ప్రభన్యూస్

I Hate Marriage Movie: ‘ఐ హేట్ మ్యారేజ్’ మూవీ రివ్యూ… యూత్‌ను ఆకట్టుకుందా? | తెలుగు సినిమా వార్తలు


కథేంటంటే:

జాహ్నవి (జుప్సీ భద్ర), మీనాక్షి (హారిక రాజేందర్), భారతి (సాహితి కృష్ణ) ముగ్గురూ ఓ లేడీస్ హాస్టల్‌లో ఉంటారు. మీనాక్షి ఉద్యోగం చేస్తూ పెళ్లిపై ఆసక్తి లేదని చెబుతూ తనకు నచ్చినట్లు జీవిస్తుంది. భారతి మాత్రం ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వచ్చిన పల్లెటూరి అమ్మాయి. జాబ్ ఇప్పిస్తామని చెప్పి కొందరు మోసం చేయడంతో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటుంది.

ఇక జాహ్నవికి ఓ బాయ్‌ఫ్రెండ్ ఉండాలి, అతనితో తిరగాలి, రొమాన్స్ చేయాలి, జీవితాన్ని ఎంజాయ్ చేయాలనే కోరికలు ఉంటాయి. అయితే పెళ్లి మాత్రం తన తండ్రి చూపించిన అబ్బాయినే చేసుకుంటానని మాట ఇస్తుంది. అందుకే ఎలాంటి ఎమోషనల్ కనెక్షన్ లేకుండా తనతో సమయం గడిపే అబ్బాయి కోసం వెతుకుతుంది. ఈ క్రమంలో సినిమా దర్శకుడు కావాలని ప్రయత్నిస్తున్న రామ్ (సుగి విజయ్) పరిచయమవుతాడు. వీరిద్దరి మధ్య మొదలైన పరిచయం ప్రేమగా ఎలా మారింది? భారతికి ఉద్యోగం వచ్చిందా? మీనాక్షి పెళ్లిపై తన నిర్ణయాన్ని మార్చుకుందా? అనేది మిగతా కథ.

ఎలా ఉందంటే:

ప్రస్తుత యువత ఆలోచనలు, ప్రేమ, పెళ్లి, కుటుంబ విలువలు వంటి అంశాలను కలిపి దర్శకుడు ఈ కథను సిద్ధం చేశారు. ముఖ్యంగా బోల్డ్ కంటెంట్‌తో పాటు సమాజంలో జరుగుతున్న కొన్ని వాస్తవ సంఘటనలను తెరపై చూపించే ప్రయత్నం చేశారు. గతంలో వచ్చిన ‘ఈ రోజుల్లో’, ‘బస్ స్టాప్’, ‘3G లవ్’ వంటి యూత్‌ఫుల్ సినిమాల తరహాలో ఈ చిత్రం సాగుతుంది.

ఫస్ట్ హాఫ్‌లో మూడు ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ కథను ఆసక్తికరంగా ప్రారంభించారు. జాహ్నవి, రామ్ మధ్య పరిచయం, వారి మధ్య జరిగే సంభాషణలు యూత్‌ను ఆకట్టుకుంటాయి. అక్కడక్కడా వచ్చే బోల్డ్ డైలాగ్స్, ఉద్యోగాల పేరుతో జరిగే మోసాలను చూపించిన తీరు బాగుంది. లేడీస్ హాస్టల్ వాచ్‌మెన్‌గా పృథ్వీరాజ్ తన సెటైర్లతో నవ్వించారు. హీరో దర్శకుడు కావాలని ప్రయత్నించడం, కథ రాయడం వంటి అంశాలు సినిమాకు మరో ఆసక్తికరమైన టచ్ ఇచ్చాయి.

సెకండాఫ్‌లో రామ్, జాహ్నవి మధ్య ప్రేమ, ఎమోషన్స్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా ఇద్దరి ఆలోచనల్లో వచ్చే మార్పును చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. మీనాక్షి, ఆమె తల్లి మధ్య పెళ్లి గురించి వచ్చే సంభాషణలు ఆలోచింపజేస్తాయి. మరోవైపు భారతి పాత్ర ద్వారా ఉద్యోగం కోసం అమ్మాయిలు పడే కష్టాలు, తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాలనే తపనను చూపించారు. చివర్లో హాస్టల్‌లో ఉండే అమ్మాయిలందరినీ ఒకే కోణంలో చూడకూడదనే విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేశారు.

ఈ సినిమాలో ప్రధానంగా ఆకట్టుకునేది బోల్డ్ కంటెంట్‌తో పాటు ప్రస్తుత సమాజంలోని కొన్ని అంశాలను చర్చకు తీసుకురావడం. ప్రతి పాత్రకు ఓ ప్రత్యేకమైన ఆలోచన, నేపథ్యం ఉండేలా దర్శకుడు ప్రయత్నించారు. కొన్ని సన్నివేశాలు మరింత బలంగా రాసుకుని ఉంటే సినిమా ఇంకాస్త బాగుండేది. అయినప్పటికీ యూత్‌కు కనెక్ట్ అయ్యే అంశాలు ఇందులో ఉన్నాయి.

ఎవరెలా చేశారంటే:

జాహ్నవి పాత్రలో జుప్సీ భద్ర చక్కగా నటించింది. మోడ్రన్ అమ్మాయిగా, ఎమోషనల్ సన్నివేశాల్లోనూ తన నటనతో మెప్పించింది. సుగి విజయ్ దర్శకుడు కావాలనే కల ఉన్న యువకుడి పాత్రలో సహజంగా నటించారు. హారిక రాజేందర్ బోల్డ్ పాత్రలో ఆకట్టుకోగా, సాహితి కృష్ణ తన పాత్రకు న్యాయం చేసింది. వాచ్‌మెన్‌గా పృథ్వీరాజ్ నవ్వించారు. రవివర్మ, ప్రభావతి, ఇతర నటీనటులు తమ పాత్రల పరిధిలో బాగానే నటించారు.

టెక్నికల్‌గా ఎలా ఉందంటే:

సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ నీట్‌గా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సన్నివేశాలకు మంచి ఎలివేషన్ ఇచ్చింది. పాటలు యావరేజ్‌గా ఉన్నప్పటికీ కథకు అనుగుణంగా సాగుతాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్‌గా: ప్రేమ, పెళ్లి, జెన్‌జీ ఆలోచనలు, కుటుంబ విలువలు వంటి అంశాలను బోల్డ్‌గా చెప్పే ప్రయత్నమే ‘ఐ హేట్ మ్యారేజ్’. జుప్సీ భద్ర నటన, యూత్‌ఫుల్ సన్నివేశాలు, సమాజంలోని కొన్ని వాస్తవాలను చూపించిన తీరు ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్స్ ఇష్టపడేవారు ఓసారి చూడొచ్చు.

రేటింగ్: 3



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 26 November 2026, 11:30 pm Digital Edition : Prabhanews
I Hate Marriage Movie: ‘ఐ హేట్ మ్యారేజ్’ మూవీ రివ్యూ… యూత్‌ను ఆకట్టుకుందా? | తెలుగు సినిమా వార్తలు

కథేంటంటే:జాహ్నవి (జుప్సీ భద్ర), మీనాక్షి (హారిక రాజేందర్), భారతి (సాహితి కృష్ణ) ముగ్గురూ ఓ లేడీస్ హాస్టల్‌లో ఉంటారు. మీనాక్షి ఉద్యోగం చేస్తూ పెళ్లిపై ఆసక్తి లేదని చెబుతూ తనకు నచ్చినట్లు జీవిస్తుంది. భారతి మాత్రం ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వచ్చిన పల్లెటూరి అమ్మాయి. జాబ్ ఇప్పిస్తామని చెప్పి కొందరు మోసం చేయడంతో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటుంది.ఇక జాహ్నవికి ఓ బాయ్‌ఫ్రెండ్ ఉండాలి, అతనితో తిరగాలి, రొమాన్స్ చేయాలి, జీవితాన్ని ఎంజాయ్ చేయాలనే కోరికలు ఉంటాయి. అయితే పెళ్లి మాత్రం తన తండ్రి చూపించిన అబ్బాయినే చేసుకుంటానని మాట ఇస్తుంది. అందుకే ఎలాంటి ఎమోషనల్ కనెక్షన్ లేకుండా తనతో సమయం గడిపే అబ్బాయి కోసం వెతుకుతుంది. ఈ క్రమంలో సినిమా దర్శకుడు కావాలని ప్రయత్నిస్తున్న రామ్ (సుగి విజయ్) పరిచయమవుతాడు. వీరిద్దరి మధ్య మొదలైన పరిచయం ప్రేమగా ఎలా మారింది? భారతికి ఉద్యోగం వచ్చిందా? మీనాక్షి పెళ్లిపై తన నిర్ణయాన్ని మార్చుకుందా? అనేది మిగతా కథ.ఎలా ఉందంటే:ప్రస్తుత యువత ఆలోచనలు, ప్రేమ, పెళ్లి, కుటుంబ విలువలు వంటి అంశాలను కలిపి దర్శకుడు ఈ కథను సిద్ధం చేశారు. ముఖ్యంగా బోల్డ్ కంటెంట్‌తో పాటు సమాజంలో జరుగుతున్న కొన్ని వాస్తవ సంఘటనలను తెరపై చూపించే ప్రయత్నం చేశారు. గతంలో వచ్చిన ‘ఈ రోజుల్లో’, ‘బస్ స్టాప్’, ‘3G లవ్’ వంటి యూత్‌ఫుల్ సినిమాల తరహాలో ఈ చిత్రం సాగుతుంది.ఫస్ట్ హాఫ్‌లో మూడు ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ కథను ఆసక్తికరంగా ప్రారంభించారు. జాహ్నవి, రామ్ మధ్య పరిచయం, వారి మధ్య జరిగే సంభాషణలు యూత్‌ను ఆకట్టుకుంటాయి. అక్కడక్కడా వచ్చే బోల్డ్ డైలాగ్స్, ఉద్యోగాల పేరుతో జరిగే మోసాలను చూపించిన తీరు బాగుంది. లేడీస్ హాస్టల్ వాచ్‌మెన్‌గా పృథ్వీరాజ్ తన సెటైర్లతో నవ్వించారు. హీరో దర్శకుడు కావాలని ప్రయత్నించడం, కథ రాయడం వంటి అంశాలు సినిమాకు మరో ఆసక్తికరమైన టచ్ ఇచ్చాయి.సెకండాఫ్‌లో రామ్, జాహ్నవి మధ్య ప్రేమ, ఎమోషన్స్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా ఇద్దరి ఆలోచనల్లో వచ్చే మార్పును చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. మీనాక్షి, ఆమె తల్లి మధ్య పెళ్లి గురించి వచ్చే సంభాషణలు ఆలోచింపజేస్తాయి. మరోవైపు భారతి పాత్ర ద్వారా ఉద్యోగం కోసం అమ్మాయిలు పడే కష్టాలు, తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాలనే తపనను చూపించారు. చివర్లో హాస్టల్‌లో ఉండే అమ్మాయిలందరినీ ఒకే కోణంలో చూడకూడదనే విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేశారు.ఈ సినిమాలో ప్రధానంగా ఆకట్టుకునేది బోల్డ్ కంటెంట్‌తో పాటు ప్రస్తుత సమాజంలోని కొన్ని అంశాలను చర్చకు తీసుకురావడం. ప్రతి పాత్రకు ఓ ప్రత్యేకమైన ఆలోచన, నేపథ్యం ఉండేలా దర్శకుడు ప్రయత్నించారు. కొన్ని సన్నివేశాలు మరింత బలంగా రాసుకుని ఉంటే సినిమా ఇంకాస్త బాగుండేది. అయినప్పటికీ యూత్‌కు కనెక్ట్ అయ్యే అంశాలు ఇందులో ఉన్నాయి.ఎవరెలా చేశారంటే:జాహ్నవి పాత్రలో జుప్సీ భద్ర చక్కగా నటించింది. మోడ్రన్ అమ్మాయిగా, ఎమోషనల్ సన్నివేశాల్లోనూ తన నటనతో మెప్పించింది. సుగి విజయ్ దర్శకుడు కావాలనే కల ఉన్న యువకుడి పాత్రలో సహజంగా నటించారు. హారిక రాజేందర్ బోల్డ్ పాత్రలో ఆకట్టుకోగా, సాహితి కృష్ణ తన పాత్రకు న్యాయం చేసింది. వాచ్‌మెన్‌గా పృథ్వీరాజ్ నవ్వించారు. రవివర్మ, ప్రభావతి, ఇతర నటీనటులు తమ పాత్రల పరిధిలో బాగానే నటించారు.టెక్నికల్‌గా ఎలా ఉందంటే:సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ నీట్‌గా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సన్నివేశాలకు మంచి ఎలివేషన్ ఇచ్చింది. పాటలు యావరేజ్‌గా ఉన్నప్పటికీ కథకు అనుగుణంగా సాగుతాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.ఫైనల్‌గా: ప్రేమ, పెళ్లి, జెన్‌జీ ఆలోచనలు, కుటుంబ విలువలు వంటి అంశాలను బోల్డ్‌గా చెప్పే ప్రయత్నమే ‘ఐ హేట్ మ్యారేజ్’. జుప్సీ భద్ర నటన, యూత్‌ఫుల్ సన్నివేశాలు, సమాజంలోని కొన్ని వాస్తవాలను చూపించిన తీరు ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్స్ ఇష్టపడేవారు ఓసారి చూడొచ్చు.రేటింగ్: 3

Source link