Last Updated:
త్రివిక్రమ్ సినిమాలకు ఆడియెన్స్‌లో ఉండే అటెన్షన్ అంతా ఇంతా కాదు. అసలు గురూజీ సినిమా వస్తుందంటే చాలు.. అది మినిమం గ్యారెంటీ అని ఫిక్సయ్యారు. ఒక్క అజ్ఞాతవాసీ తప్పితే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఏ సినిమా కూడా ఆడియెన్స్‌ను డిజప్పాయింట్ చేయలేదు.
త్రివిక్రమ్ సినిమాలకు ఆడియెన్స్‌లో ఉండే అటెన్షన్ అంతా ఇంతా కాదు. అసలు గురూజీ సినిమా వస్తుందంటే చాలు.. అది మినిమం గ్యారెంటీ అని ఫిక్సయ్యారు. ఒక్క అజ్ఞాతవాసీ తప్పితే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఏ సినిమా కూడా ఆడియెన్స్‌ను డిజప్పాయింట్ చేయలేదు. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌లో త్రివిక్రమ్ సినిమాలకు యమ డిమాండ్ ఉంటుంది. అలాంటి దర్శకుడు ఏకంగా ఫ్యామిలీ హీరో వెంకీమాతో సినిమా చేస్తున్నాడంటే సాధారణంగానే అంచనాలు పీక్స్‌లో ఉంటాయి. అప్పటికే వీళ్లది క్రేజీ కాంబినేషన్. వీళ్ల కాంబోలో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరీ సినిమాలు కల్ట్ స్టేటస్ తెచ్చుకున్నాయి.
అలాంటిది వీరిద్దరి కలయికలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తీరా రిలీజయ్యే సరికి సినిమా బెడిసి కొట్టింది. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే అనిపించింది కానీ.. సెకండ్ హాఫ్ మాత్రం రాడ్ రంబోలా సినిమా. అసలు ఈ సినిమా చూస్తున్నంత సేపు.. నిజంగానే త్రివిక్రమ్ ఈ సినిమాకు డైరెక్షన్ చేశాడా? లేదంటే కేవలం స్టోరీ ఇచ్చి.. తన అసిస్టెంట్‌తో సినిమా తీయించాడా అనే డౌట్ కూడా అందరిలో వచ్చింది. ఎందుకంటే అంతలా ఈ సినిమా బెడిసికొట్టింది. త్రివిక్రమ్ కెరీర్లోనే మరో వీక్ సినిమాగా ఆదర్శ కుటుంబం నిలిచింది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాలో నటించిన హీరోయిన్ పూజిత పొన్నాడ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. సినిమాలో తనకు మంచి పాత్ర ఇస్తామని చెప్పి చివరకు ఒక్క సన్నివేశానికే పరిమితం చేశారని ఆమె ఆరోపించింది. అంతేకాదు.. తనకు జరిగిన అన్యాయంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజిత పొన్నాడ ‘ఆదర్శ కుటుంబం’ సినిమా సమయంలో తనకు ఎదురైన అనుభవాలను బయటపెట్టింది. మొదట చిత్రబృందం తనను సంప్రదించినప్పుడు సినిమాలో ఎంతో ప్రాధాన్యత ఉన్న పాత్ర ఉంటుందని చెప్పినట్లు వెల్లడించింది. ఈ సినిమా కోసం దర్శకుడు త్రివిక్రమ్ స్వయంగా లుక్ టెస్టులు నిర్వహించి తనను ఎంపిక చేశారని తెలిపింది. అంతేకాకుండా సినిమా రచయిత తనకు పూర్తి కథను వివరించారని, కథ ప్రారంభం నుంచి క్లైమాక్స్ వరకు తన పాత్ర ఉంటుందని హామీ ఇచ్చినట్లు చెప్పుకొచ్చింది.
ముఖ్యంగా నారా రోహిత్‌తో కలిసి తనకు కీలకమైన సన్నివేశాలు ఉంటాయని, కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లలో కూడా నటించాల్సి ఉంటుందని వివరించారట. దీంతో ఆ పాత్రపై నమ్మకంతో అగ్రిమెంట్‌పై సంతకం చేసి అడ్వాన్స్ కూడా తీసుకున్నట్లు పూజిత తెలిపింది. మొదట్లో తనకు చెప్పిన వివరాలను బట్టి సినిమాలో మంచి గుర్తింపు వస్తుందని భావించినట్లు పేర్కొంది.
అయితే షూటింగ్లో కొన్ని రోజులు పాల్గొన్న తర్వాత పరిస్థితులు మారిపోయాయని పూజిత వెల్లడించింది. షూటింగ్ పూర్తయిన తర్వాత దాదాపు మూడు నెలల పాటు చిత్రబృందం నుంచి ఎలాంటి సమాచారం అందలేదని చెప్పింది. ఈ సమయంలో తన పాత్రను తగ్గించే ఆలోచన లేదని, మొదట చెప్పినట్లుగానే సినిమాలో ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చినట్లు తెలిపింది.
కానీ ఆ తర్వాత అసలు విషయం తెలిసి షాక్‌కు గురయ్యానని పూజిత పేర్కొంది. తనకు తెలియకుండానే సినిమాలో తన పాత్రను మరో సీనియర్ నటి భర్తీ చేసినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని ముందుగా తనకు తెలియజేయకపోవడం మరింత బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేసింది. తీరా సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత చూస్తే తన పాత్ర కేవలం ఒక్క సన్నివేశానికే పరిమితమైందని చెప్పింది.
ఆ సన్నివేశాన్ని కూడా తొలగించలేకపోయారని, తిరిగి షూటింగ్ చేయడానికి సమయం లేకపోవడంతో సినిమాలో ఉంచినట్లు తనకు తెలిసిందని పూజిత వెల్లడించింది. అంతేకాకుండా సినిమా క్రెడిట్స్‌లో తన పేరును కూడా చేర్చలేదని ఆరోపించింది. మొదట పూర్తి స్థాయి పాత్ర ఉంటుందని చెప్పి, చివరకు ఒక్క సీన్‌కే పరిమితం చేయడం తనను తీవ్రంగా కలిచివేసిందని తెలిపింది.
ఈ సందర్భంగా పూజిత తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ.. తనకు కీలకమైన పాత్ర ఉంటుందని నమ్మించిన తర్వాత ఇలా చేయడం నమ్మకద్రోహం చేసినట్లేనని వ్యాఖ్యానించింది. ఈ పరిణామాలకు బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించింది.
మొత్తానికి ‘ఆదర్శ కుటుంబం’ సినిమా ఫలితం కంటే ఇప్పుడు పూజిత పొన్నాడ చేసిన ఆరోపణలే టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో తనకు ఎదురైన అనుభవంపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చూడాలి. అయితే ఈ ఆరోపణలపై చిత్రబృందం నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.

