Last Updated:
PM Kisan 24th Installment: PM-KISAN 24వ విడతగా రైతుల ఖాతాల్లో రూ.4,000 జమ చేస్తారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రక్షా బంధన్ సందర్భంగా ప్రత్యేకంగా ఈ మొత్తం అందిస్తారన్న ప్రచారం అవాస్తవమని PIB Fact Check స్పష్టం చేసింది. అంతేకాదు, వైరల్ వీడియో AIతో రూపొందించిన నకిలీ వీడియో అని వెల్లడించింది.
రక్షా బంధన్ సందర్భంగా దేశంలోని రైతులకు PM-KISAN పథకం కింద 24వ విడతగా రూ.4,000 అందజేస్తారని సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేయబోతున్నట్లు పేర్కొంటున్నారు. దీంతో చాలా మంది రైతులు ఈ సమాచారాన్ని నిజమని నమ్మి ఇతరులకు కూడా షేర్ చేస్తున్నారు. అయితే ఈ వైరల్ ప్రచారంపై PIB Fact Check స్పందించి కీలక విషయాలను వెల్లడించింది.

