ఇక అరటిపండ్లు బాగా పండిపోయాయని పారేయాల్సిన అవసరం లేదు. వాటితో షేక్స్, స్మూతీలు, పాన్‌కేక్స్ తయారు చేసుకోవచ్చు. తొక్క తీసి చిన్న ముక్కలుగా కోసి గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రీజర్‌లో నిల్వ చేసుకుంటే తర్వాత కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే దుర్వాసన వస్తున్నా, బూజు కనిపిస్తున్నా అలాంటి పండ్లను తినకూడదు. మొత్తంగా అరటిపండ్లను సరైన ప్రదేశంలో నిల్వ చేయడం, పండిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టడం వంటి చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఆహారం వృథా కాకుండా చూసుకోవచ్చని ఆయన తెలిపారు. (గమనిక: ఈ కథనం నిపుణులు అందించిన సాధారణ సమాచారం ఆధారంగా రాసినది. దీనిని లోకల్ 18తెలుగు ధృవీకరించడం లేదు.)

