ప్రభన్యూస్

Trending: ఎవరీ ఆలిస్ ? లక్షల కోట్ల అధిపతి “Nvidia CEO”ని ఎలా పడేసింది? షాకింగ్ నిజాలు |


Last Updated:

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌తో పరిచయం కారణంగా చైనా వ్యాపారవేత్త ఆలిస్ హువాంగ్ పేరు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చకు వచ్చింది. అసలు ఆలిస్ హువాంగ్ ఎవరు? ఆమె గతంలో ఏయే సంస్థల్లో పనిచేశారు? ఎన్విడియా వ్యవహారంలో ఆమె పేరు ఎందుకు ప్రస్తావనకు వచ్చింది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Who Is Alice Huang Her Alleged Links to Nvidia CEO Jensen Huang
Who Is Alice Huang Her Alleged Links to Nvidia CEO Jensen Huang

ప్రపంచవ్యాప్తంగా ఏఐ చిప్స్ తయారీలో అగ్రగామిగా ఉన్న ఎన్విడియా సంస్థ చుట్టూ ఇప్పుడు మరో వివాదం చర్చనీయాంశమైంది. కంపెనీ సీఈఓ జెన్సన్ హువాంగ్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ వార్తల్లోకి వచ్చిన చైనా వ్యాపారవేత్త ఆలిస్ హువాంగ్‌పై గూఢచర్య ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీజింగ్ నిఘా సంస్థ కోసం ఆమె పనిచేసినట్లు అమెరికా అధికారులు గుర్తించారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ వ్యవహారంపై ఎన్విడియా బోర్డు స్వతంత్ర విచారణకు కూడా ఆదేశించింది. అయితే, ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన ఆరోపణలు నిర్ధారణ కాలేదు.

చైనా నిఘా సంస్థతో సంబంధాలున్నాయా?

హువాంగ్ లే అనే పేరుతోనూ గుర్తింపు ఉన్న ఆలిస్ హువాంగ్.. సింగపూర్ కేంద్రంగా పనిచేసే సాంకేతిక సంస్థ మెగాస్పీడ్‌లో గతంలో ఉన్నతస్థాయి ఉద్యోగిగా పనిచేశారు. ఆమెను చైనా నిఘా సంస్థకు చెందిన వ్యక్తిగా అమెరికా అధికారులు గుర్తించినట్లు ది న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. ఆ పత్రిక, ఫైనాన్షియల్ టైమ్స్ ప్రస్తావించిన రహస్య నివేదిక ప్రకారం.. చైనా స్టేట్ సెక్యూరిటీ మంత్రిత్వ శాఖ ఆమెను నియమించుకున్నట్లు ఆరోపణలున్నాయి. జెన్సన్ హువాంగ్‌కు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం, చైనాకు అత్యాధునిక ఏఐ చిప్స్ విక్రయించేందుకు ఎన్విడియా చేస్తున్న ప్రయత్నాలపై ప్రభావం చూపడం ఆమెకు అప్పగించిన లక్ష్యాలుగా ఆ నివేదికలో పేర్కొన్నట్లు కథనాలు వెల్లడించాయి.

అయితే, 63 ఏళ్ల జెన్సన్ హువాంగ్‌కు ఆలిస్‌తో కుటుంబ సంబంధం లేదు. తైవాన్‌లోని తైపీలో జరిగిన బహిరంగ కార్యక్రమాల్లో ఆమె ఆయనతో కలిసి కనిపించడంతో ఈ పరిచయాలపై దృష్టి పడినట్లు సమాచారం.

మీడియా నుంచి ఆర్థిక రంగం వరకు..

చైనా ప్రైవేట్ ఫండ్ డేటాబేస్‌లోని వివరాల ప్రకారం ఆలిస్ గతంలో హునాన్ టీవీ, ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీసీటీవీలో విలేకరిగా పనిచేశారు. హెచ్‌ఎస్‌బీసీ ప్రైవేట్ బ్యాంకింగ్ విభాగం అధ్యక్షుడికి సహాయకురాలిగా కూడా వ్యవహరించినట్లు సమాచారం. అనంతరం సీఐటీఐసీ సెక్యూరిటీస్‌లో ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. షాంఘై హెక్సీ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఫండ్ మేనేజర్ బాధ్యతలు నిర్వహించినట్లు చైనా పెట్టుబడుల రికార్డులు సూచిస్తున్నాయి. ఈ సంస్థకు గేమింగ్ కంపెనీ 7రోడ్‌తో సంబంధాలున్నట్లు తెలుస్తోంది.

ఆమె ఉద్యోగ వివరాలపై సందేహాలు

ఆమె మీడియా రంగంలో పనిచేసినట్లు చెప్పిన వివరాలపై ప్రశ్నలు తలెత్తాయి. హునాన్ టీవీకి చెందిన ఓ అధికారి *ది న్యూయార్క్ పోస్ట్*తో మాట్లాడుతూ ఆలిస్ గురించి తనకు తెలియదని పేర్కొన్నారు. సీసీటీవీ వెబ్‌సైట్‌లోనూ ఆమె ప్రొఫైల్ కనిపించలేదని ఆ పత్రిక తెలిపింది. ఈ నేపథ్యంలో ఎన్విడియా బోర్డు సంబంధిత ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టింది. జెన్సన్ హువాంగ్ తన భార్యకు నమ్మకద్రోహం చేసినట్లు అంగీకరించినప్పటికీ, ఆ వ్యవహారంలో ఆలిస్ హువాంగ్ పేరును ప్రస్తావించలేదు. ఆమెపై గూఢచర్య ఆరోపణలు, జెన్సన్‌తో సంబంధాలపై వచ్చిన కథనాలు ఇంకా పరిశీలనలోనే ఉన్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 09 November 2026, 8:06 pm Digital Edition : Prabhanews
Trending: ఎవరీ ఆలిస్ ? లక్షల కోట్ల అధిపతి “Nvidia CEO”ని ఎలా పడేసింది? షాకింగ్ నిజాలు |

Last Updated:Nov 09, 2026 7:12 PM ISTప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌తో పరిచయం కారణంగా చైనా వ్యాపారవేత్త ఆలిస్ హువాంగ్ పేరు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చకు వచ్చింది. అసలు ఆలిస్ హువాంగ్ ఎవరు? ఆమె గతంలో ఏయే సంస్థల్లో పనిచేశారు? ఎన్విడియా వ్యవహారంలో ఆమె పేరు ఎందుకు ప్రస్తావనకు వచ్చింది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Who Is Alice Huang Her Alleged Links to Nvidia CEO Jensen Huangప్రపంచవ్యాప్తంగా ఏఐ చిప్స్ తయారీలో అగ్రగామిగా ఉన్న ఎన్విడియా సంస్థ చుట్టూ ఇప్పుడు మరో వివాదం చర్చనీయాంశమైంది. కంపెనీ సీఈఓ జెన్సన్ హువాంగ్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ వార్తల్లోకి వచ్చిన చైనా వ్యాపారవేత్త ఆలిస్ హువాంగ్‌పై గూఢచర్య ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీజింగ్ నిఘా సంస్థ కోసం ఆమె పనిచేసినట్లు అమెరికా అధికారులు గుర్తించారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ వ్యవహారంపై ఎన్విడియా బోర్డు స్వతంత్ర విచారణకు కూడా ఆదేశించింది. అయితే, ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన ఆరోపణలు నిర్ధారణ కాలేదు.చైనా నిఘా సంస్థతో సంబంధాలున్నాయా?హువాంగ్ లే అనే పేరుతోనూ గుర్తింపు ఉన్న ఆలిస్ హువాంగ్.. సింగపూర్ కేంద్రంగా పనిచేసే సాంకేతిక సంస్థ మెగాస్పీడ్‌లో గతంలో ఉన్నతస్థాయి ఉద్యోగిగా పనిచేశారు. ఆమెను చైనా నిఘా సంస్థకు చెందిన వ్యక్తిగా అమెరికా అధికారులు గుర్తించినట్లు ది న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. ఆ పత్రిక, ఫైనాన్షియల్ టైమ్స్ ప్రస్తావించిన రహస్య నివేదిక ప్రకారం.. చైనా స్టేట్ సెక్యూరిటీ మంత్రిత్వ శాఖ ఆమెను నియమించుకున్నట్లు ఆరోపణలున్నాయి. జెన్సన్ హువాంగ్‌కు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం, చైనాకు అత్యాధునిక ఏఐ చిప్స్ విక్రయించేందుకు ఎన్విడియా చేస్తున్న ప్రయత్నాలపై ప్రభావం చూపడం ఆమెకు అప్పగించిన లక్ష్యాలుగా ఆ నివేదికలో పేర్కొన్నట్లు కథనాలు వెల్లడించాయి.అయితే, 63 ఏళ్ల జెన్సన్ హువాంగ్‌కు ఆలిస్‌తో కుటుంబ సంబంధం లేదు. తైవాన్‌లోని తైపీలో జరిగిన బహిరంగ కార్యక్రమాల్లో ఆమె ఆయనతో కలిసి కనిపించడంతో ఈ పరిచయాలపై దృష్టి పడినట్లు సమాచారం.మీడియా నుంచి ఆర్థిక రంగం వరకు..చైనా ప్రైవేట్ ఫండ్ డేటాబేస్‌లోని వివరాల ప్రకారం ఆలిస్ గతంలో హునాన్ టీవీ, ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీసీటీవీలో విలేకరిగా పనిచేశారు. హెచ్‌ఎస్‌బీసీ ప్రైవేట్ బ్యాంకింగ్ విభాగం అధ్యక్షుడికి సహాయకురాలిగా కూడా వ్యవహరించినట్లు సమాచారం. అనంతరం సీఐటీఐసీ సెక్యూరిటీస్‌లో ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. షాంఘై హెక్సీ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఫండ్ మేనేజర్ బాధ్యతలు నిర్వహించినట్లు చైనా పెట్టుబడుల రికార్డులు సూచిస్తున్నాయి. ఈ సంస్థకు గేమింగ్ కంపెనీ 7రోడ్‌తో సంబంధాలున్నట్లు తెలుస్తోంది.ఆమె ఉద్యోగ వివరాలపై సందేహాలుఆమె మీడియా రంగంలో పనిచేసినట్లు చెప్పిన వివరాలపై ప్రశ్నలు తలెత్తాయి. హునాన్ టీవీకి చెందిన ఓ అధికారి *ది న్యూయార్క్ పోస్ట్*తో మాట్లాడుతూ ఆలిస్ గురించి తనకు తెలియదని పేర్కొన్నారు. సీసీటీవీ వెబ్‌సైట్‌లోనూ ఆమె ప్రొఫైల్ కనిపించలేదని ఆ పత్రిక తెలిపింది. ఈ నేపథ్యంలో ఎన్విడియా బోర్డు సంబంధిత ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టింది. జెన్సన్ హువాంగ్ తన భార్యకు నమ్మకద్రోహం చేసినట్లు అంగీకరించినప్పటికీ, ఆ వ్యవహారంలో ఆలిస్ హువాంగ్ పేరును ప్రస్తావించలేదు. ఆమెపై గూఢచర్య ఆరోపణలు, జెన్సన్‌తో సంబంధాలపై వచ్చిన కథనాలు ఇంకా పరిశీలనలోనే ఉన్నాయి.మరింత చదవండి

Source link