ప్రభన్యూస్

Crime News: స్నేహితులతో కలిసి ప్రియురాలిపై అత్యాచారం.. మృత్యువుతో పోరాడి మృతి.. |


Last Updated:

దళిత బాలికపై ఆమెకు పరిచయమున్న యువకుడు, అతడి అన్న, స్నేహితుడు కలిసి అత్యాచారం చేసి దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన బాలిక ఆరు రోజుల పాటు మృత్యువుతో పోరాడి కన్నుమూసింది. అసలు అక్టోబర్ 31న ఏం జరిగింది? ముగ్గురు నిందితులను పోలీసులు ఎలా పట్టుకున్నారు?

News18
News18

17 ఏళ్ల దళిత బాలికపై అత్యాచారం చేసి, తీవ్రంగా దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. బాధితురాలు ఆరు రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు ప్రాణాలు కోల్పోయింది. ఆగ్రాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించింది. ఈ ఘటనలో నిందితుల్లో ఒకరు బాలికకు పరిచయమున్న యువకుడు కాగా, అతడి అన్న, స్నేహితుడు కూడా ఈ నేరంలో పాల్గొన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

అక్టోబర్ 31న ఇంటి నుంచి వెళ్లిన బాలిక

ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 31వ తేదీ సాయంత్రం కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. తెలిసినవారు, స్నేహితులను సంప్రదిస్తూ పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. నవంబర్ 1వ తేదీ ఉదయం ఇంటికి సుమారు కిలోమీటరు దూరంలోని పొలంలో ఓ స్థానికుడు ఆమెను అపస్మారక స్థితిలో గుర్తించాడు. శరీరంపై గాయాలు ఉండటంతో తొలుత స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు పెద్ద ఆసుపత్రికి పంపించారు.

ముగ్గురు నిందితుల అరెస్ట్

పోలీసుల కథనం ప్రకారం.. బాలికతో సుమారు ఆరు నెలలుగా పరిచయం ఉన్నట్లు ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్న రిషి యాదవ్ (21) విచారణలో తెలిపాడు. అక్టోబర్ 31న ఆమెను పొలానికి పిలిచి అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఆశిక్ అలియాస్ శివాంశు (24) కూడా ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించగా, బాలిక ప్రతిఘటించినట్లు పోలీసులు వెల్లడించారు. రిషి అన్న జగత్ యాదవ్ (28) కూడా అక్కడే ఉన్నట్లు తెలిపారు. ముగ్గురూ కలిసి చెప్పులతో దాడి చేసి, గొంతు నులిమేందుకు ప్రయత్నించడంతో ఆమె స్పృహ కోల్పోయిందని పోలీసుల వివరాలు చెబుతున్నాయి.

నవంబర్ 2న జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌లో రిషి, జగత్ కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరుసటి రోజు ఆశిక్‌ను అదుపులోకి తీసుకున్నారు. సాంకేతిక నిఘా, ఫోన్ కాల్ వివరాల పరిశీలన ద్వారా ముగ్గురి ప్రమేయాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వీరంతా ఇతర వెనుకబడిన తరగతులకు (ఓబీసీ) చెందినవారు. ప్రస్తుతం ముగ్గురూ జైలులో ఉన్నారు.

పరిహారం కోరుతున్న కుటుంబ సభ్యులు

ఆగ్రాలో బాలికకు పోస్టుమార్టం నిర్వహించినప్పటికీ నివేదిక ఇంకా అందలేదని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. ఆమె మెడపై గాయాలున్నట్లు వెల్లడించారు. బాలిక మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు నిందితులకు కఠిన శిక్షతో పాటు తగిన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొందరు స్థానిక సంస్థల సభ్యులతో కలిసి నిరసనకు ప్రయత్నించడంతో ఉన్నతాధికారులు గ్రామానికి చేరుకున్నారు. గ్యాంగ్‌స్టర్స్ చట్టం కింద చర్యలు తీసుకోవడంతో పాటు నిందితుల ఆస్తులను జప్తు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. శుక్రవారం సాయంత్రం బాలిక అంత్యక్రియలు నిర్వహించారు.

ఏడుగురు సంతానంలో ఆమె చిన్నదని, రోజువారీ కూలీగా పనిచేసే తనకు చెల్లెలి మృతి తీరని లోటని ఆమె అన్న తెలిపారు. కుటుంబం చేసిన కొన్ని డిమాండ్లపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 09 November 2026, 6:02 pm Digital Edition : Prabhanews
Crime News: స్నేహితులతో కలిసి ప్రియురాలిపై అత్యాచారం.. మృత్యువుతో పోరాడి మృతి.. |

Last Updated:Nov 09, 2026 5:46 PM ISTదళిత బాలికపై ఆమెకు పరిచయమున్న యువకుడు, అతడి అన్న, స్నేహితుడు కలిసి అత్యాచారం చేసి దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన బాలిక ఆరు రోజుల పాటు మృత్యువుతో పోరాడి కన్నుమూసింది. అసలు అక్టోబర్ 31న ఏం జరిగింది? ముగ్గురు నిందితులను పోలీసులు ఎలా పట్టుకున్నారు?
News1817 ఏళ్ల దళిత బాలికపై అత్యాచారం చేసి, తీవ్రంగా దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. బాధితురాలు ఆరు రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు ప్రాణాలు కోల్పోయింది. ఆగ్రాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించింది. ఈ ఘటనలో నిందితుల్లో ఒకరు బాలికకు పరిచయమున్న యువకుడు కాగా, అతడి అన్న, స్నేహితుడు కూడా ఈ నేరంలో పాల్గొన్నట్లు పోలీసులు చెబుతున్నారు.అక్టోబర్ 31న ఇంటి నుంచి వెళ్లిన బాలికఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 31వ తేదీ సాయంత్రం కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. తెలిసినవారు, స్నేహితులను సంప్రదిస్తూ పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. నవంబర్ 1వ తేదీ ఉదయం ఇంటికి సుమారు కిలోమీటరు దూరంలోని పొలంలో ఓ స్థానికుడు ఆమెను అపస్మారక స్థితిలో గుర్తించాడు. శరీరంపై గాయాలు ఉండటంతో తొలుత స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు పెద్ద ఆసుపత్రికి పంపించారు.ముగ్గురు నిందితుల అరెస్ట్పోలీసుల కథనం ప్రకారం.. బాలికతో సుమారు ఆరు నెలలుగా పరిచయం ఉన్నట్లు ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్న రిషి యాదవ్ (21) విచారణలో తెలిపాడు. అక్టోబర్ 31న ఆమెను పొలానికి పిలిచి అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఆశిక్ అలియాస్ శివాంశు (24) కూడా ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించగా, బాలిక ప్రతిఘటించినట్లు పోలీసులు వెల్లడించారు. రిషి అన్న జగత్ యాదవ్ (28) కూడా అక్కడే ఉన్నట్లు తెలిపారు. ముగ్గురూ కలిసి చెప్పులతో దాడి చేసి, గొంతు నులిమేందుకు ప్రయత్నించడంతో ఆమె స్పృహ కోల్పోయిందని పోలీసుల వివరాలు చెబుతున్నాయి.నవంబర్ 2న జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌లో రిషి, జగత్ కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరుసటి రోజు ఆశిక్‌ను అదుపులోకి తీసుకున్నారు. సాంకేతిక నిఘా, ఫోన్ కాల్ వివరాల పరిశీలన ద్వారా ముగ్గురి ప్రమేయాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వీరంతా ఇతర వెనుకబడిన తరగతులకు (ఓబీసీ) చెందినవారు. ప్రస్తుతం ముగ్గురూ జైలులో ఉన్నారు.పరిహారం కోరుతున్న కుటుంబ సభ్యులుఆగ్రాలో బాలికకు పోస్టుమార్టం నిర్వహించినప్పటికీ నివేదిక ఇంకా అందలేదని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. ఆమె మెడపై గాయాలున్నట్లు వెల్లడించారు. బాలిక మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు నిందితులకు కఠిన శిక్షతో పాటు తగిన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొందరు స్థానిక సంస్థల సభ్యులతో కలిసి నిరసనకు ప్రయత్నించడంతో ఉన్నతాధికారులు గ్రామానికి చేరుకున్నారు. గ్యాంగ్‌స్టర్స్ చట్టం కింద చర్యలు తీసుకోవడంతో పాటు నిందితుల ఆస్తులను జప్తు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. శుక్రవారం సాయంత్రం బాలిక అంత్యక్రియలు నిర్వహించారు.ఏడుగురు సంతానంలో ఆమె చిన్నదని, రోజువారీ కూలీగా పనిచేసే తనకు చెల్లెలి మృతి తీరని లోటని ఆమె అన్న తెలిపారు. కుటుంబం చేసిన కొన్ని డిమాండ్లపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.మరింత చదవండి

Source link