ప్రభన్యూస్

Anirudh-Kavya Maran: సన్ టీవీ ఉద్యోగులకు అనిరుధ్-కావ్య మారన్ దంపతుల అదిరిపోయే ట్రీట్..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

సన్ టీవీ సంస్థ ఉద్యోగులకు కావ్య మారన్, ఆమె భర్త అనిరుధ్ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. తమ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైన సందర్భంగా ఉద్యోగులతో ఆనందాన్ని పంచుకుంటూ ఈ స్పెషల్ లంచ్ ఏర్పాటు చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

News18
News18

సన్ టీవీ సంస్థ ఉద్యోగులకు కావ్య మారన్, ఆమె భర్త అనిరుధ్ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. తమ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైన సందర్భంగా ఉద్యోగులతో ఆనందాన్ని పంచుకుంటూ ఈ స్పెషల్ లంచ్ ఏర్పాటు చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చెన్నైలోని సన్ టీవీ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఈ విందు నిర్వహించారు. ప్రత్యేకమైన వంటకాలతో ఉద్యోగులకు ఆతిథ్యం ఇచ్చినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

కావ్య మారన్, అనిరుధ్ తమ పెళ్లి వేడుకను ఎంతో ప్రత్యేకంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పెళ్లి ఆనందాన్ని తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులతో కూడా పంచుకుంటున్నారు. ఇందులో భాగంగానే చెన్నైలోని సన్ టీవీ హెడ్ ఆఫీసులో ఉద్యోగుల కోసం ప్రత్యేక లంచ్ ఏర్పాటు చేశారు. సంస్థలో పనిచేసే సిబ్బందితో కలిసి ఈ సంతోషాన్ని పంచుకోవడం పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది.

అయితే ఉద్యోగులకు కావ్య మారన్ దంపతులు ఇచ్చిన ప్రత్యేక బహుమతులు కూడా గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సన్ టీవీలో పనిచేసే ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్, గోల్డ్ కాయిన్స్‌తో పాటు కొత్త దుస్తులను కానుకలుగా అందించినట్లు వీడియోలు బయటకు వచ్చాయి. ఈ వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టడంతో కావ్య మారన్ దంపతుల గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఉద్యోగులకు బంగారు కానుకలు అందించడంపై పలువురు ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు మరోసారి ప్రత్యేక విందు ఏర్పాటు చేయడంతో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.

సాధారణంగా ప్రముఖ సంస్థల అధినేతలు తమ ఉద్యోగులతో ప్రత్యేక సందర్భాలను పంచుకోవడం చూస్తుంటాం. కానీ బంగారు కానుకలు, కొత్త దుస్తులతో పాటు ప్రత్యేక విందు ఏర్పాటు చేయడం మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సంస్థలో పనిచేసే ఉద్యోగులను తమ కుటుంబ సభ్యుల్లా భావిస్తూ ఈ ఏర్పాట్లు చేసినట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా కావ్య మారన్ పేరు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది.

ఇక కావ్య మారన్, అనిరుధ్ వివాహం విషయానికి వస్తే.. నవంబర్ 11న గ్రీస్‌లో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగినట్లు సమాచారం. వీరి పెళ్లికి సంబంధించిన విషయాలు బయటకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వివాహం తర్వాత ఉద్యోగులకు బంగారు కానుకలు అందించడం, ఇప్పుడు ప్రత్యేక లంచ్ ఏర్పాటు చేయడం వంటి విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మొత్తానికి పెళ్లి తర్వాత తమ ఆనందాన్ని సన్ టీవీ ఉద్యోగులతో పంచుకుంటున్న కావ్య మారన్, అనిరుధ్ దంపతుల చర్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 25 November 2026, 9:06 pm Digital Edition : Prabhanews
Anirudh-Kavya Maran: సన్ టీవీ ఉద్యోగులకు అనిరుధ్-కావ్య మారన్ దంపతుల అదిరిపోయే ట్రీట్..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:November 25, 2026 9:05 PM ISTసన్ టీవీ సంస్థ ఉద్యోగులకు కావ్య మారన్, ఆమె భర్త అనిరుధ్ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. తమ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైన సందర్భంగా ఉద్యోగులతో ఆనందాన్ని పంచుకుంటూ ఈ స్పెషల్ లంచ్ ఏర్పాటు చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.News18సన్ టీవీ సంస్థ ఉద్యోగులకు కావ్య మారన్, ఆమె భర్త అనిరుధ్ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. తమ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైన సందర్భంగా ఉద్యోగులతో ఆనందాన్ని పంచుకుంటూ ఈ స్పెషల్ లంచ్ ఏర్పాటు చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చెన్నైలోని సన్ టీవీ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఈ విందు నిర్వహించారు. ప్రత్యేకమైన వంటకాలతో ఉద్యోగులకు ఆతిథ్యం ఇచ్చినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.కావ్య మారన్, అనిరుధ్ తమ పెళ్లి వేడుకను ఎంతో ప్రత్యేకంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పెళ్లి ఆనందాన్ని తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులతో కూడా పంచుకుంటున్నారు. ఇందులో భాగంగానే చెన్నైలోని సన్ టీవీ హెడ్ ఆఫీసులో ఉద్యోగుల కోసం ప్రత్యేక లంచ్ ఏర్పాటు చేశారు. సంస్థలో పనిచేసే సిబ్బందితో కలిసి ఈ సంతోషాన్ని పంచుకోవడం పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది.అయితే ఉద్యోగులకు కావ్య మారన్ దంపతులు ఇచ్చిన ప్రత్యేక బహుమతులు కూడా గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సన్ టీవీలో పనిచేసే ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్, గోల్డ్ కాయిన్స్‌తో పాటు కొత్త దుస్తులను కానుకలుగా అందించినట్లు వీడియోలు బయటకు వచ్చాయి. ఈ వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టడంతో కావ్య మారన్ దంపతుల గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఉద్యోగులకు బంగారు కానుకలు అందించడంపై పలువురు ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు మరోసారి ప్రత్యేక విందు ఏర్పాటు చేయడంతో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.సాధారణంగా ప్రముఖ సంస్థల అధినేతలు తమ ఉద్యోగులతో ప్రత్యేక సందర్భాలను పంచుకోవడం చూస్తుంటాం. కానీ బంగారు కానుకలు, కొత్త దుస్తులతో పాటు ప్రత్యేక విందు ఏర్పాటు చేయడం మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సంస్థలో పనిచేసే ఉద్యోగులను తమ కుటుంబ సభ్యుల్లా భావిస్తూ ఈ ఏర్పాట్లు చేసినట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా కావ్య మారన్ పేరు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది.ఇక కావ్య మారన్, అనిరుధ్ వివాహం విషయానికి వస్తే.. నవంబర్ 11న గ్రీస్‌లో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగినట్లు సమాచారం. వీరి పెళ్లికి సంబంధించిన విషయాలు బయటకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వివాహం తర్వాత ఉద్యోగులకు బంగారు కానుకలు అందించడం, ఇప్పుడు ప్రత్యేక లంచ్ ఏర్పాటు చేయడం వంటి విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.మొత్తానికి పెళ్లి తర్వాత తమ ఆనందాన్ని సన్ టీవీ ఉద్యోగులతో పంచుకుంటున్న కావ్య మారన్, అనిరుధ్ దంపతుల చర్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.మరింత చదవండి

Source link