ప్రభన్యూస్

Sharwanand: శర్వానంద్ భోగి మూవీ రిలీజ్ పోస్ట్‌పోన్.. మరి థియేటర్స్ లోకి వచ్చేది ఎప్పుడు? | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

హీరో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ కాంబోలో వస్తున్న భోగి సినిమాను అనూహ్యంగా వాయిదా వేశారు మేకర్స్. అతి త్వరలో కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని తెలిపారు.

News18
News18

యంగ్ అండ్ వర్సటైల్ హీరో శర్వానంద్ (Sharwanand), మాస్ డైరెక్టర్ సంపత్ నంది (Sampath Nandi) క్రేజీ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘భోగి’ (భోగి). ఈ సినిమాను నవంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ముందుగా ప్లాన్ చేశారు. అయితే, అనుకోని కారణాల వల్ల సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ‘శ్రీ సత్యసాయి ఆర్ట్స్’ అధికారికంగా ప్రకటించింది.

“మా అందరికీ అత్యంత ప్రత్యేకమైన ప్రాజెక్ట్ అయిన బోగి మూవీ కోసం ప్రేక్షకులకు సిల్వర్ స్క్రీన్ పై ఒక గొప్ప విజువల్ ఎక్స్ పీరియన్స్, అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని అందించాలనే బలమైన సంకల్పంతో మొదటి నుంచీ ఎంతో ప్యాషన్‌తో, అంకితభావంతో పనిచేస్తున్నాం. అయితే కొన్ని ఊహించని సాంకేతిక కారణాల వల్ల సినిమా విడుదలను వాయిదా వేయక తప్పట్లేదు. ఈ వాయిదా విషయంలో సోషల్ మీడియాలో వచ్చే ఎలాంటి పుకార్లను, ఊహాగానాలను ఎవరూ నమ్మకండి. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ అధికారికంగా అనౌన్స్ చేస్తాం” అని పేర్కొన్నారు మేకర్స్.

సినిమా ప్లానింగ్ లో జరిగిన ఈ మార్పు వల్ల కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపిన మేకర్స్.. సినిమా కొంచెం లేట్ అయినా, ప్రేక్షకులు ఎదురుచూసే సమయానికి 100 శాతం న్యాయం చేస్తామని గట్టి హామీ ఇచ్చారు. శర్వానంద్ తన కెరీర్ లోనే తొలిసారిగా అవుట్ అండ్ అవుట్ మాస్, రగ్గడ్ లుక్ లో నటిస్తున్న సినిమా ఇది. 1960ల కాలం నాటి పీరియాడిక్ నేపథ్యంలో, తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఒక ఊహాజనిత (ఫిక్షనల్) గ్రామం చుట్టూ తిరిగే పవర్ ఫుల్ కథాంశంతో దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రాన్ని హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటికే శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పాత్ర పరిచయ గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఇందులో శర్వానంద్ మునుపెన్నడూ చూడని క్రూరమైన మాస్ అవతార్ లో ‘గంగ’ అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులో శర్వానంద్ సరసన క్యూట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్, గ్లామరస్ తార డింపుల్ హయతి హీరోయిన్లుగా సందడి చేయనున్నారు. సాంకేతికంగా ఈ సినిమాను అత్యున్నత ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తుండగా, కిశోర్ కుమార్ అరోకియా సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం త్వరలోనే సరికొత్త విడుదల తేదీతో ప్రేక్షకుల ముందుకు రానుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 12 November 2026, 10:31 am Digital Edition : Prabhanews
Sharwanand: శర్వానంద్ భోగి మూవీ రిలీజ్ పోస్ట్‌పోన్.. మరి థియేటర్స్ లోకి వచ్చేది ఎప్పుడు? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 12, 2026 10:02 AM ISTహీరో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ కాంబోలో వస్తున్న భోగి సినిమాను అనూహ్యంగా వాయిదా వేశారు మేకర్స్. అతి త్వరలో కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని తెలిపారు. News18యంగ్ అండ్ వర్సటైల్ హీరో శర్వానంద్ (Sharwanand), మాస్ డైరెక్టర్ సంపత్ నంది (Sampath Nandi) క్రేజీ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'భోగి' (భోగి). ఈ సినిమాను నవంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ముందుగా ప్లాన్ చేశారు. అయితే, అనుకోని కారణాల వల్ల సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 'శ్రీ సత్యసాయి ఆర్ట్స్' అధికారికంగా ప్రకటించింది."మా అందరికీ అత్యంత ప్రత్యేకమైన ప్రాజెక్ట్ అయిన బోగి మూవీ కోసం ప్రేక్షకులకు సిల్వర్ స్క్రీన్ పై ఒక గొప్ప విజువల్ ఎక్స్ పీరియన్స్, అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని అందించాలనే బలమైన సంకల్పంతో మొదటి నుంచీ ఎంతో ప్యాషన్‌తో, అంకితభావంతో పనిచేస్తున్నాం. అయితే కొన్ని ఊహించని సాంకేతిక కారణాల వల్ల సినిమా విడుదలను వాయిదా వేయక తప్పట్లేదు. ఈ వాయిదా విషయంలో సోషల్ మీడియాలో వచ్చే ఎలాంటి పుకార్లను, ఊహాగానాలను ఎవరూ నమ్మకండి. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ అధికారికంగా అనౌన్స్ చేస్తాం" అని పేర్కొన్నారు మేకర్స్.సినిమా ప్లానింగ్ లో జరిగిన ఈ మార్పు వల్ల కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపిన మేకర్స్.. సినిమా కొంచెం లేట్ అయినా, ప్రేక్షకులు ఎదురుచూసే సమయానికి 100 శాతం న్యాయం చేస్తామని గట్టి హామీ ఇచ్చారు. శర్వానంద్ తన కెరీర్ లోనే తొలిసారిగా అవుట్ అండ్ అవుట్ మాస్, రగ్గడ్ లుక్ లో నటిస్తున్న సినిమా ఇది. 1960ల కాలం నాటి పీరియాడిక్ నేపథ్యంలో, తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఒక ఊహాజనిత (ఫిక్షనల్) గ్రామం చుట్టూ తిరిగే పవర్ ఫుల్ కథాంశంతో దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రాన్ని హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు.ఇప్పటికే శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పాత్ర పరిచయ గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఇందులో శర్వానంద్ మునుపెన్నడూ చూడని క్రూరమైన మాస్ అవతార్ లో 'గంగ' అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులో శర్వానంద్ సరసన క్యూట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్, గ్లామరస్ తార డింపుల్ హయతి హీరోయిన్లుగా సందడి చేయనున్నారు. సాంకేతికంగా ఈ సినిమాను అత్యున్నత ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తుండగా, కిశోర్ కుమార్ అరోకియా సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం త్వరలోనే సరికొత్త విడుదల తేదీతో ప్రేక్షకుల ముందుకు రానుంది.మరింత చదవండి

Source link