతోమంది జిమ్‌లలో గంటల తరబడి చెమటోడుస్తున్నారు, వాకింగ్, రన్నింగ్ చేస్తున్నారు, ఇంటర్నెట్‌లో కనిపించే రకరకాల డైట్‌లు ఫాలో అవుతున్నారు. అయినప్పటికీ చాలామందికి ఆశించిన ఫలితాలు దక్కడం లేదు. అయితే ఎలాంటి ఖరీదైన డైట్ జోలికి వెళ్లకుండా, ఇంటి పనులను చక్కబెట్టుకుంటూనే ఒక సాధారణ గృహిణి సాధించిన విజయం ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన వర్క్-ఫ్రమ్-హోమ్ మదర్ దీప్తి హర్షానా కేవలం 11 నెలల వ్యవధిలోనే ఏకంగా 32 కిలోల బరువు తగ్గి సరికొత్త రికార్డు సృష్టించారు.

