ప్రభన్యూస్

Weather Forecast: ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్.. 3 రోజుల పాటు వర్షాలు.. ఎక్కడెక్కడ వర్షాలు పడతాయంటే..? | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

ఆంధ్రప్రదేశ్‌లో మరో 3 రోజులు వర్షాలు, ఈదురుగాలులు. విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరిక. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలి.

+

News18

News18

ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు వాతావరణం చురుగ్గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రజలు, ముఖ్యంగా రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అల్పపీడనం ప్రభావంతో పాటు పలు వాతావరణ వ్యవస్థలు చురుకుగా ఉండటంతో ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయని విశాఖ వాతావరణ శాఖ డైరెక్టర్ పి. లక్ష్మీ నరసింహ మూర్తి తెలిపారు.

ప్రస్తుతం ఉత్తర ఒడిశా, దానికి ఆనుకుని ఉన్న జార్ఖండ్, గంగాపరీవాహక ప్రాంతంలోని పశ్చిమ బెంగాల్‌పై అల్పపీడన ప్రాంతం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండగా, ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉందని అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం రాబోయే 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉన్నప్పటికీ, దాని ప్రభావం దక్షిణ భారత వాతావరణంపై కొనసాగుతుందని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, రుతుపవన ద్రోణి అమృత్‌సర్ నుంచి పశ్చిమ బెంగాల్ మీదుగా ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉండటంతో పాటు, నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర లక్షద్వీప్ వరకు మరో ద్రోణి కొనసాగుతోంది. అలాగే ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. ఈ వాతావరణ పరిస్థితులన్నీ కలిసి రాష్ట్రంలో మేఘావృత వాతావరణంతో పాటు వర్షాలకు అనుకూల పరిస్థితులను సృష్టిస్తున్నాయి.

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం జూలై 18, 19 తేదీల్లో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడా ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం కూడా ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ రెండు రోజుల పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే వేడి, తేమ అధికంగా ఉండటంతో అసౌకర్యకరమైన వాతావరణ పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశముందని పేర్కొన్నారు.

జూలై 20న కూడా రాష్ట్రంలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముండటంతో రైతులు వ్యవసాయ పనుల్లో, ప్రజలు ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తాజా వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అధికారిక హెచ్చరికలను పాటించాలని వాతావరణ శాఖ విజ్ఞప్తి చేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 July 2026, 8:37 am Digital Edition : Prabhanews
Weather Forecast: ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్.. 3 రోజుల పాటు వర్షాలు.. ఎక్కడెక్కడ వర్షాలు పడతాయంటే..? | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Jul 18, 2026 8:24 AM ISTఆంధ్రప్రదేశ్‌లో మరో 3 రోజులు వర్షాలు, ఈదురుగాలులు. విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరిక. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలి.+
News18ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు వాతావరణం చురుగ్గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రజలు, ముఖ్యంగా రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అల్పపీడనం ప్రభావంతో పాటు పలు వాతావరణ వ్యవస్థలు చురుకుగా ఉండటంతో ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయని విశాఖ వాతావరణ శాఖ డైరెక్టర్ పి. లక్ష్మీ నరసింహ మూర్తి తెలిపారు.ప్రస్తుతం ఉత్తర ఒడిశా, దానికి ఆనుకుని ఉన్న జార్ఖండ్, గంగాపరీవాహక ప్రాంతంలోని పశ్చిమ బెంగాల్‌పై అల్పపీడన ప్రాంతం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండగా, ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉందని అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం రాబోయే 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉన్నప్పటికీ, దాని ప్రభావం దక్షిణ భారత వాతావరణంపై కొనసాగుతుందని పేర్కొన్నారు.ఇదిలా ఉండగా, రుతుపవన ద్రోణి అమృత్‌సర్ నుంచి పశ్చిమ బెంగాల్ మీదుగా ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉండటంతో పాటు, నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర లక్షద్వీప్ వరకు మరో ద్రోణి కొనసాగుతోంది. అలాగే ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. ఈ వాతావరణ పరిస్థితులన్నీ కలిసి రాష్ట్రంలో మేఘావృత వాతావరణంతో పాటు వర్షాలకు అనుకూల పరిస్థితులను సృష్టిస్తున్నాయి.వాతావరణ శాఖ అంచనాల ప్రకారం జూలై 18, 19 తేదీల్లో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడా ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం కూడా ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ రెండు రోజుల పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే వేడి, తేమ అధికంగా ఉండటంతో అసౌకర్యకరమైన వాతావరణ పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశముందని పేర్కొన్నారు.జూలై 20న కూడా రాష్ట్రంలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముండటంతో రైతులు వ్యవసాయ పనుల్లో, ప్రజలు ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తాజా వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అధికారిక హెచ్చరికలను పాటించాలని వాతావరణ శాఖ విజ్ఞప్తి చేసింది.Location :Visakhapatnam,Andhra Pradeshమరింత చదవండి

Source link