ప్రస్తుతం డీడీఈ సదుపాయం 22 రాష్ట్రాల్లో అందుబాటులో ఉంది. అవి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అసోం, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్. అలాగే ఐదు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా ఈ సదుపాయం ఉంది. అవి అండమాన్ అండ్ నికోబార్, ఢిల్లీ, జమ్మూ అండ్ కశ్మీర్, లడఖ్, పుదుచ్చేరి. బ్యాంకులో సాలరీ ప్యాకేజ్ అకౌంట్ ఉన్న జీతం తీసుకునే ఉద్యోగులు డిజి పీఎల్‌కు అర్హులు. ప్రభుత్వ ఉద్యోగులు, డిఫెన్స్ ఉద్యోగులకు కనీస నెట్ నెలవారీ ఆదాయం రూ.20,000 ఉండాలి. కార్పొరేట్ ఉద్యోగులకు కనీస నెట్ నెలవారీ ఆదాయం రూ.25,000 ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)

