మరోవైపు పీఎఫ్ సభ్యుల సమస్యలను పరిష్కరించడంలోనూ EPFO ప్రత్యేక చర్యలు చేపడుతోంది. కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 2026లో నిర్వహించిన స్పెషల్ క్యాంపెయిన్ 6లో భాగంగా మొత్తం 2,36,021 ప్రజా ఫిర్యాదులను పరిష్కరించింది. వాస్తవానికి 2,05,000 ఫిర్యాదులను పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, అంతకంటే 15.1 శాతం ఎక్కువ ఫిర్యాదులను పరిష్కరించింది. ఇందులో EPFO సొంత ఫిర్యాదుల పోర్టల్ అయిన EPFiGMS ద్వారా 2,02,984 ఫిర్యాదులను పరిష్కరించింది. ఈ విభాగంలో 1,80,000 ఫిర్యాదులను పరిష్కరించాలనే లక్ష్యాన్ని అధిగమించింది. CPGRAMS ద్వారా మరో 33,037 ఫిర్యాదులను పరిష్కరించింది.

